పేరుకు ఢిల్లీ భామే కానీ.. రాశి ఖన్నాను తెలుగమ్మాయిలాగే చూస్తారు మన ప్రేక్షకులు. ఈ మధ్య తెలుగులో సినిమాలు తగ్గాయి కానీ.. ఆమె కెరీర్లో ఎక్కువ చిత్రాలు చేసింది తెలుగులోనే. ఇటీవలే ‘తెలుసు కదా’ చిత్రంలో మంచి పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంది రాశి. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తన లవ్ లైఫ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది రాశి. తాను రెండుసార్లు ప్రేమలో పడ్డానని.. అందులో ఒకటి సినిమాల్లోకి రాకముందు అని చెప్పింది.
రెండోది ఇండస్ట్రీలోకి వచ్చాక అని, ఐతే తాను ప్రస్తుతం రిలేషన్‌షిప్‌లో ఉన్నానా లేనా అన్నది మాత్రం చెప్పలేనని ఆమె అంది. ఆ వ్యాఖ్యలు చూస్తే.. ప్రస్తుతం రాశి ఎవరితోనో ప్రేమలో ఉన్నట్లే కనిపించింది. ఇప్పుడు ఆ రిలేషన్‌షిప్ గురించి ఒక ఫొటో ద్వారా పరోక్షంగా హింట్ కూడా ఇచ్చేసింది రాశి.
తాజాగా తన ఇన్‌స్టా స్టోరీలో రాశి ఒక ఫొటో షేర్ చేసింది. అందులో ఆమె ఒక వ్యక్తిని కౌగిలించుకుని ఉంది. తన ముఖం మాత్రం కనిపించడం లేదు. ఆ ఫొటోకు.. ‘‘కౌగిలించుకుంటే ఈ ప్రపంచ సున్నితంగా కనిపిస్తుంది’’ అని వ్యాఖ్య జోడించింది రాశి. ఈ ఫొటో, కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫొటోలో ఉన్నది రాశి సీక్రెట్ లవరే అని.. తాను రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు రాశి కన్ఫమ్ చేసేసినట్లే అని.. ఇక తెలియాల్సిందల్లా ఆ వ్యక్తి ఎవరన్నదే అని చర్చించుకుంటున్నారు.
రాశితో ప్రేమలో ఉన్న వ్యక్తి సినీ రంగానికి చెందిన వాడా కాదా అనే డిస్కషన్ నడుస్తోంది. మరి ఈ విషయాన్ని రాశి ఎప్పుడు బయటపెడుతుందో చూడాలి. ప్రస్తుతం ఆమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హిందీలోనూ ఆమె ఒక సినిమా చేస్తున్నట్లు సమాచారం.