hyderabadupdates.com movies 800 కోట్ల సినిమా అప్పుడే బుల్లితెరపై

800 కోట్ల సినిమా అప్పుడే బుల్లితెరపై

థియేటర్, ఓటిటి మధ్య కేవలం ఇరవై ఎనిమిది రోజుల నిడివి మాత్రమే ఉండటం పట్ల బయ్యర్ వర్గాలు ఎంతగా మొత్తుకుంటున్నా పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. ఇంత తక్కువ గ్యాప్ అయితేనే నిర్మాత కోరుకున్న మొత్తాన్ని డిజిటల్ సంస్థలు ఆఫర్ చేయడం వల్ల ఎస్ అనడం తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోతోంది. హిందీ మల్టీప్లెక్సుల తరహాలో ఇక్కడ నిబంధనలు పెట్టే ఛాన్స్ లేకపోవడంతో ప్రొడ్యూసర్లకు ఒక మేలు ఒక చెడు జరుగుతోంది. హిందీతో సహా అన్ని భాషల్లో సంచలన విజయం సాధించిన కాంతార చాప్టర్ 1 ఏ లెజెండ్ ఇదే బాటలో అక్టోబర్ 31నే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది.

నిజానికి కాంతారా చాప్టర్ 1 బాక్సాఫీస్ వద్ద ఇంకా రన్ కొనసాగిస్తోంది. తర్వాత వచ్చిన కొత్త రిలీజులేవి దాని స్థాయిలో లేకపోవడంతో థియేటర్ రన్ కు పగ్గాలు లేకుండా పోయాయి. 800 కోట్లు దాటేసి వేయి కోట్ల వైపు పరుగులు పెడుతున్న టైంలో ఇలా హఠాత్తుగా ఓటిటి డేట్ రావడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే కర్ణాటకలో కాంతార ఇప్పటికీ స్ట్రాంగ్ గానే ఉంది. వీకెండ్ బుకింగ్స్ అదరహో అనిపించేలా జరుగుతున్నాయి. ఇంకొంచెం ఓపిక పడితే వెయ్యి కోట్ల క్లబ్బు సాధ్యమయ్యేదని అభిమానులు వాపోతున్నారు. అయితే హోంబాలే ఫిలింస్ సలార్, కెజిఎఫ్ విషయంలోనూ ఇదే స్ట్రాటజీ పాటించడం మర్చిపోకూడదు.

ఈ డిబేట్లు ఎన్ని సార్లు జరిగినా పరిష్కారం మాత్రం దొరకడం లేదు. కాసేపు అనుకోవడం తర్వాత కథ మళ్ళీ మొదటికే రావడం పరిపాటిగా మారింది. అయితే కాంతారా లాంటి సక్సెస్ ఫుల్ మూవీస్ మాత్రం కొంత ఆగి వస్తే బాగుంటుందనే అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాల్లోనే కాదు ఆడియన్స్ లోనూ ఉంది. రిషబ్ శెట్టి కెరీర్ లోనే కాక శాండల్ వుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలబడిన కాంతార చాప్టర్ 1 హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ పెద్ద మొత్తమే చెల్లించింది. అంత సొమ్ము రికవరీ కావాలంటే ఎర్లీ ప్రీమియర్లు తప్ప వేరే మార్గం లేదు. ఇప్పుడీ ఓటిటి రిలీజ్ కోసం ప్రత్యేక ప్రమోషన్లు చేయబోతున్నారు.

Related Post

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడి వైసీపీని మట్టి కరిపించాయి. కూటమిలోని మూడు పార్టీల మధ్య చిన్న చిన్న సమస్యలుండడం సహజం. కానీ,

Crazy Fun Trailer for ‘Gladiator Underground’ Thai Martial Arts Movie
Crazy Fun Trailer for ‘Gladiator Underground’ Thai Martial Arts Movie

“This tournament is the ultimate convergence of chaos and order.” Samuel Goldwyn Films has unveiled an official trailer for a movie called Gladiator Underground, a martial arts action thriller. Obviously