hyderabadupdates.com Gallery Indigo: రూ.8 వేలకే విజయవాడ-సింగపూర్‌ ఫ్లైట్ సర్వీస్ !

Indigo: రూ.8 వేలకే విజయవాడ-సింగపూర్‌ ఫ్లైట్ సర్వీస్ !

 
విమాన ప్రయాణాలు చేసే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్. విజయవాడ-సింగపూర్‌ మార్గంలో నవంబర్‌ 15 నుంచి ఇండిగో సంస్థ తన కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సర్వీసును ప్రారంభించనుంది. ఈ సర్వీస్‌ మొదలైతే విజయవాడ నుంచి సింగపూర్‌ వెళ్లాలనుకునే ప్రయాణికులకు ఊరట లభించనుంది. హైదరాబాద్​ లేదా చెన్నై మీదుగా వెళ్లాల్సిన అవసరం లేకుండా విజయవాడ నుంచే డైరెక్ట్ గా ప్రయాణించవచ్చు. ఇక ఫ్లైట్ టికెట్‌ ధర కేవలం రూ.8 వేలు మాత్రమే కావడం విశేషం. సాధారణంగా సింగపూర్‌ కు ప్రయాణించాలంటే… కనీసం రూ.15 నుంచి 20 వేలు వరకు ఖర్చవుతుంది. ఈ సర్వీసుతో కేవలం రూ.8 వేలకు ప్రయాణం అందుబాటులో ఉంటుంది.
 
సింగపూర్‌ నుంచి బయలుదేరే విమానం ఉదయం 7.45 గంటలకు విజయవాడ ఇంటర్నేషనర్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటుందని ఇండిగో సంస్థ తెలిపింది. తిరిగి ఇక్కడి నుంచి ఉదయం 10.05 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.05 గంటలకు సింగపూర్‌ చాంగి విమానాశ్రయానికి చేరుకుంటుందని వివరించింది. సుమారు నాలుగు గంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుందని తెలిపింది. విజయవాడ నుంచి ప్రయాణం… అందులోనూ సౌకర్యవంతమైన సమయాలు, తక్కువ టికెట్ ధర కావడంతో వ్యాపారవేత్తలు, పర్యాటకులు, విద్యార్థులు అందరికీ ఈ మార్గం అనుకూలంగా మారనుంది. వారానికి మూడు రోజులు(మంగళవారం, గురువారం, శనివారం) ఈ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. 180 నుంచి 230 సీట్లు కలిగిన ఇండిగో బోయింగ్‌ ఫ్లైట్ లతో సర్వీసులు నడువనున్నాయి. తొలుత వారానికి మూడు సార్లు మాత్రమే నడపాలని నిర్ణయించారు. ప్రయాణికుల నుంచి డిమాండ్‌ పెరిగితే రోజువారీ సర్వీసు నడిచేవిధంగా చర్యలు తీసుకుంటామని సంస్థ సిబ్బంది తెలిపారు.
The post Indigo: రూ.8 వేలకే విజయవాడ-సింగపూర్‌ ఫ్లైట్ సర్వీస్ ! appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

KTR: ప్రజా తీర్పును గౌరవిస్తాం – కేటీఆర్‌KTR: ప్రజా తీర్పును గౌరవిస్తాం – కేటీఆర్‌

  జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఫలితం చూస్తే బీజేపీ, కాంగ్రెస్‌ కుమ్మక్కు రాజకీయం ఫలించినట్టే కనిపిస్తోందని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. బీజేపీకు డిపాజిట్‌ కూడా రాలేదని… ‘ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌’ సమీకరణం బాగానే పనిచేసిందని చెప్పారు. ఎన్నికలకు

అంగ‌రంగ వైభోగం ధ్వ‌జారోహ‌ణంఅంగ‌రంగ వైభోగం ధ్వ‌జారోహ‌ణం

తిరుపతి : తిరుపతి శ్రీకపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఆదివారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. అర్చకుల వేదమంత్రోచ్ఛారణ, శంఖనాదాలు, శివ నామస్మరణ మధ్య ధ్వజారోహణ ఘట్టం శాస్త్రోక్తంగా జరిగింది. పంచమూర్తులైన శ్రీ సోమస్కంధ మూర్తి, శ్రీ కామాక్షి అమ్మ వారు, శ్రీ

Inter Colleges: ఈ నెల 15 వరకు ఇంటర్ కాలేజీల్లో తనిఖీలుInter Colleges: ఈ నెల 15 వరకు ఇంటర్ కాలేజీల్లో తనిఖీలు

Inter Colleges : తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల పనితీరు మెరుగుపరచడంలో భాగంగా కాలేజీల్లో బోర్డు తనిఖీలు చేపట్టింది. ఈ నెల 15 వరకు తనిఖీలు నిర్వహిస్తామని వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,752 ప్రైవేట్,