hyderabadupdates.com Gallery Harsh Goenka: కిరణ్‌ మజుందార్‌ షాకు హర్ష్‌ గొయెంకా మద్దతు

Harsh Goenka: కిరణ్‌ మజుందార్‌ షాకు హర్ష్‌ గొయెంకా మద్దతు

Harsh Goenka: కిరణ్‌ మజుందార్‌ షాకు హర్ష్‌ గొయెంకా మద్దతు post thumbnail image

Harsh Goenka : భారత సిలికాన్‌ వ్యాలీగా అభివర్ణించే బెంగళూరులో రోడ్ల దుస్థితిపై బయోకాన్‌ లిమిటెడ్‌ వ్యవస్థాపకురాలు కిరణ్‌ మజుందార్‌ షా ఇటీవల చేసిన పోస్టులు రాజకీయంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ఆమెపై వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. దీనిపై తాజాగా ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్‌ గొయెంకా (Harsh Goenka) స్పందిస్తూ కిరణ్‌ మజుందార్‌ షాకు మద్దతుగా నిలిచారు. సమస్యకు పరిష్కారం వెతకడం మాని.. రాజకీయాలు చేస్తున్నారంటూ నేతలను ఆయన దుయ్యబట్టారు.
Harsh Goenka Support
‘‘మన రాజకీయ నాయకులు విమర్శలను తీసుకోకపోవడం దురదృష్టకరం. బెంగళూరులో క్షీణిస్తోన్న మౌలిక సదుపాయాల గురించి కిరణ్‌ మజుందార్‌ షా మాట్లాడారు. ఆ సమస్యను పరిష్కరించడం మాని నేతలు దానిపై రాజకీయం చేస్తున్నారు. ప్రభుత్వ అనుకూల పోస్టులు పెట్టాలని ఆమెను బలవంత పెడుతున్నారు. సమస్యపై కాకుండా విమర్శకులపై దాడి చేయడం సర్వసాధారణంగా మారిపోయింది’’ అని హర్ష్‌ గొయెంకా తన ఎక్స్‌ ఖాతాలో రాసుకొచ్చారు.
గత కొంతకాలంగా బెంగళూరు రోడ్ల పరిస్థితిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బయోకాన్‌ పార్క్‌కు వచ్చిన ఓ విదేశీ విజిటర్‌.. నగరంలోని రోడ్లు, చెత్తపై చేసిన వ్యాఖ్యలతో తాను ఇబ్బందిపడ్డానని కిరణ్‌ మజుందార్‌ షా ఓ పోస్టులో వెల్లడించారు. ఇది కాస్తా వైరల్‌గా మారింది. దీనిపై కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ వ్యంగ్యంగా బదులిచ్చారు. ఆమె రోడ్లను అభివృద్ధి చేయాలనుకుంటే చేయొచ్చంటూ అన్నారు. అందుకోసం నిధులు కూడా ఇస్తామన్నారు. వ్యక్తిగత అజెండాతోనే ఆమె ఈ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. భాజపా హయాంలో వారు ఎందుకు వీటిపై స్పందించలేదని ప్రశ్నించారు. ఈ పరిణామాలపైనే తాజాగా హర్ష్‌ గొయెంకా స్పందించారు.
Also Read : PM Narendra Modi: ‘ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌’పై ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
The post Harsh Goenka: కిరణ్‌ మజుందార్‌ షాకు హర్ష్‌ గొయెంకా మద్దతు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Mamata Banerjee: ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రోడ్డెక్కిన మమతా బెనర్జీMamata Banerjee: ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రోడ్డెక్కిన మమతా బెనర్జీ

    బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారంనాడు విరుచుకుపడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) బెంగాలీ మాట్లాడే పౌరులను లక్ష్యంగా చేసుకుని చేపట్టిన ‘నిశ్శబ్ద రిగ్గింగ్’ అని ఆరోపించారు.

చంద్రబాబు సార‌థ్యంలో వ్యవసాయ రంగానికి స్వర్ణయుగంచంద్రబాబు సార‌థ్యంలో వ్యవసాయ రంగానికి స్వర్ణయుగం

అమ‌రావ‌తి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయ రంగం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోందని, ఇది ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు దూరదృష్టి నాయకత్వం ఫలితమని రాష్ట్ర వ్యవసాయ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు అసెంబ్లీలో స్పష్టం చేశారు. గత ఐదేళ్ల విధ్వంసకర పాలన తరువాత రాష్ట్రాన్ని

రైతుల‌కు స్థిర ఆదాయం స‌ర్కార్ ల‌క్ష్యంరైతుల‌కు స్థిర ఆదాయం స‌ర్కార్ ల‌క్ష్యం

అమ‌రావ‌తి : రైతుల‌కు స్థిరమైన ఆదాయం క‌ల్పించ‌డం త‌మ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ఇందులో భాగంగా ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్ రేషియోను అనుసరించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో, మెట్రిక్ టన్నుకు సగటున రూ.19,579