hyderabadupdates.com movies సైయారా భామ నుంచి ఇంకో సెన్సేషన్

సైయారా భామ నుంచి ఇంకో సెన్సేషన్

సైయారా.. ఈ ఏడాది ఈ బాలీవుడ్ సినిమా రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ఒక కొత్త హీరో.. ఒక కొత్త హీరోయిన్ కలిసి చేసిన సినిమా రూ.600 కోట్ల వసూళ్లు సాధించడం అంటే ఆషామాషీ విషయమా? ఈ చిత్రం అంత పెద్ద హిట్టవడానికి హృద్యమైన కథాకథనాలకు తోడు లీడ్ రోల్స్ చేసిన ఇద్దరూ అద్భుతంగా పెర్ఫామ్ చేయడం ముఖ్య కారణం. ఇటు అహాన్ పాండే, అటు అనీత్ పడ్డా.. ఇద్దరూ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. అనీత్‌‌కు కుర్రాళ్లయితే తమ గుండెల్లో గుడి కట్టేశారు.

తన అందం, అభినయంతో ఆమె అంతగా ఆకట్టుకుంది. ‘సైయారా’ విడుదలకు ముందే అనీత్‌తో యశ్ రాజ్ ఫిలిమ్స్ వాళ్లు ఇంకో మూడు చిత్రాలకు అగ్రిమెంట్ చేసుకున్నట్లు వార్తలు రావడం విశేషం. వేరే ప్రొడక్షన్ హౌస్‌ల నుంచి కూడా ఆమెకు అవకాశాలు వెల్లువెతాయి. ప్రస్తుతం బాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ బేనర్లలో ఒకటైన మ్యాడ్ డాక్ ఫిలిమ్స్ సైతం అనీత్‌తో ఒక క్రేజీ మూవీ తీయడానికి ప్లాన్ చేసింది.

మ్యాడ్ రాక్ హార్రర్ కామెడీ యూనివర్శ్‌లో భాగంగా ‘థామా’ చిత్రాన్ని అందించిన మ్యాడ్ డాక్ సంస్థ.. సినిమా చివర్లో ఈ ఫ్రాంఛైజీలో కొత్త సినిమా విశేషాలను పంచుకుంది. ‘శక్తి షాలిని’ పేరుతో తెరకెక్కుతున్న ఆ చిత్రం.. అనీత్ పడ్డా లీడ్ రోల్ చేయనుంది. ‘థామా’ హిందీ వెర్షన్‌లో ఈ సినిమా గురించి అనౌన్స్‌మెంట్ ఇవ్వడంతో ప్రేక్షకులకు క్రేజీగా ఫీలవుతున్నారు.

‘సైయారా’లో చాలా డెలికేట్‌గా కనిపించిన అనీత్.. హార్రర్ కామెడీలో దయ్యం పాత్ర చేయనుండడం షాకింగే. ఆమె నుంచి తర్వాత ఇలాంటి పాత్రను ఎవ్వరూ ఊహించరు. మ్యాడ్ డాక్ వాళ్ల హార్రర్ కామెడీలంటే ముందే బ్లాక్ బస్టర్ అని ఫిక్సయిపోతున్నారు నార్త్ ఆడియన్స్. ‘థామా’ సైతం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ‘శక్తి షాలిని’ అనౌన్స్‌మెంట్లోనే రిలీజ్ డేట్ కూడా ఖరారు చేసింది చిత్ర బృందం. వచ్చే ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబరు 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Post

అసెంబ్లీ నుండి వాకవుట్… ఎవరికి నష్టం?అసెంబ్లీ నుండి వాకవుట్… ఎవరికి నష్టం?

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను వైసీపీ ఎప్పటిలాగే బాయ్ కాట్ చేసింది. అటెండెన్స్ టార్గెట్ గా సభకు వచ్చిన వైసీపీ సభ్యులు ఆ పని పూర్తిచేసి .. సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ క్రమంలోనే వైసీపీ సభ్యులపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారుజీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో జీతాలు తీసుకుని..వారి త‌ర‌ఫున స‌ల‌హాలు, సూచ‌న‌లు కూడా ఇవ్వ‌డం లేద‌ని అన్నారు. స‌భ‌కు రాకుండానే జీతాలు తీసుకుంటున్నార‌ని పేర్కొన్నారు. బుధ‌వారం

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఉదయం నుంచి గుంటూరులో హైడ్రామా నడిచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి,