బెంగళూరు రోడ్ల పరిస్థితిపై ఇటీవల తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ విషయంపై బయోకాన్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ విషయంపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యంగ్యంగా బదులిచ్చారు. మజుందార్ షా రోడ్లను అభివృద్ధి చేయాలనుకుంటే చేయొచ్చంటూ డీకే పేర్కొన్నారు. ఆమె వచ్చి అడిగితే… ఆ గుంతలు పూడ్చేందుకు నిధులు కేటాయిస్తామన్నారు. ఈ సందర్భంగా బెంగళూరు నగర అభివృద్ధికి తమ ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించిందన్నారు.
గత కొంతకాలంగా బెంగళూరు రోడ్ల పరిస్థితిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బయోకాన్ పార్క్‌కు వచ్చిన ఓ విదేశీ విజిటర్… నగరంలోని రోడ్లు, చెత్తపై చేసిన వ్యాఖ్యలతో తాను ఇబ్బందిపడ్డానని ఆమె ఓ పోస్టులో వెల్లడించారు. ఇది కాస్త వైరల్ అయ్యింది. దీనిపై కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందించారు. బెంగళూరులో అభివృద్ధి శరవేగంగా జరుగుతోందన్నారు. మౌలిక సదుపాయాలకు అవసరమైనవన్నీ చేస్తున్నామన్నారు. ఈ విషయంపై బ్లాక్‌బక్’ అనే కంపెనీ సీఈఓ రాజేశ్ యాబాజీ కూడా గతంలో ఓ పోస్టు పెట్టారు.
అంతకుముందు, కర్ణాటక రాజధాని బెంగళూరులో అస్తవ్యస్త పరిస్థితులను బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా ట్విట్టర్ వేదికగా..‘చెత్త కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లోని ఏ మున్సిపాల్టీ కూడా దీనిని పరిష్కరించడం లేదు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు లాంటి నగరాల్లో ఈ చెత్త సమస్య చాలా చాలా దయనీయంగా ఉంది’ అని పేర్కొన్నారు. దీంతో, ఆమె పోస్టు వైరల్ అయ్యింది.
The post DK Shivakumar: కిరణ్ మజుందార్ షా పై డీకే వ్యంగ్యాస్త్రాలు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
DK Shivakumar: కిరణ్ మజుందార్ షా పై డీకే వ్యంగ్యాస్త్రాలు
Categories: