hyderabadupdates.com Gallery Indian Navy: ఆపరేషన్‌ సిందూర్‌పై నేవీ ‘కసమ్‌ సిందూర్‌కి’ పాట

Indian Navy: ఆపరేషన్‌ సిందూర్‌పై నేవీ ‘కసమ్‌ సిందూర్‌కి’ పాట

Indian Navy: ఆపరేషన్‌ సిందూర్‌పై నేవీ ‘కసమ్‌ సిందూర్‌కి’ పాట post thumbnail image

Indian Navy : ప్రధాని నరేంద్రమోదీ సోమవారం గోవా తీరంలో నౌకాదళ సిబ్బందితో దీపావళి వేడుకలు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నౌకాదళ సిబ్బంది ఆపరేషన్‌ సిందూర్‌పై రాసిన ఓ పాటను ప్రధాని ఎదుట పాడారు. దానికి సంబంధించిన వీడియోను మోదీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఆదివారం రాత్రి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటానని పేర్కొన్నారు. నావికా దళ సిబ్బందిప్రతిభావంతులని… సృజనాత్మకత కలిగిన వారని ప్రశంసించారు. వారు రాసిన ‘కసమ్‌ సిందూర్‌కి’ (Kasam Sindoor Ki) గీతం ఎప్పటికీ తన హృదయంలో నిలిచిపోతుందని అన్నారు.
Indian Navy Updates
ఈ పాటలో పహల్గాం ఉగ్రదాడి, అనంతరం భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ లో త్రివిధ దళాలు కలిసి ఉగ్ర స్థావరాలపై జరిపిన దాడులు, ఉగ్రస్థావరాలను సమూలంగా నాశనం చేసిన భారత స్వదేశీ క్షిపణులు వంటి వివిధ విషయాలను ప్రస్తావించారు. ‘విక్రాంత్‌’పై మోదీ దీపావళి వేడుకలు గోవా తీరంలో నౌకాదళ సిబ్బందితో ప్రధానమంత్రి నరేంద్రమోదీ దీపావళి వేడుకలు చేసుకున్నారు. ఆదివారం రాత్రే స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌కు వెళ్లిన ప్రధాని.. ఈ ఉదయం నేవీ (Indian Navy) సిబ్బందితో వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ.. పాకిస్థాన్‌పై విరుచుకుపడ్డారు. ‘ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌’ దాయాదికి నిద్రలేని రాత్రులు మిగిల్చిందన్నారు.
Also Read : RJD: బిహార్‌ ఎన్నికలకు 143 మందితో ఆర్జేడీ జాబితా విడుదల
The post Indian Navy: ఆపరేషన్‌ సిందూర్‌పై నేవీ ‘కసమ్‌ సిందూర్‌కి’ పాట appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

AP Government: కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కసరత్తుAP Government: కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కసరత్తు

    జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ సమస్యల పరిష్కారంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం తుది దశకు చేరింది. అతి త్వరలోనే సీఎం చంద్రబాబుకు నివేదిక ఇవ్వాలని మంత్రులు నిర్ణయించారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు సహా మండలాలు, గ్రామాల సరిహద్దుల

‘Kiss Kiss Bang Bang’ Video Song from They Call Him OG Released, Goes Viral Online‘Kiss Kiss Bang Bang’ Video Song from They Call Him OG Released, Goes Viral Online

The blockbuster gangster action drama They Call Him OG, starring Power Star Pawan Kalyan and directed by Sujeeth, continues to make waves even after its successful theatrical run. The makers