hyderabadupdates.com movies కాంతార మేకర్స్.. మాస్టర్ ప్లాన్

కాంతార మేకర్స్.. మాస్టర్ ప్లాన్

కాంతార అనే లో బడ్జెట్ రీజనల్ మూవీ.. మూడేళ్ల కిందట దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన ఈ కన్నడ చిత్రం.. తర్వాత హిందీ, తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదలై ఎవ్వరూ ఊహించని విధంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తీసి రిలీజ్ చేశారు. ఇది అంచనాలకు తగ్గట్లే ఆడుతోంది. ఇప్పటికే రూ.700 కోట్ల క్లబ్బులోకి అడుగు పెట్టింది కాంతార: ది చాప్టర్-1.

ఐతే ఈ ఏడాది ఇండియాలో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన ‘ఛావా’ను ‘కాంతార: చాప్టర్-1’ అధిగమిస్తుందా లేదా అనే విషయంలో సస్పెన్స్ నెలకొంది. హిందీ మూవీ ‘తామ’ వల్ల ఉత్తరాదిన ‘కాంతార’ వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. దక్షిణాదిన కూడా సినిమా బాగా స్లో అయ్యాయి. కాబట్టి రూ.800 కోట్ల ఘనతను అందుకోవడం కష్టంగానే ఉంది.ఐతే 2025 నంబర్ వన్ గ్రాసర్ రికార్డును అందుకోవడం కోసం ‘కాంతార’ మేకర్స్ మాస్టర్ ప్లాన్ వేశారు.

ఈ చిత్రాన్ని కొత్తగా ఇంగ్లిష్‌లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ నెల 31నే ఇంగ్లిష్ వెర్షన్ విడుదల కాబోతోంది. త్వరలో హీరో రిషబ్ శెట్టి అండ్ టీం విదేశాల్లో ఈ సినిమాను ప్రమోట్ చేయబోతున్నారట. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో నేటివ్ అమెరికన్స్ నుంచి అద్భుతమైన స్పందన తెచ్చుకోవడంతో తర్వాత థియేటర్లలోనూ కొన్ని స్పెషల్ షోలు వేయడం తెలిసిందే. ‘కాంతార’ సైతం అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకట్టుకునే పొటెన్షియాలిటీ ఉన్న సినిమా అని టీం భావిస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ లాగే ఇది కూడా అక్కడి వాళ్లను ఆకట్టుకుంటే.. ఓవరాల్ వసూళ్లు పెరిగి రూ.800 కోట్ల క్లబ్బులోకి ఈ సినిమా అడుగుపెడుతుందని ఆశిస్తున్నారు.

Related Post

సింగర్స్ ని వాడుకోవడంలో మాస్టర్ డిగ్రీసింగర్స్ ని వాడుకోవడంలో మాస్టర్ డిగ్రీ

దర్శకుడు అనిల్ రావిపూడికి కామెడీ మీదే కాదు మ్యూజిక్ మీద కూడా మంచి పట్టుంది. స్టార్ హీరోలు లైట్ తీసుకునే భీమ్స్ సిసిరోలియోతో సంక్రాంతికి వస్తున్నాం రూపంలో బ్లాక్ బస్టర్ ఆల్బమ్ చేయించుకోవడం అతనికే చెల్లింది. ముఖ్యంగా గోదారి గట్టు మీద