hyderabadupdates.com movies 90 రోజుల కండీషన్ – టాలీవుడ్ టెన్షన్ టెన్షన్

90 రోజుల కండీషన్ – టాలీవుడ్ టెన్షన్ టెన్షన్

టాలీవుడ్ వర్గాల్లో ఎక్కడ చూసినా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల గురించిన చర్చే కనిపిస్తోంది. ఇకపై రాష్ట్రంలో టికెట్ ధరలు పెంచుకోవాలంటే నిర్మాతలు సినిమా విడుదల తేదీని పక్కాగా నిర్ణయించుకోవాలి. దానికి అనుగుణంగా 90 రోజుల ముందే జిఓలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించడంతో ప్యాన్ ఇండియా నిర్మాతల గుండెల్లో పాలు, బాంబులు ఒకేసారి కురిపించినట్టయ్యింది.

ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడు నెలల ముందే రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకోవడం, దానికి కట్టుబడటం దాదాపు అసాధ్యం. బాహుబలి నుంచి మొదలుపెట్టి రాజా సాబ్ దాకా ఒక్క ప్రభాస్ సినిమాలే ఎన్ని వాయిదాలు పడ్డాయో లెక్క చెప్పడం కష్టం.

చివరి నిమిషం దాకా ఒత్తిళ్లు ప్రొడ్యూసర్లను నలిపేస్తున్నాయి. మరికొద్ది గంటల్లో షో పడుతుందనే టైంలో అఖండ 2 ప్రీమియర్లకు బ్రేక్ పడటం అంత సులభంగా మర్చిపోయేది కాదు. హరిహర వీరమల్లు డేట్లను అరటిపళ్ళు తిన్నంత ఈజీగా ఛేంజ్ చేయడం తెలిసిందే. గేమ్ ఛేంజర్ మూడేళ్లు నిర్మాణంలో ఉంది.

పుష్పకు జరిగిన సర్కస్ గుర్తు చేయాల్సిన అవసరం లేదు. మనకే కాదు పక్కభాషల్లో తీసిన కాంతార, కెజిఎఫ్ లకు సైతం ఈ పోస్ట్ పోన్ల ప్రహసనం తప్పలేదు. అలాంటప్పుడు పక్కాగా తొంబై రోజుల ముందే హైక్స్ తెచ్చుకోవడం వెనుక చాలా ప్రాక్టికల్ సమస్యలు వస్తాయి. అయితే మరో కోణంలో చేసుకోవాల్సిన విశ్లేషణ ఇంకోటుంది.

ఉదాహరణకు ఒక సినిమాని జూన్ లో రిలీజ్ చేయాలని నిర్మాత డిసైడయ్యాడు. దానికి తగట్టు మార్చి నెలలో జిఓకి అప్లై చేసి తెచ్చుకున్నాడు. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల వాయిదా పడి విడుదల తేదీ మారితే మళ్ళీ ఫ్రెష్ జిఓకి అప్లికేషన్ పెట్టుకోవాలి.

ఎన్నిసార్లు అడుగుతారని గవర్నమెంట్ కోప్పడినా, లేదా డేట్లు మార్చి మోసం చేశారని ఎవరైనా కేసు వేసినా అదో కొత్త తలనొప్పి. కథ మళ్ళీ మొదటికే వస్తుంది. రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారు నిర్మాతలు చేసినట్టు ముందస్తుగా కోర్టుకు వెళ్లి ఉత్తర్వులు తెచ్చుకోవడం ప్రతిసారి సాధ్యం కాదు. మొన్నేదో కలిసి వచ్చింది కానీ లేదంటే స్టోరీ వేరుగా ఉండేది.

ఎంతో కొంత పెంపు కోరుకునే మీడియం రేంజ్ మూవీస్ కి కూడా ఈ నైన్టీ డేస్ కండీషన్ వల్ల ఇబ్బందే. రిలీజ్ కు దగ్గరలో హైక్స్ కావాలంటే ఇంతకు ముందులా లాబీయింగ్ చేసే అవకాశాలు ఉండకపోవచ్చు. ఏది అడిగినా కోర్టు చెప్పింది కదాని మంత్రులు, అధికారులు తప్పించుకుంటారు. ఎందుకొచ్చిన గొడవలెమ్మని నిర్మాతలే రాజీ పడవచ్చు.

ఏపీలో ఇప్పటికైతే ఏ సమస్యా లేదు. అడిగిన వెంటనే జిఓలు వస్తున్నాయి. ఇలా పదే పదే ఇవ్వడం ఇబ్బందిగా ఉందని సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ ఇటీవలే సెలవిచ్చారు. సో అక్కడ కూడా ఏమైనా అనూహ్య మార్పులు జరిగితే ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఈ వ్యవహారం వల్ల ప్రేక్షకులు కూడా థియేటర్ కు వచ్చి సినిమా చూడటాన్ని భారంగా ఫీలవుతున్నారు. సంక్రాంతి సీజన్ కాబట్టి ఏదో చెల్లిపోయింది కానీ మాములు రోజుల్లో ఇలా బడ్జెట్ పేరు చెప్పి పెంపులు తీసుకుంటూ పోతే థియేటర్ వ్యవస్థకు చేటు కలుగుతుంది.

వీలైతే తమిళనాడు లాగా ఒకే పద్దతికి కట్టుబడి దాన్నే స్ట్రిక్ట్ గా ఫాలో కావాలి. లేదా కర్ణాటక తరహాలో పెంచుకునే స్వేచ్ఛ నిర్మాతలకే ఇవ్వాలి. రెండింటిలోనూ దేని ఇబ్బందులు దానికి ఉన్నాయి. అసలే 2026లో చాలా ప్యాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి. వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. అందుకే 90 డేస్ కండీషన్ మీద టాలీవుడ్ ఇంత టెన్షన్ టెన్షన్ గా ఉంది.

Related Post

Bheems Ceciroleo & Hesham Abdul Wahab Create Musical Magic for 12A Railway ColonyBheems Ceciroleo & Hesham Abdul Wahab Create Musical Magic for 12A Railway Colony

Allari Naresh’s much-awaited thriller 12A Railway Colony is generating strong buzz ahead of its grand theatrical release on November 21st. Directed by Nani Kasaragadda, marking his directorial debut, the film

బీహార్ ఎలక్షన్: జగన్‌కు బిగ్ లెసన్!బీహార్ ఎలక్షన్: జగన్‌కు బిగ్ లెసన్!

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఎవరూ ఊహించని విధంగా ఎన్నికల పండితులకు సైతం అర్థం కాని విధంగా ప్రజలు తీర్పు చెప్పారు. అధికార ఎన్డీయే కూటమికి భారీ మద్దతుగా ప్రజలు నిలిచారు. గతానికి భిన్నంగా అధికార పార్టీకే వరుసగా పగ్గాలు