hyderabadupdates.com movies క‌ర్నూలు క‌ష్టాలు తీరుతాయి: మోడీ

క‌ర్నూలు క‌ష్టాలు తీరుతాయి: మోడీ

క‌ర్నూలులో అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని.. అవి త్వ‌ర‌లోనే తీరుతాయ‌ని ప్ర‌ధాని మోడీ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న ‘డ్రోన్స్ హ‌బ్‌’ ద్వారా.. ఇక్క‌డి వారికి భారీ ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాలు ల‌భిస్తాయ‌న్నారు. అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధిలో క‌ర్నూలు, రాయ‌లసీమల పాత్ర కూడా ఉంటుంద‌న్నారు. ఆప‌రేష‌న్ సిందూర్‌లో డ్రోన్ల పాత్ర ఎంతో ఉంద‌న్నారు. భ‌విష్య‌త్తులో డ్రోన్ త‌యారీ కేంద్రంగా మార‌నున్న క‌ర్నూలు.. దేశానికి.. ప్ర‌పంచానికి కూడా సేవ‌లు అందించే స్థాయికి ఎదుగుతుంద‌న్నారు.

ఒక‌ప్పుడు ఏపీ ఈ దేశానికి నాయ‌క‌త్వం వ‌హించే స్థాయిలో ఉంద‌న్న ప్ర‌ధాని.. గ‌త కాంగ్రెస్ ప్ర‌భుత్వాలు చేసిన నిర్వాకంతో ఏపీ ప్ర‌జ‌లు ఇప్పుడు సాయం కోసం వేచి చూస్తున్న ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని విమ‌ర్శించా రు. అయితే.. విజ‌న్ ఉన్న నాయ‌కుడు చంద్ర‌బాబు సార‌థ్యంలో ఏపీ పుంజుకుంటోంద‌ని.. దేశ చిత్ర ప‌టం లో ఏపీ తిరుగులేని శ‌క్తిగా అవ‌త‌రించ‌నుంద‌ని చెప్పారు. విశాఖ ప‌ట్నంలో ఏర్పాటు చేస్తున్న గూగుల్ ఏఐ హ‌బ్ ద్వారా కేవలం విశాఖ‌ప‌ట్నానికే కాకుండా.. దేశానికి, ప్ర‌పంచానికి కూడా సేవ‌లు అందుతాయ‌న్నారు.

ఏపీలో అనంత‌మైన అవ‌కాశాలు ఉన్నాయ‌ని.. అపార‌మైన యువ శ‌క్తి ఉంద‌ని ప్ర‌ధాని తెలిపారు. దీనిని అందిపుచ్చుకునేందుకు డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారుకృషి చేస్తోంద‌న్నారు. కేవ‌లం 16 మాసాల్లోనే అనేక కార్య‌క్ర‌మాలు తీసుకువ‌చ్చామ‌న్నారు. నిమ్మ‌లూరులో సూప‌ర్ సోనిక్ కేంద్రం ఏర్పాటు ద్వారా సైనిక అవ‌స‌రాల‌కు కీల‌క‌మైన ఆయుధాల త‌యారీని ప్రారంభించ‌నున్న‌ట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టులు రాయ‌ల‌సీమ‌లో ని ప్ర‌తి జిల్లాకు ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పిస్తాయ‌ని.. స‌రికొత్త ద్వారాల‌ను తెరుస్తాయ‌ని చెప్పారు.

లోకేష్ కృషి గ్రేట్‌!

సూప‌ర్ జీఎస్టీ-సూప‌ర్ సేవింగ్స్ ఉత్స‌వంలో మంత్రి నారా లోకేష్ పాత్ర ఎంతో ఉంద‌న్న ప్ర‌ధాని.. దీని వ‌ల్ల ఏపీ ప్ర‌జ‌లకు ఏటా 8 వేల కోట్ల రూపాయ‌ల మేర‌కు ల‌బ్ధి చూకూరుతుంద‌న్నారు. ఈ విష‌యంలో నారా లోకేష్ ప్ర‌జ‌ల‌కు ఎంతో వివ‌రిస్తున్నార‌ని.. వారికి కూడా అవ‌గాహ‌న క‌లుగుతోంద‌న్నారు. అయితే.. ఓక‌ల్ ఫ‌ర్ లోక‌ల్ నినాదాన్ని అంద‌రూ అందిపుచ్చుకోవాల‌ని సూచించారు. స్థానిక ఉత్ప‌త్తుల‌కు పెద్ద పీట వేయాల‌ని సూచించారు. స్థానికంగా త‌యార‌య్యే వ‌స్తువులకు ప్రాధాన్యం ఇవ్వాల‌ని ప్ర‌ధాని సూచించారు.

Related Post

బీహార్ ఎఫెక్ట్‌: వ‌ణుకున్న పార్టీలు!బీహార్ ఎఫెక్ట్‌: వ‌ణుకున్న పార్టీలు!

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కీలకమైన రెండు రాష్ట్రాల్లో తీవ్రస్థాయిలో రాజకీయ ప్రకంపనులు కొనసాగుతున్నాయి. ఎవరూ ఊహించని విధంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘనవిజయం ద‌క్కించుకుంది. సర్వేలకు సైతం అందని విధంగా ఇక్కడ ఎన్డీఏ కూటమి పార్టీలు