hyderabadupdates.com movies తెలుసా నీకోసమే ఏదైనా చేస్తాలే…!

తెలుసా నీకోసమే ఏదైనా చేస్తాలే…!

యంగ్ టీమ్ చేసిన సినిమాలను త్వరగా ఆడియెన్స్ దగ్గరకు రీచ్ చేసేది మ్యూజిక్. వినగానే గుర్తుండిపోయే సాంగ్స్ రిలీజ్ చేస్తూ ఆడియెన్స్ కు తమ సినిమాను దగ్గర చేసే ప్రయత్నం చేస్తోంది “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా టీమ్. ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ నాలో ఏదో, అనుకుందొకటిలే అయ్యిందొకటిలే రిలీజై హిట్ కాగా..ఇప్పుడు థర్డ్ లిరికల్ సాంగ్ తెలుసా నీ కోసమే రిలీజ్ చేశారు మేకర్స్. ఈ బ్యూటిఫుల్ మెలొడీ సాంగ్ ఇన్ స్టంట్ గా మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. ఆయ్, సేవ్ ది టైగర్స్ ఫేమ్ మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ తెలుసా నీకోసమే పాటను ఛాట్ బస్టర్ ట్యూన్ తో కంపోజ్ చేశారు. ఈ పాట నేపథ్యంలోని భావోద్వేగాలను తన సాహిత్యంలో పలికించారు శ్రీమణి. మంచి ఫీల్ తో హార్ట్ టచింగ్ గా పాడారు అర్మాన్ మాలిక్.

పెళ్లి తర్వాత కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఓ నవ జంట మనసులోని భావోద్వేగాలకు ప్రతిరూమే తెలుసా నీకోసమే పాట. ‘ గుండెలో చిన్ని గుండెలో ఏడు రంగులవాన, జతగా అడుగేశాక నువు నాతోన, ఎండలో మండుటెండలో వెండి వెన్నెల వాన, కథనం మొదలయ్యాక మన కథతోన, ..తెలుసా నీకోసమే నన్నే దాచాలే, ప్రాణం పంచేంతగా ప్రేమించాలే , తెలుసా నీకోసమే ఏదైనా చేస్తాలే , వింటా ఏకాంతమై నీ మౌనాలే..’ అంటూ లవ్, అడ్మిరేషన్, బాండింగ్, ఎమోషన్ తో ఈ పాట సాగుతుంది. ‘

హిట్ ట్యూన్, క్యాచీ లిరిక్స్, బ్యూటిఫుల్ సింగింగ్ తో తెలుసా నీ కోసమే పాట ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంది. “సంతాన ప్రాప్తిరస్తు” సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా నవంబర్ 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

Related Post

రాజమౌళిని ఫాలో అవ్వండయ్యారాజమౌళిని ఫాలో అవ్వండయ్యా

మామూలుగా తన కొత్త సినిమాను మొదలుపెట్టే ముందే దాని విశేషాలను అధికారికంగా మీడియాతో, అభిమానులతో పంచుకోవడం రాజమౌళికి అలవాటు. సినిమా ప్రారంభోత్సవం రోజే ‘ఈగ’ కథ చెప్పడం.. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణ ఆరంభ దశలో ఉండగానే ఆ సినిమా కాన్సెప్ట్ గురించి ఓపెన్