hyderabadupdates.com movies అనుష్క అంత ఈజీగా ఒప్పుకుంటుందా

అనుష్క అంత ఈజీగా ఒప్పుకుంటుందా

అభిమానులు అనుష్కని రెగ్యులర్ గా తెరమీద చూడాలని కోరుకుంటున్నారు కానీ తను మాత్రం రెండు మూడేళ్ళకో సినిమా చేస్తూ కనీసం ప్రమోషన్ల కోసమైనా దర్శనమివ్వకుండా దోబూచులాడుతోంది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, ఘాటీ రెండింటిలోనూ ఇది అనుభవమయ్యింది. బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్ ఇంటర్వ్యూలలో కనిపిస్తుందని అంటున్నారు కానీ వీడియో బయటికి వస్తే తప్ప నిజమని నమ్మే పరిస్థితి లేదు. అలాని అనుష్కతో తీయడానికి నిర్మాతలు రెడీగా లేరని కాదు. భాగమతి 2తో సహా ఎందరో రైటర్లు డైరెక్టర్లు ఆమెను కలుసుకోవడం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ దర్శనం చిక్కితేగా.  

నాగార్జున వందో మూవీ ఆర్ కార్తీక దర్శకత్వంలో రూపొందుతున్న సంగతి తెలిసిందే. దీంట్లో టబుని ఆల్రెడీ ఒక కీలక పాత్రకు లాక్ చేశారని టాక్ ఉంది. మెయిన్ హీరోయిన్ గా ఇప్పుడు అనుష్కని అడుగుతున్నారని లేటెస్ట్ అప్డేట్. నిజానికి నాగ్ అంటే స్వీటీకి చాలా అభిమానం. సూపర్ తో ఇండస్ట్రీకి పరిచయం చేసిన కృతజ్ఞత ఎప్పటి నుంచో ఉంది. ఆ కారణంగానే ఇష్టం అయిష్టాలను పక్కన పెట్టి సోగ్గాడే చిన్ని నాయనా, ఓం నమో వెంకటేశాయ లాంటి సినిమాల్లో క్యామియోలు చేసింది. ఇప్పుడీ నాగ్ 100 కోసం తనను సంప్రదిస్తే నో చెప్పకపోవచ్చు. అసలు అడిగారా అనేది ప్రశ్న. ఒకవేళ కన్ఫర్మ్ అయితే నాగ్ ఫ్యాన్స్ కు పండగే.

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న నాగార్జున 100కి లాటరీ కింగ్ అనే టైటిల్ పరిశీలనలో ఉందట. ఒకప్పుడు ప్రభుత్వాలను తన చిటికెన వేలు మీద నడిపించిన ఒక లాటరీ డాన్ జీవితం ఆధారంగా ఇది రాసుకున్నారని తెలిసింది. అతనెవరనేది బయట పెట్టలేదు కానీ స్టోరీ బ్యాక్ డ్రాప్ తొంభై దశకంలో ఉంటుందని అంటున్నారు. ఫైనల్ గా టబు, అనుష్క కనక నాగార్జున సరసన చేరితే వింటేజ్ వైబ్స్ రావడం ఖాయం. సోలో హీరోగా నా సామిరంగా తర్వాత మరో సినిమా చేయని నాగార్జున నుంచి సాలిడ్ ఎంటర్ టైనర్ వచ్చి ఏళ్ళు గడిచిపోయాయి. మరి ఈ ల్యాండ్ మార్క్ చిత్రం ఆ లోటు తీరుస్తుందేమో చూడాలి.

Related Post

కొలిక‌పూడి వ్య‌వ‌హారంపై చంద్ర‌బాబు సీరియ‌స్‌.. స‌స్పెన్ష‌న్ వేటుకు రెడీ?కొలిక‌పూడి వ్య‌వ‌హారంపై చంద్ర‌బాబు సీరియ‌స్‌.. స‌స్పెన్ష‌న్ వేటుకు రెడీ?

రాష్ట్రంలో రాజ‌కీయ మంట‌లు రేపిన తిరువూరు ఎమ్మెల్యే, ఎస్సీ నాయ‌కుడు కొలిక‌పూడి శ్రీనివాస‌రావు వ్య‌వ‌హారంపై సీఎం చంద్ర‌బాబు తీవ్ర ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. ప్ర‌స్తుతం అబుదాబీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయ‌న‌.. రాష్ట్రంలో వ‌ర్షాలు.. వ‌ర‌ద‌ల ప‌రిస్థితిపై ప్ర‌తి రెండు గంట‌ల‌కు ఒక‌సారి..

బీఆర్ఎస్ ఓట్ చోరీ పిటిష‌న్‌.. 2 గంట‌ల్లో తేల్చేసిన‌ హైకోర్టు!బీఆర్ఎస్ ఓట్ చోరీ పిటిష‌న్‌.. 2 గంట‌ల్లో తేల్చేసిన‌ హైకోర్టు!

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ దాఖ‌లు చేసిన ఓట్ చోరీ పిటిష‌న్‌పై హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఓట్ చోరీ అనేది ప్ర‌స్తుతం ప్ర‌తిప‌క్షంలో ఉన్న పార్టీలు చేస్తున్న వ్యాఖ్య‌ల‌ని.. ఎన్నిక‌ల సంఘం పై ఆరోప‌ణ‌లు చేయ‌డం ప‌రిపాటిగా మారింద‌ని వ్యాఖ్యానించింది.