hyderabadupdates.com Gallery Minister Anitha: రాళ్లపాడులో మంత్రులు అనిత, నారాయణ పర్యటన

Minister Anitha: రాళ్లపాడులో మంత్రులు అనిత, నారాయణ పర్యటన

Minister Anitha: రాళ్లపాడులో మంత్రులు అనిత, నారాయణ పర్యటన post thumbnail image

 
 
దారకానిపాడుకు చెందిన తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు హత్య కేసు ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయిన సంగతి తెలిసిందే. తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు హత్య కేసు ఘటనపై హోంమంత్రి అనితను నివేదిక ఇవ్వాలని చంద్రబాబు కోరారు. కూటమి నేతలతో దారకానిపాడు వెళ్లి ఘటనపై సమీక్షించాలని మంత్రులను సీఎం ఆదేశించారు. చంద్రబాబు ఆదేశాలతో మంత్రులు పి.నారాయణ, వంగలపూడి అనిత దారకానిపాడుకు ఆదివారం వెళ్లారు. అక్టోబర్ 2, దసరా పండుగ నాడు తిరుమల శెట్టి లక్ష్మీనాయుడుని కారుతో ఢీకొట్టి హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి హత్య చేశాడు. ఈ హత్య కేసు నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ తరలించారు.
 
ఈ ఘటనపై రాజకీయ దుమారం లేవడంతో సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. కూటమికి చెందిన మూడు పార్టీల నేతలను బాధిత కుటుంబం దగ్గరకు వెళ్ళాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఆయన ఆదేశాలతో మంత్రులు నారాయణ, అనిత నెల్లూరులో పర్యటిస్తున్నారు. హత్యకు కారణాలు, పోలీస్ విచారణ, తీసుకున్న చర్యలు, బాధిత కుటుంబానికి సాయంపై సమగ్ర నివేదిక మంత్రులు, నేతలు సీఎం చంద్రబాబుకు ఇవ్వనున్నారు.
 
కులరంగు పులమడం దారుణం – మంత్రి నిమ్మల
ఈ హత్యకు వైసీపీ కులరంగు పులిమిందని మంత్రి రామానాయుడు విమర్శించారు. వ్యక్తిగత కక్షలతో హత్య జరిగితే… కులాలతో సంబంధమేంటని ప్రశ్నించారు. వైసీపీ దిగజారుడు, దివాళాకోరు రాజకీయాలకు ఇది పరాకాష్ట అని మండిపడ్డారు. శవరాజకీయాల మంటల్లో చలికాచుకోవాలని వైకాపా చూస్తోందని మంత్రి ఆక్షేపించారు. హత్యకు పాల్పడిన నిందితుడిని తమ ప్రభుత్వం అరెస్టు చేయించిందని, వైసీపీ వికృత చేష్టలు చూసి ప్రజలు ఛీ కొడుతున్నారని అన్నారు. రాజకీయ ముసుగులో నేరగాళ్లు సృష్టించే వదంతులు నమ్మొద్దన్నారు.
The post Minister Anitha: రాళ్లపాడులో మంత్రులు అనిత, నారాయణ పర్యటన appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

పూరీ జ‌గ‌న్నాథ్ సేతుప‌తి మూవీ టైటిల్ ఖ‌రారుపూరీ జ‌గ‌న్నాథ్ సేతుప‌తి మూవీ టైటిల్ ఖ‌రారు

హైద‌రాబాద్ : ద‌మ్మున్న ద‌ర్శ‌కుడిగా పేరు పొందిన పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న తాజా మూవీకి సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. శుక్ర‌వారం ఇందుకు గాను అధికారికంగా సినిమా టైటిల్ ను ఫిక్స్ చేసిన‌ట్లు తెలిపారు. త‌మిళ చ‌ల‌న చిత్ర

గ్రీన్ హైడ్రోజ‌న్ హ‌బ్ గా ఆంధ్ర‌ప్ర‌దేశ్ : సీఎంగ్రీన్ హైడ్రోజ‌న్ హ‌బ్ గా ఆంధ్ర‌ప్ర‌దేశ్ : సీఎం

అమ‌రావ‌తి : దేశంలో గ్రీన్ హైడ్రోజ‌న్ హ‌బ్ గా ఏపీ మార బోతోంద‌ని స్ప‌ష్టం చేశారు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు . శ‌నివారం ఏపీలోని కాకినాడ‌లో ఏఎం గ్రీన్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన 15 ఎంటీపీఏ గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు