hyderabadupdates.com movies భళిరా బాహుబలి… రికార్డులన్నీ ఖాళీ

భళిరా బాహుబలి… రికార్డులన్నీ ఖాళీ

బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్ అంచనాలకు మించి వసూళ్లు రాబట్టేలా ఉంది. క్రేజ్ ఉంటుందని ముందే ఊహించినప్పటికీ ఈ స్థాయి రెస్పాన్స్ బయ్యర్ వర్గాలను ఆనందంలో ముంచెత్తుతోంది. 3 గంటల 44 నిమిషాల నిడివిని లెక్క చేయకుండా బిగ్గెస్ట్ థియేటర్ ఎక్స్ పీరియన్స్ కోసం రెడీ అవుతున్న ఆడియన్స్ అక్టోబర్ 30 సాయంత్రం ప్రీమియర్ షోల నుంచే హడావిడి చేయబోతున్నారు. బుక్ మై షోలో గత ఇరవై నాలుగు గంటల్లో అమ్ముడైన టికెట్లు అక్షరాలా 52 వేలకు పైమాటే. ఒక్క హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ లోనే 12 వేల టికెట్లు అమ్ముడుపోయాయంటే బాహుబలి జ్వరం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

అక్కడే కాదు దాదాపు అన్ని సెంటర్లలో పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. జిల్లా కేంద్రాల్లో మొదటి రోజు షోలన్నీ దాదాపు ఫుల్లే. రవితేజ మాస్ జాతర లాంటి కొత్త రిలీజ్ కాంపిటీషన్ లో ఉన్నా సరే జనం బాహుబలి ఎపిక్ కోసమే ఎగబడుతున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ జోరు ఎన్ని రోజులు ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. గతంలో మురారి, ఖుషి, పోకిరి లాంటి అతి కొన్ని రీ రిలీజులు మాత్రమే లాంగ్ రన్ దక్కించుకున్నాయి. ఈ లెక్కన బాహుబలి కనీసం రెండు వారాలు హోల్డ్ చేస్తుందని బయ్యర్లు నమ్ముతున్నారు. అదే జరిగితే ఎవరూ అందుకోలేని రికార్డులు నమోదవుతాయి.

మాస్ జాతర కనక బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే కొంచెం నెమ్మదించవచ్చేమో కానీ లేదంటే మాత్రం బాహుబలి ఎపిక్ సునామి సృష్టించడం ఖాయం. మరొక ముఖ్యమైన విషయం తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతుంటే అడ్వాన్స్ బుకింగ్స్ ఇంత స్పీడ్ మీద ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. రాజమౌళి బృందం తెలివిగా కట్ చేసిన రెండు ట్రైలర్లు బ్రహ్మాండంగా పని చేస్తున్నాయి. ఆల్రెడీ వందలసార్లు చూసినా సినిమా అయినా మరోసారి బిగ్ స్క్రీన్ అనుభూతి దక్కించుకోవాలనే కోరిక కలిగించేలా మార్కెటింగ్ చేశారు. చూడాలి మరి బాహుబలి ఎపిక్ ఎవరూ అందుకోలేని ఏఏ రికార్డులు సృష్టించబోతోందో.

Related Post

Meet Mashael Alqahtani: A Saudi screenwriter making waves with Two SistersMeet Mashael Alqahtani: A Saudi screenwriter making waves with Two Sisters

Discover how Mashael Alqahtani, a rising Saudi screenwriter, is making waves with her award-winning film Two Sisters and redefining global cinema’s future. The post Meet Mashael Alqahtani: A Saudi screenwriter

అజిత్‌తో – విజయ్ – రాఘవ లారెన్స్?అజిత్‌తో – విజయ్ – రాఘవ లారెన్స్?

చాలా ఏళ్లుగా తన స్థాయికి తగ్గ సక్సెస్ లేక ఇబ్బంది పడుతూ వచ్చాడు తమిళ టాప్ స్టార్లలో ఒకడైన అజిత్ కుమార్. ఐతే ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఆయన కరవును తీర్చింది. ఇదేం గొప్ప సినిమా కాదు కానీ..