hyderabadupdates.com movies టీడీపీ మేయ‌ర్ క‌పుల్ మ‌ర్డ‌ర్‌: ఐదుగురికి ఉరి శిక్ష‌

టీడీపీ మేయ‌ర్ క‌పుల్ మ‌ర్డ‌ర్‌: ఐదుగురికి ఉరి శిక్ష‌

ఏపీలో జ‌రిగిన మేయ‌ర్ దంప‌తుల దారుణ హ‌త్య కేసులో స్థానిక కోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. దోషులుగా తేలిన ఐదుగురికి ఉరి శిక్ష విధించింది. అదేవిధంగా ఈ కేసులో ఏ1గా ఉన్న దోషికి ఏకంగా 70 ల‌క్ష‌ల రూపాయ‌ల జ‌రిమానా విధించిన కోర్టు.. దీనిలో 50 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను బాధిత కుటుంబానికి అందించాల‌ని, మ‌రో 20 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను గాయ‌ప‌డిన వ్య‌క్తికి ఇవ్వాల‌ని జిల్లా స్థాయి కోర్టు జ‌డ్జి సంచ‌ల‌న ఉత్త‌ర్వులు జారీ చేశారు.

అసలు ఏం జ‌రిగింది?

చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ నాయ‌కుడు, జిల్లా పార్టీ వైస్ ప్రెసిడెంట్‌.. క‌ఠారి మోహ‌న్‌రావు.. కీల‌క నాయ‌కుడు. ఆయ‌న భార్య అనురాధ‌.. 2015లో చిత్తూరు న‌గ‌ర కార్పొరేష‌న్‌లో మేయ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. అయితే.. ఈ కుటుంబానికే చెందిన మోహ‌న్‌రావు మేన‌ల్లుడు.. శ్రీరామ్‌ చంద్రశేఖర్ అలియాస్ చింటూ, చిట్ట‌బ్బాయి, చిట్టితో వివాదాలు ఏర్ప‌డ్డాయి.

రాజ‌కీయంగా, ఆర్థికంగా కూడా మేన‌ల్లుడు, మేన‌మామ‌, మేన‌త్త‌ల మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో వివాదాలు జ‌రిగాయి. ఈ క్ర‌మంలో మేయ‌ర్‌గా ఉన్న‌ మేన‌త్త‌, పార్టీ నాయ‌కుడిగా ఉన్న మోహ‌న్‌రావుల‌ను చంపేస్తేనే త‌మ స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని భావించిన చింటూ.. త‌న స్నేహితుల‌తో క‌లిసి దారుణ హ‌త్య‌కు పాల్ప‌డ్డారు.

మేయ‌ర్ ఛాంబ‌ర్‌లోనే..

త‌న మేన‌త్త‌, మేయ‌ర్ అనురాధ దంప‌తుల‌ను హ‌త్య చేయాల‌ని ప్లాన్ చేసిన చింటూ.. దీనికి మేయ‌ర్ ఛాంబ‌ర్‌నే వేదిక చేసుకున్నారు. 2015, నవంబరు 17న చింటూ అత‌ని స్నేహితులు మరో నలుగురు బురఖాలతో వెళ్లి.. తుపాకులు, కత్తులతో అనురాధను హ‌త్య చేశారు. ఆమె అక్కడిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. అక్క‌డితో ఆగ‌ని చింటూ.. ప‌క్క గదిలోనే ఉన్న మేన‌మామ‌ మోహన్‌ను కూడా కత్తులతో నరికేశాడు. ఈ హ‌త్యాకాండ అప్ప‌ట్లో తీవ్ర సంచ‌ల‌నం సృష్టించింది.

ఉరి శిక్ష ప‌డింది వీరికే..

ఏ1: శ్రీరామ్‌ చంద్రశేఖర్‌ఏ2: గోవింద స్వామి శ్రీనివాసయ్యఏ3: జయప్రకాష్‌రెడ్డి అలియాస్‌ జయారెడ్డిఏ4: మంజునాథ్‌ అలియాస్‌ మంజుఏ5: మునిరత్నం వెంకటేష్‌

Related Post