hyderabadupdates.com Gallery 9న న‌ల్ల‌చెరువును ప్రారంభించ‌నున్న సీఎం

9న న‌ల్ల‌చెరువును ప్రారంభించ‌నున్న సీఎం

9న న‌ల్ల‌చెరువును ప్రారంభించ‌నున్న సీఎం post thumbnail image

హైద‌రాబాద్ : కూక‌ట్‌ప‌ల్లి న‌ల్ల చెరువును హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ప‌రిశీలించారు. ఈ నెల 9వ తేదీ సాయంత్రం న‌ల్ల‌చెరువును ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో అక్క‌డ ఏర్పాట్ల‌ను ఇత‌ర శాఖల అధికారుల‌తో స‌మీక్షించారు. స‌భా ప్రాంగ‌ణం ఎక్క‌డ ఏర్పాటు చేయాలి..? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ స్టాళ్ల‌ను ఎక్క‌డ పెట్టాలి అనే అంశాల‌ను ఇత‌ర శాఖ‌ల అధికారుల‌తో చ‌ర్చించారు. ఎంత‌మంది వ‌స్తారు.. వారికి సీటింగ్ ఏర్పాట్లు ఎలా ఉండాలి అనే అంశాల‌ను స‌మీక్షించారు. కార్యక్రమం సజావుగా నిర్వహించేందుకు అవసరమైన భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజలకు ఇబ్బంది కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై కీల‌క సూచ‌న‌లు చేశారు క‌మిష‌న‌ర్.
ఒక‌ప్పుడు కూక‌ట్‌ప‌ల్లి న‌ల్ల చెరువు ప‌రిస‌రాల‌కు రావాలంటే వెనుక‌డుగు వేసేవార‌ని.. ఇప్పుడు చెరువు చుట్టూ చ‌క్క‌ర్లు కొడుతున్నార‌ని స్థానిక కాంగ్రెస్ నాయ‌కుడు బండి ర‌మేష్ అన్నారు. ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించి 16 ఎక‌రాలుగా మిగిలి పోతుంద‌నుకున్న చెరువును 30 ఎక‌రాల‌కు విస్త‌రించి సుంద‌రంగా తీర్చి దిద్ద‌డంప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశారు. హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ని శాలువ‌తో స‌న్మానించారు. న‌ల్ల చెరువు ప్రారంభోత్స‌వంలో పెద్ద ఎత్తున స్థానికులు పాల్గొన‌నున్నార‌ని తెలిపారు. కూక‌ట్‌ప‌ల్లి జోన‌ల్ క‌మిష‌న‌ర్ అపూర్వ్ చౌహాన్ , కూక‌ట్‌ప‌ల్లి, కుత్బుల్లాపూర్ జోన్ ట్రాఫిక్ డీసీపీ శేషాద్రిని రెడ్డి, హైడ్రా డీసీపీ శ్రీ‌కాంత్ , ఏడీసీపీ సుద‌ర్శ‌న్ తో పాటు.. ప‌లువురు అధికారులు కూక‌ట్‌ప‌ల్లి న‌ల్ల చెరువును సంద‌ర్శించిన వారిలో ఉన్నారు.
The post 9న న‌ల్ల‌చెరువును ప్రారంభించ‌నున్న సీఎం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

శ‌న‌గ రైతుల‌ను ఆదుకోవాల‌ని కేంద్రానికి సీఎం లేఖశ‌న‌గ రైతుల‌ను ఆదుకోవాల‌ని కేంద్రానికి సీఎం లేఖ

అమ‌రావ‌తి : రాష్ట్రంలో శనగ ఉత్పత్తి భారీగా పెరగడంతో రైతులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రత్యేక చొరవ చూపారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అనుమతించిన కొనుగోలు పరిమితి సరిపోదని గుర్తించిన మంత్రి, ఈ

Dr Shaheen: పుల్వామా మాస్టర్‌మైండ్‌ తో డాక్టర్ షహీన్‌ కు లింకులు ?Dr Shaheen: పుల్వామా మాస్టర్‌మైండ్‌ తో డాక్టర్ షహీన్‌ కు లింకులు ?

      ఫరీదాబాద్ పేలుడు పదార్థాల కేసులో అరెస్టయిన డాక్టర్ షహీన్ సయీద్‌పై ఎన్‌ఐఏ జరుపుతున్న దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పుల్వామా దాడుల మాస్టర్ మైండ్ ఉమర్ ఫారుక్‌ భార్య అపీరా బీబీతో సంబంధాలున్నట్లు దర్యాప్తు సంస్థలు

ది అట్టాంటిక్ పై ఎఫ్‌బీఐ డైరెక్ట‌ర్ కాష్ ప‌టేల్ దావాది అట్టాంటిక్ పై ఎఫ్‌బీఐ డైరెక్ట‌ర్ కాష్ ప‌టేల్ దావా

అమెరికా : ఎఫ్‌బిఐ డైరెక్ట‌ర్ కాష్ ప‌టేల్ సంచ‌ల‌నంగా మారారు. తన గురించి తప్పుడు వార్తలు ప్రచురించారని ఆరోపిస్తూ ది అట్లాంటిక్‌పై ఎఫ్‌బిఐ డైరెక్టర్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు . ఏకంగా స‌ద‌రు ప‌త్రిక‌పై పటేల్ 250 మిలియన్ డాలర్ల నష్ట