hyderabadupdates.com movies పండగ పోటీలో ‘డెకాయిట్’ ధీమా

పండగ పోటీలో ‘డెకాయిట్’ ధీమా

ఈ ఏడాది చివర్లో క్రిస్మస్ కు విడుదల కావాల్సిన అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఫ్యాన్స్ కొత్త డేట్ కోసం ఎదురు చూస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఆ లాంఛనం అయిపోయింది. 2026 మార్చ్ 19 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ కాంపిటేషన్ పరంగా చూసుకుంటే డెకాయిట్ చాలా పెద్ద రిస్క్ చేస్తోంది. ఎందుకంటే సరిగ్గా వారం రోజుల తర్వాత వరసగా మార్చి 26, 27 తేదీల్లో రామ్ చరణ్ పెద్ది, నాని ప్యారడైజ్ రాబోతున్నాయి. వీటి మీదున్న హైప్ కి వారం పది రోజులు అటుఇటు పోటీకి దిగడం సవాలే.

అయినా సరే డెకాయిట్ ఈ నిర్ణయం తీసుకోవడం చూస్తే వాటిలో ఏదో ఒకటి వాయిదా పడుతుందనే ధీమా ఏదైనా ఉందేమో. కథ ఇక్కడితో అయిపోలేదు. మార్చి 19 యష్ ప్యాన్ ఇండియా మూవీ టాక్సిక్ ఉంది. షూటింగ్ అయితే జరుగుతోంది. కెజిఎఫ్ తర్వాత సినిమా కావడంతో డిమాండ్ మాములుగా లేదు. దాంతో ఫేస్ టు ఫేస్ క్లాష్ అంటే ఏపీ తెలంగాణ కాకుండా బయట రాష్ట్రాల్లో డెకాయిట్ కు పెద్ద సవాలవుతుంది. ఇది కాకుండా రన్బీర్ కపూర్ – సంజయ్ లీలా భన్సాలీ లవ్ అండ్ వార్ సైతం అదే డేట్ మీద కర్చీఫ్ వేసుకుని ఉంది. పోస్ట్ పోన్ గురించి ఎలాంటి టాక్ లేదు కానీ ప్రస్తుతానికి వాయిదా వేసుకోలేదు.

రెండేళ్లుగా తెరమీద దర్శనం లేకుండా పోయిన అడివి శేష్ సోలోగా రాకుండా ఇంత రిస్క్ చేయడం చూస్తుంటే అన్నపూర్ణ స్టూడియోస్ లెక్కలు ఏవో వేరుగా ఉన్నట్టున్నాయి. కథలు, బడ్జెట్ ల ఎంపిక తనదంటూ విలక్షణమైన శైలి పాటిస్తున్న అడవి శేష్ డెకాయిట్ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ముందు శృతి హాసన్ ని హీరోయిన్ గా తీసుకుని కొంత షూట్ అయ్యాక ఆమె స్థానంలో మృణాల్ ఠాకూర్  ని తీసుకొచ్చి మళ్ళీ రీ షూట్ చేయడం తెలిసిందే. శేష్ కూడా ఒక ప్రమాదంలో గాయాల పాలయ్యాడు. ఇన్ని స్పీడ్ బ్రేకర్స్ దాటుకుంటూ వచ్చిన డెకాయిట్ మీద ట్రేడ్ అయితే మంచి బజ్ ఉంది. అనురాగ్ కశ్యప్ ఇందులో విలన్.

Related Post

పెద్ది కోసం ప్రాణాలు తోడేస్తున్న బుచ్చిపెద్ది కోసం ప్రాణాలు తోడేస్తున్న బుచ్చి

ఇప్పటిదాకా వదిలిన కంటెంట్ లో చిన్న టీజర్, పాత్రల పోస్టర్లు తప్ప అసలు పెద్దిలో ఏముందో స్పష్టంగా చెప్పే విషయాలు బయటికి రాలేదు. అంతా ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటూ వెళ్తున్న దర్శకుడు బుచ్చిబాబు, వచ్చే ఏడాది మార్చి 27 విడుదల

Bison: Director Mari Selvaraj thrilled by Mani Ratnam’s appreciationBison: Director Mari Selvaraj thrilled by Mani Ratnam’s appreciation

Director Mari Selvaraj couldn’t contain his excitement after receiving an unexpected message of appreciation from legendary filmmaker Mani Ratnam for his latest film Bison. Sharing his joy, Mari said, “I

Anu Emmanuel Finds Deep Fulfilment Playing Durga in ‘The Girlfriend’Anu Emmanuel Finds Deep Fulfilment Playing Durga in ‘The Girlfriend’

Young and talented actress Anu Emmanuel says playing Durga in The Girlfriend gave her immense creative satisfaction. The recently released film, starring Rashmika Mandanna and Dheekshith Shetty, has received a