hyderabadupdates.com movies రాజమౌళి – ట్రెండ్ ఫాలో అవ్వరు, ట్రెండ్ సెట్ చేస్తారు!

రాజమౌళి – ట్రెండ్ ఫాలో అవ్వరు, ట్రెండ్ సెట్ చేస్తారు!

బాహుబలి ది ఎపిక్ సెన్సేషన్ సృష్టిస్తున్న వేళ ఇతర నిర్మాతలకో కొత్త మార్గం దొరికింది. ఇప్పటిదాకా సీక్వెల్స్ వచ్చిన బ్లాక్ బస్టర్స్ ఇకపై ఇలా సింగల్ పార్ట్ గా కొత్త ఎడిటింగ్ తో ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయొచ్చని అర్థమయ్యింది. బాహుబలి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జక్కన్న చేసిన ప్రయోగం ఊహించిన దానికన్నా గొప్ప ఫలితాన్ని ఇచ్చింది. రాబోయే రోజుల్లో మిగిలిన వాళ్ళు కూడా ఇదే ఫాలో అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ముఖ్యంగా పుష్ప, కెజిఎఫ్, కాంతార సిరీస్ లకు ఇది మంచి అవకాశం. ఇప్పటికిప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లో ఇవి బంగారు బాతుల్లా మారాడం పక్కా.

దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఒకటుంది. రాజమౌళి ఎందుకు ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తారనేది. ఒకవేళ బాహుబలి బిగినింగ్, బాహుబలి కంక్లూజన్ విడివిడిగా రీ రిలీజ్ చేసి ఉంటే ఈ స్థాయి రెస్పాన్స్ వచ్చేది కాదేమో. ఎందుకంటే శాటిలైట్, ఓటిటిలో వీటిని అరిగిపోయే దాకా జనాలు కొన్ని వందలసార్లు చూశారు. పైగా రెండు భాగాలంటే రెండుసార్లు టికెట్ల కోసం ఖర్చుపెట్టాలనే ఫీలింగ్ కామన్ ఆడియన్స్ లో ఉంటుంది. అందుకే సింగల్ టికెట్, డబుల్ మూవీ ఫార్ములాగా రాజమౌళి చేసిన ఈ ఎక్స్ పరిమెంట్ మాములుగా పేలలేదు. పైగా ప్రత్యేకంగా చేసిన ప్రమోషన్లు బాహుబలి ఎపిక్ కి బాగా కలిసి వచ్చాయి.

ఇప్పుడు బాలీవుడ్ దర్శక నిర్మాతలు ఈ స్ట్రాటజీ మీద ఫోకస్ పెడుతున్నట్టు ముంబై టాక్. ధూమ్, డాన్, హౌస్ ఫుల్, స్త్రీ, ఏక్ ధా టైగర్, జాలీ ఎల్ఎల్బి, దబాంగ్, భూల్ భులాయ్యా, సింగం, గోల్ మాల్ లాంటి వన్నీ సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజీలుగా హిట్లు కొట్టినవి. వీటిని సింగిల్ పార్ట్ గా మార్చి కొత్త వెర్షన్ రిలీజ్ చేస్తే ఆడియన్స్ సర్ప్రైజ్ అవ్వొచ్చనే ఆలోచనతో, దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. గ్రాండియర్స్ కు కొత్త అర్థం చెప్పి టాలీవుడ్ గమనాన్ని మార్చిన రాజమౌళి ఇప్పుడీ బాహుబలి ది ఎపిక్ తో మరో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టారు. ఇదెలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.

Related Post