hyderabadupdates.com movies 8 గంటల పని… దీపికకు వ్యతిరేకంగా భర్త

8 గంటల పని… దీపికకు వ్యతిరేకంగా భర్త

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే స్పిరిట్, కల్కి-2 చిత్రాల నుంచి తప్పుకోవడం ఆ మధ్య చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అందుక్కారణం ఆమె పెట్టిన కొన్ని షరతులే కారణమని వార్తలు వచ్చాయి. అందులో ఒకటి 8 గంటల పని విధానం. రోజుకు కచ్చితంగా 8 గంటలే పని చేస్తానని.. అంతకుమించి కుదరదని ఆమె తేల్చి చెప్పడం.. దీనికి తోడు వేరే డిమాండ్లు కూడా చేయడంతో తప్పక ఆ రెండు సినిమాల నుంచి మేకర్స్ ఆమెను తప్పించినట్లు ప్రచారం జరిగింది.

తర్వాత ఓ ఇంటర్వ్యూలో ఆమె 8 గంటల పని విధానం విషయంలో తాను కచ్చితంగా ఉంటానని ఆమె తేల్చి చెప్పింది. కొందరు సినీ జనాలు దీన్ని సమర్థించారు. ఎక్కువమంది వ్యతిరేకించారు. ఐతే స్వయంగా దీపిక భర్త రణ్వీర్ సింగ్.. దీపికకు వ్యతిరేకంగా నిలవడం విశేషం. 8 గంటల పని విధానానికి కచ్చితంగా కట్టుబడి ఉండాలంటే కష్టమని అతను అభిప్రాయపడ్డాడు.

కాకపోతే అతను ఆ వ్యాఖ్యలు చేసింది ఇప్పుడు కాదు. 2022లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రణ్వీర్ ఈ కామెంట్స్ చేశాడు. ఇప్పుడు దీపిక 8 గంటల పని విధానానికి బ్రాండ్ అంబాసిడర్‌లా మారిన నేపథ్యంలో తన పాత కామెంట్ల తాలూకు వీడియో వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో.

‘‘చాలాసార్లు జనాలు పని సమయాల గురించి కంప్లైంట్లు చేస్తుంటారు. 8 గంటల షిఫ్ట్ అని చెప్పి 10-12 గంటలు పని చేయించుకుంటున్నారు అని అంటుంటారు. కానీ మనం అనుకున్న పని 8 గంటల్లో పూర్తి కాకపోతే.. కొంచెం అదనపు సమయం పని చేయాల్సి ఉంటుంది’’ అని రణ్వీర్ ఈ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. మరి ఇప్పుడు తన భార్య 8 గంటల పని విధానం విషయంలో కచ్చితంగా ఉంటున్న నేపథ్యంలో రణ్వీర్ తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడా.. లేక పాత కామెంట్లకే కట్టుబడి ఉంటాడా అన్నది ఆసక్తికరం.

Related Post

సోనియా గాంధీకి ఏమైంది?సోనియా గాంధీకి ఏమైంది?

కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ మరోసారి ఆసుపత్రిలో చేరారు. సోమవారం సాయంత్రం ఆమె ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరడంతో పార్టీ వర్గాల్లో కాస్త ఆందోళన మొదలైంది. ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో వెంటనే వైద్యుల పర్యవేక్షణలోకి తీసుకువెళ్లారు. గత

ఆంధ్రకింగ్ కొంచెం ముందు వచ్చి ఉంటేఆంధ్రకింగ్ కొంచెం ముందు వచ్చి ఉంటే

ఈ నెలాఖరులో విడుదల కాబోతున్న ఆంధ్రకింగ్ తాలూకా మీద పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. టాలీవుడ్ కు కొత్తగా పరిచయమవుతున్న వివేక్ మెర్విన్ ఇచ్చిన పాటలు ఛార్ట్ బస్టర్ కావడంతో పాటు సినిమా విడుదలయ్యాక మరింత రీచ్ తెచ్చుకుంటాయనే నమ్మకం మేకర్స్ లో