hyderabadupdates.com movies ఇక్కడ ప్రతిపక్షం తరఫున నోరు విప్పే నాయకుడే లేరు

ఇక్కడ ప్రతిపక్షం తరఫున నోరు విప్పే నాయకుడే లేరు

రాజకీయాల్లో పోటీ లేకుండా ఎక్కడా ఉండదు. చిన్నచితకా పార్టీలైనా పోటీ ఇస్తుంటాయి. ఇక ప్రధాన పార్టీల మధ్య పోరు, పోటీ ఎలానూ ఉంటుంది. కానీ చిత్రంగా రాష్ట్రంలోని విజయవాడ, గుంటూరు పార్లమెంటు నియోజకవర్గాల్లో టిడిపికి పోటీ లేకుండాపోయింది. అంతేకాదు, ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రధాన ప్రతిపక్షం తరఫున నోరు విప్పే నాయకుడు కూడా లేరు. దీంతో అధికార పార్టీ తరఫున చేసుకునేందుకు చాలా అవకాశం ఉంది.

మరి ఏం జరుగుతోంది?

గుంటూరు పార్లమెంటు స్థానంలో గత ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీ నాయకుడు ప్రస్తుతం ఆ పార్టీని వీడి వేరే పార్టీలో చేరారు. దీంతో ఇక్కడ వేరే నేత ఊసే లేకుండాపోయింది. ఇక ఇక్కడ నుంచి టీడీపీ తరఫున విజయాన్ని దక్కించుకున్న పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. ఆయన గ్రాఫ్ నియోజకవర్గంలో బాగానే ఉందన్న టాక్ వినిపిస్తోంది. కేంద్ర మంత్రిగా బిజీగా ఉన్నా, పెమ్మసాని తరచుగా జిల్లాలో పర్యటిస్తున్నారు. కీలక సమస్యలు, ప్రాజెక్టుల విషయంలో అందరినీ కలుపుకొని పోతున్నారు.

ఇక విజయవాడలోనూ దాదాపు ఇలానే పరిస్థితి కొనసాగుతోంది. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన టీడీపీ మాజీ నేత, మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన తిరిగి రాజకీయ అరంగేట్రం చేస్తారనీ అంటున్నా, ఇప్పట్లో ఆయన వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో వైసీపీ మాట ఇక్కడ కూడా పార్లమెంటు నియోజకవర్గం స్థాయిలో వినిపించడం లేదు. టీడీపీ తరఫున విజయాన్ని దక్కించుకున్న చిన్ని పనులు చేస్తున్నారు. ఇటీవల ఆయన నిర్వహించిన విజయవాడ ఉత్సవ్‌కు మంచి పేరు వచ్చింది.

అయితే చిన్నపాటి వివాదాలు కొంత మేరకు సరిచేసుకుంటే, చిన్ని గ్రాఫ్ పుంజుకునేందుకు అవకాశం ఉంటుంది. వాస్తవానికి ఇతర నియోజకవర్గాలతో పోల్చుకుంటే, ఈ రెండు టిడిపికి హాట్‌కేక్‌లుగానే ఉన్నాయని చెప్పాలి. 2014, 2019, 2024 ఎన్నికల్లో గుంటూరు, విజయవాడలను టీడీపీ దక్కించుకుంది. అంటే ఇప్పటి వరకు వైసీపీ ఇక్కడ పాగా వేయలేకపోయింది. ఇదే పంథాను కొనసాగిస్తే, పార్టీకిఇబ్బంది ఉండదని అంటున్నారు పరిశీలకులు. మొత్తంగా ఈ రెండు నియోజకవర్గాల్లో పార్టీకి ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉండడం గమనార్హం.

Related Post

ప‌సిడి ధ‌ర.. ప‌ర్సులు పిసికేస్తోంది.. రీజ‌నేంటి?ప‌సిడి ధ‌ర.. ప‌ర్సులు పిసికేస్తోంది.. రీజ‌నేంటి?

ప‌సిడి.. బంగారం.. స్వ‌ర్ణం.. పేర్లు ఏవైనా.. ప్రతి ఒక్క‌రూ పండుగ‌ల సీజ‌న్‌లో అంతో ఇంతో కొనుగోలు చేయాల‌ని భావిస్తారు. ముఖ్యంగా కొత్త‌గా పెళ్ల‌యిన జంట‌ల‌కు అత్త‌మామ‌లు.. పుట్టింటివారు కూడా కానుక‌గా స్వ‌ర్ణాభర‌ణాల‌నే ఇవ్వాల‌ని త‌ల‌పోస్తారు. ఇక‌, ఇళ్ల‌లో జ‌రిగే శుభ‌కార్యాల‌కు కూడా