hyderabadupdates.com movies బాహుబలి ది ఎపిక్… మెప్పించిందా లేదా

బాహుబలి ది ఎపిక్… మెప్పించిందా లేదా

టాలీవుడ్ హిస్టరీలో మొదటిసారి రెండు భాగాల సినిమాను ఒకే పార్ట్ గా విడుదల చేసిన రాజమౌళి పదేళ్ల తర్వాత కూడా జనాన్ని థియేటర్లకు పోటెత్తేలా చేయడం ఇండస్ట్రీ వర్గాలను నివ్వెరపరుస్తోంది. ముఖ్యంగా తెలుగు వర్షన్ రాబడుతున్న వసూళ్లు చూసి ట్రేడ్ కి మాటలు రావడం లేదు. హయ్యెస్ట్ రీ రీ రిలీజ్ రికార్డులన్నీ బాహుబలి ది ఎపిక్ మీదే ఉండబోతున్నాయి. ఎంత చూసిన సినిమా అయినప్పటికీ అయిదున్నర గంటల కంటెంట్ ని మూడు గంటల నలభై అయిదు నిమిషాలకు ఎలా కుదించి ఉంటారనే క్యూరియాసిటీ మూవీ లవర్స్ లో విపరీతంగా ఉంది. జక్కన్న ఈ విషయంలో విజయం సాధించారు.

బాహుబలి ఎపిక్ ఫస్ట్ హాఫ్ నిడివి కేవలం గంటా నలభై నిముషాలు మాత్రమే. వేగంగా పరుగులు పెడుతుంది. అవంతిక ప్రేమకథను కట్ చేసి కేవలం వాయిస్ ఓవర్ ద్వారా విజువల్స్ ని పరిగెత్తించిన ఐడియా బాగుంది. భళ్లాలదేవాని ఇరవై నిమిషాల లోపే పరిచయం చేసి మహేంద్ర బాహుబలి దేవసేన కోసం అంతఃపురంకు వెళ్ళేదాకా కథనం ఎక్కడా ఆగకుండా ఒక ఫ్లోలో వెళ్తుంది. కాలకేయులతో యుద్ధం ముగిశాక కట్టప్ప ఎందుకు అమరేంద్ర బాహుబలిని చంపాడనే ప్రశ్న దగ్గర ఇంటర్వెల్ కార్డు వేసి పూర్తి సంతృప్తి కలిగించారు. అవసరం లేని మూడు పాటలు, సన్నివేశాలు పూర్తిగా తీసేయడం ప్లస్ అయ్యింది.

సెకండాఫ్ మొత్తం కంక్లూజన్ పార్ట్ ఉంది. ఇది రెండు గంటల అయిదు నిమిషాల నిడివితో దాదాపు బాహుబలి 2ని ఎక్కువ కత్తిరింపులు లేకుండా చూసిన ఫీలింగ్ కలిగిస్తుంది. కాకపోతే చాలాసార్లు టీవీలో, ఆన్ లైన్ లో చూసినవాళ్లకు కొంత ల్యాగ్ అనిపించినా మొదటిసారి థియేటర్ ఎక్స్ పీరియన్స్ పొందుతున్న పిల్లలు, టీనేజర్స్ కు మంచి ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. కాకపోతే పదేళ్ల కాలంలో విఎఫెక్స్ విభాగంలో చాలా మార్పులు వచ్చిన నేపథ్యంలో కొన్ని షాట్స్, గ్రాఫిక్స్ ఇప్పటి స్టాండర్డ్ లో లేవనిపించడం ఒక్కటే కొంత మైనస్ పాయింట్ గా నిలుస్తుంది. ఇది మినహాయిస్తే ఎపిక్ నిరాశపరచదు.

నాలుగు గంటల సేపు థియేటర్లో గడపాల్సి రావడమనే అంశం తప్ప బాహుబలి ఎపిక్ గురించి చెప్పాల్సిన నెగటివ్స్ పెద్దగా లేవు. కొంచెం ఎక్కువ ఓపికని డిమాండ్ చేసే ఈ విజువల్ గ్రాండియర్ ని ఇలా కొత్త రూపంలో పరిచయం చేయడం వెనుక వ్యాపారపరమైన కారణాలే ఉండొచ్చు. కానీ కొందరి అత్యాశ వల్ల రీ రిలీజుల ట్రెండ్ క్రమంగా కిల్ అవుతున్న తరుణంలో ఇంత పెద్ద స్థాయిలో జనాన్ని థియేటర్లకు రప్పించేలా చేయడం చూస్తే బాహుబలి ఎంతగా ఆడియన్స్ లో చొచ్చుకుపోయిందో అర్థమవుతుంది. ఇతిహాసాలకు కాలదోషం ఉండనట్టే టాలీవుడ్ లో బాహుబలి లాంటి క్లాసిక్స్ కి ఎక్స్ పైరి డేట్లు ఉండవు.

Related Post

‘మాస్’ మెచ్చుకుంటే చాలు ‘రాజా’‘మాస్’ మెచ్చుకుంటే చాలు ‘రాజా’

ఇంకొద్ది గంటల్లో ప్రారంభం కాబోతున్న మాస్ జాతర ప్రీమియర్ల కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. బాహుబలి ఎపిక్ గొడవలో పడి జనాలు దీని మీద అంత సీరియస్ గా దృష్టి పెట్టకపోవడంతో, బజ్ పరంగా సోషల్ మీడియాలో పెద్దగా హడావిడి లేకపోవడం

Review: Sudheer Babu’s Jatadhara – Disappointing supernatural thrillerReview: Sudheer Babu’s Jatadhara – Disappointing supernatural thriller

Movie Name : Jatadhara Release Date : Nov 07, 2025 123telugu.com Rating : 2.25/5 Starring : Sudheer Babu, Sonakshi Sinha, Divya Khossla, Shilpa Shirodkar, Indira Krishna Director : Venkat Kalyan