hyderabadupdates.com movies రష్మిక అదరగొట్టింది.. కానీ..

రష్మిక అదరగొట్టింది.. కానీ..

కన్నడలో ఓ చిన్న సినిమాతో కథానాయికగా పరిచయమైన రష్మిక మందన్నా.. కొన్నేళ్లలోనే పాన్ ఇండియా స్థాయిలో బంపర్ క్రేజ్ తెచ్చుకుంది. పుష్ప మూవీ పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేయడంతో ఆమెకు బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు మొదలయ్యాయి. ఐతే అక్కడ చేసిన తొలి రెండు సినిమాలు గుడ్ బై, మిషన్ మజ్ను ఆమెకు నిరాశనే మిగిల్చాయి. కానీ ‘యానిమల్’ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ అయి ఆమెకు పెద్ద బ్రేక్ ఇచ్చింది.

ఈ సినిమాలో అందం, అభినయంతో ఆకట్టుకుంది రష్మిక. ఈ ఏడాది ‘ఛావా’ రూపంలో ఆమె ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్ పడింది. మధ్యలో ‘సికిందర్’ షాకిచ్చినా.. ‘థామా’తో మళ్లీ పెద్ద సక్సెస్ సాధిస్తాననే ధీమాతో ఉంది రష్మిక. తాజాగా ఈ చిత్రం థియేటర్లలోకి దిగింది. దీపావళి తర్వాతి రోజు భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘థామా’. ఐతే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తోంది.

హార్రర్ కామెడీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిన మ్యాడ్ రాక్ ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేసిన సినిమా ‘థామా’. ఐతే వీళ్ల హార్రర్ కామెడీ యూనివర్శ్‌లో ఇంతకుముందు వచ్చిన స్త్రీ, స్త్రీ-2, బేడియా, ముంజియా తరహాలో ‘థామా’ ఎంటర్టైన్ చేయలేకపోయింది. విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నా.. కొన్ని సీన్లు ఎంటర్టైన్ చేసినా.. ఓవరాల్‌గా సినిమా నిరాశపరిచింది. కానీ సినిమాలో రష్మిక మాత్రం అదరగొట్టేసింది. బేతాళ పాత్రలో ఆమె నటన ఆకట్టుకుంది.

ఇంతకుముందు ఏ సినిమాలో లేని స్థాయిలో రష్మిక ఈ చిత్రంలో అందాలు ఆరబోసింది. ట్రైలర్లో తన లుక్ చూసే కుర్రాళ్లు వెర్రెత్తిపోయారు. సినిమాలో అంతకుమించి అందాల విందు చేసింది రష్మిక. ఇందులో రెండు లిప్ లాక్ సీన్లు కూడా ఉన్నాయి. ఓవైపు సెక్సీగా కనిపిస్తూనే, ఇంకోవైపు పెర్ఫామెన్స్‌లోనూ ఆకట్టుకున్న రష్మిక సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సినిమా అంత గొప్పగా లేకపోయినా.. మ్యాడ్ హాక్ హార్రర్ కామెడీ యూనివర్శ్‌తో ఉన్న కనెక్షన్.. కొన్ని సీన్లు ఎంటర్టైనింగ్‌గా ఉండడం, బాక్సాఫీస్ దగ్గర పోటీ లేకపోవడం దీనికి కలిసొచ్చి బాక్సాఫీస్‌ దగ్గర హిట్ అనిపించుకుంటే ఆశ్చర్యం లేదు.

Related Post

Prabhas Unveils ‘Shambhala’ Trailer: Aadi Sai Kumar Leads a Gripping Supernatural ThrillerPrabhas Unveils ‘Shambhala’ Trailer: Aadi Sai Kumar Leads a Gripping Supernatural Thriller

Rebel Star Prabhas has unveiled the trailer of Shambhala: A Mystical World, starring Aadi Sai Kumar, setting social media abuzz with excitement. His support has instantly brought massive attention to

క్రియేటివ్ ‘గులాబి’కి 30 వసంతాలుక్రియేటివ్ ‘గులాబి’కి 30 వసంతాలు

తొలి సినిమాతోనే తమదైన ముద్ర వేయడం ఎందరో దర్శకులు చేస్తారు కానీ ఒక క్రియేటివ్ పాత్ సృష్టించి తమను అనుసరించేలా చేయడం మాత్రం కొందరికే సాధ్యం. అలా ముందువరసలో చెప్పుకోదగ్గ పేరు కృష్ణవంశీ. ఆయన మొదటి సినిమా గులాబీ ముప్పై వసంతాలు