hyderabadupdates.com Gallery 8న ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

8న ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

8న ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు post thumbnail image

అమరావతి : ఈ నెల 8న జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రులు ఎస్.సవిత, గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. అమరావతిలోని పేరెడ్స్ గ్రౌండ్ లో జరగనున్న ఈ వేడుకల సందర్భంగా మహిళలకు ఉపాధి కల్పనే లక్ష్యంగా 36 ఎంవోయూలు చేసుకోనున్నట్లు తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సెర్ప్, చేనేత, జౌళి శాఖ, సీఆర్డీయే, గుంటూరు జిల్లా అధికారులతో మంత్రులు సవిత, సంధ్యారాణి సమావేశం నిర్వహించారు. అమరావతిలోని పేరెడ్స్ గ్రౌండ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఈ వేడుకలను పకడ్బందీగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారన్నారు.
ఈ సందర్భంగా మహిళలకు మేలు కలిగేలా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుట్టనున్నారన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలు తీర్చిదిద్దే క్రమంలో పలు ఒప్పందాలు చేసుకుంటున్నట్లు మంత్రి సవిత తెలిపారు. సీఎం సమక్షంలో 36 ఒప్పందాలు చేసుకోబోతున్నట్లు వెల్లడించారు. డ్వాక్రా మహిళలతో ల్యాప్ టాప్ బ్యాగులు, క్యారీ బ్యాగులు, రెడీ మేడ్ దుస్తుల తయారీకి శిక్షణ ఇవ్వడదానికి సెర్ప్ తో ఆప్కో ఒప్పందం చేసుకోనున్నట్లు తెలిపారు. సీఎం చేతుల మీదుగా నాలుగు ఎన్ఆర్ఎల్ఎం క్లస్టర్లను ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఎమ్మిగనూరు (కర్నూలు), చీరాల (బాపట్ల), రాజాం (విజయనగరం), పొందూరు (శ్రీకాకుళం)లో ఈ క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నామన్నారు. మహిళా దినోత్సవ‌ వేడుకల సందర్భంగా 23 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
సీఎం చంద్రబాబు చేతుల మీదుగా డ్వాకా మహిళా సంఘాలకు రుణాల అందజేయనున్నామన్నారు. మిల్లెట్ కార్ట్ లు 2, ఎగ్ కార్ట్ లు 5, రైతు బజారు వ్యాన్ 1, బొలెరో వాహనాలు రెండు, ఆటోలు 5, ట్రాక్టర్లు 5, ర్యాపిడో ద్విచక్ర వాహనాలు 5 మహిళ లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు నాయుడు అందజేయనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. మహిళల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు, ఫ్రీ బస్, ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకాలు అమలు చేశామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ప్రధాన ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియా, కమిషనర్ రేఖా రాణి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్య కుమారి, సీఆర్డీయే అడిషనల్ కమిషనర్ భార్గవ్ తేజ, గుంటూరు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
The post 8న ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

స‌మిష్టి కృషితో ర‌థ స‌ప్త‌మి వేడుక‌లు విజ‌య‌వంతంస‌మిష్టి కృషితో ర‌థ స‌ప్త‌మి వేడుక‌లు విజ‌య‌వంతం

తిరుమ‌ల : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ర‌థ స‌ప్త‌మి గురించి ప్ర‌స్తావించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ బోర్డు సూచనలతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు, తిరుచానూరు పద్మావతి అమ్మ వారి

తెలంగాణ లో ఆర్టీసీ మరింత విస్తరించే దిశగా చర్యలుతెలంగాణ లో ఆర్టీసీ మరింత విస్తరించే దిశగా చర్యలు

హైద‌రాబాద్ : రాష్ట్ర రోడ్డు, ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో ఆర్టీసీ మ‌రింత విస్త‌రించే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటుంద‌న్నారు. ఆర్టీసీ బస్ స్టేషన్ లలో మౌలిక సదుపాయాలు, కొత్త రూట్ లు , కొత్త

అంగ‌రంగ వైభ‌వం విశాఖ ఉత్స‌వంఅంగ‌రంగ వైభ‌వం విశాఖ ఉత్స‌వం

విశాఖ‌ప‌ట్నం : ఏపీ స‌ర్కార్ ఆధ్వ‌ర్యంలో అంగ‌రంగ వైభ‌వోపేతంగా విశాఖ ఉత్స‌వం కొన‌సాగుతోంది. రుషికొండ బీచ్ వద్ద పర్యాటకులకు అద్భుత అనుభూతిని అందించే హెలికాప్టర్ రైడ్‌ను రాష్ట్ర సాంస్కృతిక‌, ప‌ర్యాట‌క శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ‘సిటీ ఆఫ్ డెస్టినీ’