hyderabadupdates.com movies బాంబినో కుటుంబ ఆస్తుల వివాదం..

బాంబినో కుటుంబ ఆస్తుల వివాదం..

ఫాస్ట్-మూవింగ్ కంజ్యూమర్ గూడ్స్ (FMCG) రంగంలో బాంబినో బ్రాండ్ పేరు అందరికీ తెలిసిందే. ఈ సంస్థ స్థాపకుడు మాధం కిషన్ రావు 2021లో కన్నుమూశారు. ఆయన మరణానంతరం కుటుంబ సభ్యుల మధ్య ఆస్తుల పంపకంలో తీవ్ర విభేదాలు చోటు చేసుకున్నాయి. తాజాగా ఆయన మనవడు కార్తికేయ ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేసి నలుగురు మహిళలపై రూ. 40 కోట్ల షేర్, ఆస్తుల మోసాల కేసు నమోదు చేసాడు.

కిషన్ రావు తన పేరు మీద రేవతి తోభాకో కంపెనీ Pvt Ltd లో 98.23% షేర్లు కలిగివున్నారు. అతని మరణం తర్వాత, ఆ షేర్లను ఆయన కుమార్తెలు అక్రమ పత్రాలతో తమ పేర్లకు బదిలీ చేసుకున్నారని మనవడు కార్తికేయ ఫిర్యాదు చేశారు.

ఇంకా, ఆ కంపెనీకి చెందిన సుమారు 184 ఎకరాల స్థలాన్ని బ్యాంకులకు పూచిగా చూపించి రూ. 40 కోట్ల రుణం తీసుకున్నారు. ఇది కంపెనీ ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపింది. ఫిర్యాదులో చెప్పబడినట్టు, ఈ ఒప్పందాలు బోర్డు ఆమోదం లేకుండా జరిగాయని, ఫోర్జరీ చేసి మోసం చేసినట్లుగా భావిస్తున్నారు.

పోలీసులు ఈ కేసును భారతీయ శిక్షాస్మృతిలోని (IPC) సెక్షన్‌లు 405, 406, 417, 420తో పాటు 34 మరియు 120-B కింద, అదేవిధంగా భారతీయ నాగరిక సురక్షా సంహిత (BNSS) చట్టంలోని సెక్షన్ 175(3) ప్రకారం నేరాలు నమోదు చేసి, నలుగురు మహిళలను (అనూరాధ, శ్రీదేవి, అనందదేవి, తుల్జాభవాని) నిందితులుగా పేర్కొన్నారు.

ఈ కుంభకోణం వెనుక కుటుంబ కలహాలు, షేర్ బదిలీలు, కంపెనీ పాలనా లోపాలు వెలుగులోకి వస్తున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లేకపోవడం, సరైన డాక్యుమెంటేషన్ లేకపోవడం ఈ సమస్యలకు ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు.

వారసత్వంలో వ్యత్యాసాలు, కంపెనీ పాలనలో లోపాలు పెద్ద మోసాలకు దారి తీస్తాయన్న నిజాన్ని ఈ కేసు స్పష్టంగా చూపించింది. ఒక సమగ్ర, పారదర్శకమైన వారసత్వ ప్రణాళిక లేకపోతే, కుటుంబాల్లో కలహాలు, న్యాయ పోరాటాలు తప్పవు. పారదర్శకత లేకపోతే విలువైన ఆస్తులు కూడా కోల్పోతారు. బాంబినో కేసు ఇతర వ్యాపార కుటుంబాలకు ఒక పాఠం.

Related Post

Vaanara First Look: Avinash Thiruvidhula Shines in a Striking Socio-Fantasy DebutVaanara First Look: Avinash Thiruvidhula Shines in a Striking Socio-Fantasy Debut

Young talent Avinash Thiruvidhula is stepping into cinema with a strong statement, making his debut as both hero and director in the socio-fantasy entertainer Vaanara. The film is gaining attention

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడేకార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక ఇబ్బంది ప‌డుతున్నారు. అన్న‌తో పోలిస్తే కార్తి కొంచెం న‌య‌మే కానీ.. అత‌డికీ పెద్ద మాస్ హిట్ ప‌డి చాలా కాల‌మే