Vande Bharat : భారతదేశపు సెమీ-హై-స్పీడ్ రైళ్ల జాబితాలో తర్వాత వర్షన్ రానుంది. వందేభారత్ 4.0 (Vande Bharat)ను అభివృద్ధి చేయనున్నట్లు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) బుధవారం ప్రకటించారు. ఎగుమతి గిరాకీలకు అనుగుణంగా దాని రూపకల్పన ఉంటుందని వెల్లడించారు. రైళ్ల ఆధునిక సాంకేతికత విషయంలో దేశాన్ని గ్లోబల్ సప్లయిర్‌గా మార్చేదిశగా ఇది కీలక అడుగు కానుందని వెల్లడించారు.
సీఐఐ ఇంటర్నేషనల్ రైల్ కాన్ఫరెన్స్‌లో కేంద్రమంత్రి మాట్లాడారు. మోదీ ప్రభుత్వం రైల్వేల అభివృద్ధిపై బలంగా దృష్టి సారించిందని వెల్లడించారు. 11 ఏళ్లలో 35,000 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్‌ల నిర్మాణం జరిగిందని చెప్పారు. జపాన్ బుల్లెట్ రైల్ నెట్‌వర్క్ మాదిరిగానే హైస్పీడ్ ప్యాసింజర్ రైల్ కారిడార్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు చెప్పారు. గరిష్ఠంగా గంటకు 350 కి.మీ వేగంతో రైలు ప్రయాణించేలా వాటి డిజైన్ ఉంటుందని తెలిపారు.
Vande Bharat – కర్నూలు పర్యటనపై తెలుగులో ప్రధాని మోదీ ట్వీట్
కర్నూలు పర్యటన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలుగులో ట్వీట్ చేశారు. ‘‘అక్టోబర్ 16న నేను ఆంధ్రప్రదేశ్‌లో ఉంటాను. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో పూజలు చేస్తాను. ఆ తర్వాత కర్నూలులో రూ.13,400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటాను. ఈ పనులు విద్యుత్, రైల్వేలు, పెట్రోలియం, రక్షణ, పరిశ్రమలతో పాటు మరిన్ని రంగాలకు సంబంధించినవి’’ అని ‘ఎక్స్’లో ప్రధాని పేర్కొన్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేసేందుకు ఏపీ సర్కారు అన్ని విధాలా ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర మంత్రుల ఉన్నత స్థాయి బృందం ఇప్పటికే నంద్యాలకు చేరుకొని ఏర్పాట్లపై సమీక్షించింది. మోదీ పర్యటనను చరిత్రాత్మక పర్యటనగా గుర్తుండిపోయేలా విజయవంతం చేయాలని మంత్రులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కార్యక్రమం విజయవంతం చేసేందుకు క్షేత్రస్థాయిలో కూటమి పార్టీల శ్రేణులు ఎలా పనిచేయాలనే దానిపై దిశానిర్దేశం చేశారు.
Also Read : Tejashwi Yadav: అట్టహాసంగా నామినేషన్ వేసిన తేజస్వి యాదవ్
The post Vande Bharat 4.0: త్వరలో వందేభారత్ 4.0 – కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Vande Bharat 4.0: త్వరలో వందేభారత్ 4.0 – కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
Categories: