hyderabadupdates.com Gallery 9న న‌ల్ల‌చెరువును ప్రారంభించ‌నున్న సీఎం

9న న‌ల్ల‌చెరువును ప్రారంభించ‌నున్న సీఎం

9న న‌ల్ల‌చెరువును ప్రారంభించ‌నున్న సీఎం post thumbnail image

హైద‌రాబాద్ : కూక‌ట్‌ప‌ల్లి న‌ల్ల చెరువును హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ప‌రిశీలించారు. ఈ నెల 9వ తేదీ సాయంత్రం న‌ల్ల‌చెరువును ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో అక్క‌డ ఏర్పాట్ల‌ను ఇత‌ర శాఖల అధికారుల‌తో స‌మీక్షించారు. స‌భా ప్రాంగ‌ణం ఎక్క‌డ ఏర్పాటు చేయాలి..? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ స్టాళ్ల‌ను ఎక్క‌డ పెట్టాలి అనే అంశాల‌ను ఇత‌ర శాఖ‌ల అధికారుల‌తో చ‌ర్చించారు. ఎంత‌మంది వ‌స్తారు.. వారికి సీటింగ్ ఏర్పాట్లు ఎలా ఉండాలి అనే అంశాల‌ను స‌మీక్షించారు. కార్యక్రమం సజావుగా నిర్వహించేందుకు అవసరమైన భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజలకు ఇబ్బంది కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై కీల‌క సూచ‌న‌లు చేశారు క‌మిష‌న‌ర్.
ఒక‌ప్పుడు కూక‌ట్‌ప‌ల్లి న‌ల్ల చెరువు ప‌రిస‌రాల‌కు రావాలంటే వెనుక‌డుగు వేసేవార‌ని.. ఇప్పుడు చెరువు చుట్టూ చ‌క్క‌ర్లు కొడుతున్నార‌ని స్థానిక కాంగ్రెస్ నాయ‌కుడు బండి ర‌మేష్ అన్నారు. ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించి 16 ఎక‌రాలుగా మిగిలి పోతుంద‌నుకున్న చెరువును 30 ఎక‌రాల‌కు విస్త‌రించి సుంద‌రంగా తీర్చి దిద్ద‌డంప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశారు. హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ని శాలువ‌తో స‌న్మానించారు. న‌ల్ల చెరువు ప్రారంభోత్స‌వంలో పెద్ద ఎత్తున స్థానికులు పాల్గొన‌నున్నార‌ని తెలిపారు. కూక‌ట్‌ప‌ల్లి జోన‌ల్ క‌మిష‌న‌ర్ అపూర్వ్ చౌహాన్ , కూక‌ట్‌ప‌ల్లి, కుత్బుల్లాపూర్ జోన్ ట్రాఫిక్ డీసీపీ శేషాద్రిని రెడ్డి, హైడ్రా డీసీపీ శ్రీ‌కాంత్ , ఏడీసీపీ సుద‌ర్శ‌న్ తో పాటు.. ప‌లువురు అధికారులు కూక‌ట్‌ప‌ల్లి న‌ల్ల చెరువును సంద‌ర్శించిన వారిలో ఉన్నారు.
The post 9న న‌ల్ల‌చెరువును ప్రారంభించ‌నున్న సీఎం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

కీల‌క మ్యాచ్ ల‌కు వేదిక కానున్న కోల్ క‌తాకీల‌క మ్యాచ్ ల‌కు వేదిక కానున్న కోల్ క‌తా

కోల్ క‌తా : ఐసీసీ టోర్నీలో భాగంగా కీల‌క‌మైన మ్యాచ్ లు కొన‌సాగుతున్నాయి. దాయాది పాకిస్తాన్ జ‌ట్టు ఒక‌వేళ సెమీ ఫైన‌ల్ లేదా ఫైన‌ల్ కు చేరుకుంటే క‌చ్చితంగా ఇండియాలోని కోల్ క‌తా, అహ్మదాబాద్ లో ఆడాల్సి ఉంటుంది. దీనిపై పాకిస్తాన్

Bomb Blasts: బాంబులతో దద్దరిల్లిన ఢాకాBomb Blasts: బాంబులతో దద్దరిల్లిన ఢాకా

    2024 మారణహోమం కేసుకు సంబంధించి ఇంటర్ నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా కేసులో తుది తీర్పును ఈ రోజు (సోమవారం) వెలువరించనుంది. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. దీనితో

Wedding Tragedy: కూతురు పెళ్లికి వేసిన పందిరి కిందే తండ్రి మృతదేహంWedding Tragedy: కూతురు పెళ్లికి వేసిన పందిరి కిందే తండ్రి మృతదేహం

    పచ్చని పెళ్లి పందిరిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కూతురిని మెట్టినింటికి పంపాల్సిన ఓ తండ్రి కాటికి చేరాడు. కూతురి పెళ్లి కోసం సరుకులు తీసుకురావడానికి వెళ్లిన ఆయన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. దీనితో కూతురు పెళ్ళి కోసం