hyderabadupdates.com Gallery Uttarakhand: కేదార్‌నాథ్‌, యమునోత్రి ఆలయాల మూసివేత

Uttarakhand: కేదార్‌నాథ్‌, యమునోత్రి ఆలయాల మూసివేత

Uttarakhand: కేదార్‌నాథ్‌, యమునోత్రి ఆలయాల మూసివేత post thumbnail image

Uttarakhand : శీతాకాలం రావడంతో హిమాలయాల్లోని పవిత్ర పుణ్యక్షేత్రాలైన కేదార్‌నాథ్‌, యమునోత్రి ఆలయాలను ఉత్తరాఖండ్‌ (Uttarakhand) అధికారులు మూసివేశారు. ఈ సందర్భంగా గురువారం ముగింపు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రుద్రప్రయాగ్‌ నుంచి కేదార్‌నాథుడి పల్లకి ఊరేగింపు ఆర్మీ మేళతాళాలు, సుమారు పది వేల మంది భక్తుల నినాదాల మధ్య ఘనంగా ప్రారంభమయింది. ఈ ఊరేగింపు శనివారం నాటికి ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర ఆలయానికి చేరుకోనుంది. మిగిలిన ఆరునెలల పాటు ఆ ఆలయంలో కేదార్‌నాథుడు పూజలందుకుంటాడు. ఈ ఉత్సవాల్లో ఉత్తరాఖండ్‌ (Uttarakhand) సీఎం పుష్కర్‌సింగ్‌ ధామీతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ ఏడాది చార్‌ధామ్‌ యాత్ర చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్‌ ఆలయాలను అధికారులు మూసివేయగా, బద్రీనాథ్‌ ఆలయాన్ని నవంబరు 25న మూసివేయనున్నారు. మంచు, తీవ్రమైన చలి కారణంగా ప్రతి సంవత్సరం అక్టోబరు- నవంబరు నెలల్లో ఈ ఆలయాలను మూసివేసి ఏప్రిల్‌- మే నెలల్లో తిరిగి తెరుస్తారు.
Uttarakhand – ఒకే గుడిలో రెండు రూపాల్లో కృష్ణుడి దర్శనం
రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌లో 500 ఏళ్ల క్రితం నాగ సాధువులు నిర్మించిన బ్రజ్‌లౌతా ఆలయంలోని రెండు శ్రీకృష్ణుడి విగ్రహాలు చూపరులను ఆకట్టుకుంటాయి. ఈ గుడిలోని ఓ విగ్రహం కన్నయ్య వేణువు పట్టుకున్న రూపంలో ఉంటుంది. కర్ర చేత పట్టుకున్నట్లు మరో ప్రతిమ దర్శనమిస్తుంది. ఈ ఆలయ చరిత్ర శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన లీలతో ముడిపడి ఉంది. ‘‘ఇంద్రుడికి గర్వ భంగం చేయడానికి శ్రీకృష్ణుడు ఎత్తిన గోవర్ధన గిరి కింద బ్రజ్‌ ప్రజలు ఏడు రోజులు సురక్షితంగా ఉన్నారు. ఇంద్రుడికి కోపం తగ్గిన తర్వాత కృష్ణుడు కర్ర పట్టుకుని ప్రజలకు కనిపించాడు. దీంతో అప్పటి నుంచి బ్రజ్‌ ప్రజలు కన్నయ్యను రెండు రూపాల్లో పూజించడం ప్రారంభించారు’’ అని చెబుతారు. ఈ గుడిలో ఉన్న ఒక కృష్ణుడి రూపం ప్రజలను రక్షించేదిగా, మరొక రూపం ఆనందాన్ని ప్రసాదించేదిగా భక్తులు భావిస్తారు.
Also Read : CJI: కొత్త సీజేఐ ఎంపిక ప్రక్రియ ప్రారంభం
The post Uttarakhand: కేదార్‌నాథ్‌, యమునోత్రి ఆలయాల మూసివేత appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

విజయ్ పాల్ రెడ్డి వరుస మూడు సినిమాలు!విజయ్ పాల్ రెడ్డి వరుస మూడు సినిమాలు!

వానరా సెల్యూలాయిడ్ బ్యానర్‌లో ‘త్రిబాణధారి బార్బరిక్’ మరియు ‘బ్యూటీ’ వంటి సినిమాలు విజయవంతంగా రీల్‌లో వచ్చాయి. విభిన్న కథలతో సినిమా పరిశ్రమలో కొత్త ప్రయోగాలు చేయాలనే లక్ష్యంతో నిర్మాతగా Vijay Pal Reddy అడుగుపెట్టారు. ఇప్పుడెన్నో విజయాల తర్వాత, ఆయన మరోసారి

Mumbai Hostage: పిల్లల నిర్బంధం ఘటనపై మరాఠీ నటి సంచలన పోస్ట్‌Mumbai Hostage: పిల్లల నిర్బంధం ఘటనపై మరాఠీ నటి సంచలన పోస్ట్‌

Mumbai Hostage : మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని (Mumbai) ఓ యాక్టింగ్‌ స్టూడియోలో పట్టపగలే చిన్నారులను నిర్బంధించడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన పై తాజాగా మరాఠీ నటి రుచితా విజయ్‌ జాదవ్‌ స్పందిస్తూ సంచలన విషయాలు

తెలంగాణ ముద్దుబిడ్డ సూదిని జైపాల్ రెడ్డితెలంగాణ ముద్దుబిడ్డ సూదిని జైపాల్ రెడ్డి

హైద‌రాబాద్ : భార‌త దేశం గ‌ర్వించ ద‌గిన అరుదైన నాయ‌కుడు మాజీ కేంద్ర మంత్రి, దివంగ‌త సూదిని జైపాల్ రెడ్డి అని అన్నారు ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. రాజకీయాలకు విలువల విలువ తెలిపి, ప్రజాసేవకు నిస్వార్థమే పరమార్థమని చెప్పిన అరుదైన