hyderabadupdates.com Gallery వరుణ్‌ తేజ్‌ కొత్త ప్రాజెక్టు!

వరుణ్‌ తేజ్‌ కొత్త ప్రాజెక్టు!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ కెరీర్‌లో ఇటీవల వచ్చిన వరుస వైఫల్యాలు ఆయనకు కొంత వెనుకడుగు అయ్యాయి. దీంతో ప్రస్తుతం ఆయన పూర్తిగా కొత్త జోష్‌తో తిరిగి పుంజుకునే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతం వరుణ్ “కొరియన్ కనకరాజు” అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో కొనసాగుతోంది. సమాచారం ప్రకారం నవంబర్ చివరినాటికి అన్ని షెడ్యూల్స్ పూర్తి చేసి, తదుపరి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారు.

ఇదిలా ఉండగా, వరుణ్ తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ టాక్. విక్రమ్ సిరికొండ దర్శకత్వం వహించే ఈ లవ్ స్టోరీ గతేడాదే ఫైనల్ అయినప్పటికీ, కొన్ని కారణాల వల్ల ప్రారంభం ఆలస్యమైంది. కానీ ఇప్పుడు పరిస్థితులు క్లియర్ కావడంతో, వరుణ్ తేజ్ డిసెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభించేందుకు తన డేట్స్‌ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలోని ముఖ్యమైన షెడ్యూల్ అమెరికాలో ప్లాన్ చేసినట్టు తెలిసింది.
The post వరుణ్‌ తేజ్‌ కొత్త ప్రాజెక్టు! appeared first on Telugumopo – Movies and Politics.

Related Post

క‌ల్వ‌కుంట్ల క‌విత‌పై కోమ‌టిరెడ్డి షాకింగ్ కామెంట్స్క‌ల్వ‌కుంట్ల క‌విత‌పై కోమ‌టిరెడ్డి షాకింగ్ కామెంట్స్

మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా : రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మాజీ సీఎం కేసీఆర్ కూతురు, ఇటీవ‌లే త‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేసిన క‌ల్వ‌కుంట్ల క‌విత పై ఆస‌క్తిక‌ర

కేంద్ర మంత్రులు కిష‌న్ రెడ్డి, బండికి పొన్నం ఘాటు లేఖకేంద్ర మంత్రులు కిష‌న్ రెడ్డి, బండికి పొన్నం ఘాటు లేఖ

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రం ప‌ట్ల కేంద్ర స‌ర్కార్ వివ‌క్ష ప్ర‌ద‌ర్శిస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్. ఈ సంద‌ర్బంగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు బహిరంగ లేఖ

విజ‌య్ ర‌ష్మిక జంట‌కు పీఎం అభినంద‌న‌ లేఖ‌విజ‌య్ ర‌ష్మిక జంట‌కు పీఎం అభినంద‌న‌ లేఖ‌

న్యూఢిల్లీ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నాలు ఇటీవ‌లే ఒక్క‌ట‌య్యారు. స్వంతంగా గృహ ప్ర‌వేశం కూడా చేశారు. పెళ్లికి ముందు ఈ ఇద్ద‌రూ వ్య‌క్తిగ‌తంగా ఢిల్లీలోని ప్ర‌ధాని కార్యాల‌యంలో న‌రేంద్ర మోదీని మ‌ర్యాద పూర్వ‌కంగా