జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. ఈ ప్రభుత్వం మరో 15 సంవత్సరాలు పాటు కొనసాగుతుందని ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకు సాగుతామని ఆయన వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లాలో నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సభలో పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా పొత్తు కొనసాగుతుందన్నారు. దీనిని బట్టి క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఉన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ పరోక్షంగా చెప్పారు.
అయినప్పటికీ వచ్చే పదిహేను సంవత్సరాల పాటు కూటమి కొనసాగుతుందన్నది ఆయన మాట. దీనిని బట్టి ఇప్పుడు తేల్చుకోవాల్సింది జనసేన, టీడీపీ నాయకులు మాత్రమే అన్నది విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటివరకు కలివిడిగా లేనివారు ఇకనుంచి కలివిడిగా ఉండాల్సిన అవసరం ఉంది. కూటమి నాయకులు చేయి చేయి కలిపి ప్రజల మధ్యకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉందన్నది పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో స్పష్టమైంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా అని ఆయన చెప్పారు.
అంటే ఇబ్బందులు కష్టాలు ఉన్నప్పటికీ కలిసి ఉండాలని పవన్ కళ్యాణ్ లక్ష్యంగా కనిపిస్తున్నప్పుడు క్షేత్రస్థాయిలో నాయకులు దీనిని విస్మరించి వివాదాలు కొనితెచ్చుకుంటే వారికే నష్టం తప్ప పార్టీకి నష్టం ఉండదన్నది పవన్ కళ్యాణ్ పరోక్షంగా స్పష్టం చేశారు. ఒకవేళ ఇప్పుడు గొడవలు పడి విభేదాలు పెట్టుకుని కూటమికి దూరమైతే వచ్చే ఎన్నికల నాటికి ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కునేందుకు పవన్ కళ్యాణ్ కు పెద్ద సమస్య అయితే ఉండదు. ఎలాగో ఆయన ఇమేజ్ అదేవిధంగా కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమం వంటివి కలిసి వస్తాయి.
కాబట్టి వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులను మార్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నది విశ్లేషకులు చెబుతున్నారు. దీనిని బట్టి పవన్ కళ్యాణ్ ఒక నిశ్చయంతో ఉన్నప్పుడు ఆ నిశ్చయాన్ని అనుసరించేలా నాయకులు వ్యవహరించాలి. ఆ నిశ్చయానికి దూరంగా పార్టీ లైన్ కు భిన్నంగా వ్యవహరించడం వల్ల వారే నష్టపోతారని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. దీనిని బట్టి నాయకులే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.