hyderabadupdates.com Gallery Konda Surekha: సీఎం రేవంత్‌ రెడ్డితో కొండా దంపతుల భేటీ

Konda Surekha: సీఎం రేవంత్‌ రెడ్డితో కొండా దంపతుల భేటీ

Konda Surekha: సీఎం రేవంత్‌ రెడ్డితో కొండా దంపతుల భేటీ post thumbnail image

Konda Surekha : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తో మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీ భేటీ అయింది. ఈ దీపావళి పండుగ సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ నివాసానికి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి వెళ్లారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా కొండా దంపతుల వెంట సీఎం నివాసానికి వెళ్లారు.
Minister Konda Surekha Meet
తెలంగాణ కాంగ్రెస్ లో కొన్ని రోజులుగా మంత్రి కొండా సురేఖ (Konda Surekha) విషయంలో వివాదం రేగుతోంది. దీనికి సంబంధించి ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. మంత్రి కొండా సురేఖ ఓఎస్డీగా ఉన్న సుమంత్‌ ను ఇటీవల తొలగించడం, ఆయన కోసం పోలీసులు మంత్రి ఇంటికి వెళ్లడం తదితర పరిణామాలు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ భేటీ జరిగినట్టు సమాచారం. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రి కొండా సురేఖ దంపతులు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రి కొండా సురేఖ దంపతులు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిల మధ్య వివాదం మొదలైంది. మేడారం టెండర్ల పంచాయతీ, డక్కన్‌ సిమెంట్‌ యాజమాన్యాన్ని బెదిరించినట్లు ఆరోపణలపై కొండా సురేఖ ఓఎస్‌డి సుమంత్‌ను తొలగించడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఆయన కోసం పోలీసులు సురేఖ నివాసానికి వెళ్లడం, అక్కడ మంత్రి కుమార్తె సుస్మిత అడ్డుకోవడమూ తీవ్ర చర్చకు దారితీసింది. వీటన్నింటిపై ఏఐసీసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో… ఇప్పుడు సీఎం రేవంత్‌తో కొండా దంపతులు భేటీ అయ్యారు.
Also Read : Udhayanidhi Stalin: వివాదానికి దారితీసిన ఉదయనిధి స్టాలిన్‌ దీపావళి శుభాకాంక్షలు
The post Konda Surekha: సీఎం రేవంత్‌ రెడ్డితో కొండా దంపతుల భేటీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

“Telangana Cabinet’s Surprise Move—All Eyes on the Court”“Telangana Cabinet’s Surprise Move—All Eyes on the Court”

People anticipated clear decisions on local body elections and BC reservations in Thursday’s state cabinet meeting. The meeting, held at the Secretariat, was chaired by Chief Minister Revanth . The

India: అటవీ విస్తీర్ణంలో భారత్‌కు తొమ్మిదో స్థానంIndia: అటవీ విస్తీర్ణంలో భారత్‌కు తొమ్మిదో స్థానం

India : ప్రపంచవ్యాప్తంగా ఉన్న అటవీ విస్తీర్ణంలో భారత్‌ తొమ్మిదో స్థానానికి చేరుకుంది. వార్షిక అటవీ విస్తీర్ణ వృద్ధిలో మూడో స్థానాన్ని నిలుపుకొందని బుధవారం విడుదలైన గ్లోబల్‌ ఫారెస్ట్‌ రిసోర్స్‌ అసెస్‌మెంట్‌-2025 నివేదికలో వెల్లడైంది. గతేడాది పదో స్థానంలో ఉన్న భారత్‌