hyderabadupdates.com Gallery Minister Laxman Kumar: హరీశ్‌ కు మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ ఓపెన్ ఛాలెంజ్

Minister Laxman Kumar: హరీశ్‌ కు మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ ఓపెన్ ఛాలెంజ్

Minister Laxman Kumar: హరీశ్‌ కు మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ ఓపెన్ ఛాలెంజ్ post thumbnail image

 
 
మంత్రివర్గ సమావేశంలో ఏం జరిగిందనే అంశంపై మాజీ మంత్రి హరీశ్‌రావు చర్చకు రావాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ సవాల్‌ విసిరారు. ఆదివారం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘రాష్ట్ర మంత్రులను హరీశ్‌రావు దండుపాళ్యం ముఠా అని అంటారా? మంత్రివర్గ సమావేశంలో ప్రజలు, రైతులకు సంబంధించిన సమస్యలపై చర్చ జరిగింది. వ్యక్తిగత అంశాలు చర్చకు రాలేదు. దీనిపై సిద్దిపేట వెంకటేశ్వర దేవాలయంలో ప్రమాణం చేయడానికి నేను సిద్ధం. సమయం, తేదీ హరీశ్‌రావే చెప్పాలి. కేసీఆర్‌ కుటుంబం గురించి కల్వకుంట్ల కవిత అన్న మాటలకు ముందు జవాబు చెప్పాలి.
 
బీఆర్ఎస్, బీజేపీలు ఏకమై బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నాయి. రాహుల్‌ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి.. కేంద్రానికి పంపించాం. ఈ విషయంపై మేం కేంద్రం వద్దకు వెళ్తే ప్రతిపక్షాలు కలిసి రాలేదు. భారాస ప్రభుత్వ హయాంలో మంత్రివర్గంలో ఎవరికైనా స్వేచ్ఛ ఉండేదా? ఏనాడైనా కేసీఆర్‌ పక్కన దళిత మంత్రి కూర్చున్నారా? వీటికి సమాధానం చెప్పాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో భారాసకు ప్రజలు బుద్ధి చెబుతారు’’ అని అడ్లూరి అన్నారు. సమావేశంలో సుడా ఛైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
సదర్ ఉత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి లుక్స్ అదుర్స్
 
హైదరాబాద్ ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ ఉత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అక్కడికి వచ్చిన ప్రజలకు అభివాదం చేసి, ఆప్యాయంగా చేతులు కలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్.. యాదవ సోదరులతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధిలో యాదవ సోదరుల భాగస్వామ్యం ఉందన్నారు. అధికారంలో, సంక్షేమంలో వారికి తగిన ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు.
 
ప్రజా ప్రభుత్వం వచ్చాకనే సదర్ ఉత్సవానికి నిధులు ఇచ్చి అధికారికంగా నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా సీఎం వెల్లడించారు. ఇలా ఉండగా, సీఎం రేవంత్ ప్రజలతో మమేకమైన విధానం, తలపాగా ధరించిన దృశ్యాలు సోషల్ మీడియాలో అందర్నీ విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
The post Minister Laxman Kumar: హరీశ్‌ కు మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ ఓపెన్ ఛాలెంజ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Tirumala: పరకామణి చోరీ కేసులో సీఐడీ విచారణ ప్రారంభంTirumala: పరకామణి చోరీ కేసులో సీఐడీ విచారణ ప్రారంభం

Tirumala : తిరుమల శ్రీవారి పరకామణి చోరీకి సంబంధించి సీఐడీ బృందం విచారణ చేపట్టింది. హైకోర్టు ఆదేశాలతో ఈ కేసు విచారణను మొదలుపెట్టింది. సీఐడీ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. శ్రీవారి ఆలయ పరకామణిని సీఐడీ బృందం పరిశీలించింది.