hyderabadupdates.com movies ప్రశాంత్ నీల్ మాట.. రాజమౌళి కాంట్రాక్టరట

ప్రశాంత్ నీల్ మాట.. రాజమౌళి కాంట్రాక్టరట

16 ఏళ్ల కిందట ‘మగధీర’ సినిమాతో తెలుగు సినిమా తలెత్తుకుని చూసేలా చేశాడు రాజమౌళి. ఆ సినిమా గొప్పదనమేంటో అప్పటికి మిగతా ఇండస్ట్రీలు గుర్తించలేకపోయాయి. కానీ ‘ఈగ’తో రాజమౌళి మామూలోడు కాదనే విషయం దేశం మొత్తానికి బాగానే అర్థమైంది. ఇక ‘బాహుబలి’తో జక్కన్న రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. మొత్తంగా ఇండియన్ సినిమా ముఖచిత్రాన్నే ఆ చిత్రంతో మార్చేశాడు రాజమౌళి. 

మనం ఎంత భారీ కలనైనా కలొచ్చని.. హాలీవుడ్ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్‌తో అద్భుతాలు చేయొచ్చని.. ప్రపంచ సినిమాకు మన చిత్రాలు ఏమాత్రం తీసిపోని విధంగా తెరకెక్కించవచ్చని ఆయన రుజువు చేశాడు. ఆ దెబ్బతో భారతీయ సినిమాల కథలు, మేకింగ్, బడ్జెట్లు.. అన్నీ మారిపోయాయి. ఎందరో ఫిలిం మేకర్స్‌కు, నిర్మాణ సంస్థలకు స్ఫూర్తిగా నిలుస్తూ ధైర్యాన్నిచ్చింది ‘బాహుబలి’. కాబట్టే ఇప్పుడు ‘రామాయణం’ సహా ఎన్నో విజువల్ వండర్స్ రూపొందుతున్నాయి.

రాజమౌళి ద్వారా స్ఫూర్తి పొందిన దర్శకుల్లో కన్నడ ఫిలిం మేకర్ ప్రశాంత్ నీల్ కూడా ఒకడు. అతను ‘కేజీఎఫ్’ అనే భారీ కథ రాసుకుని, తన విజన్‌కు తగ్గట్లుగా భారీగా ఆ సినిమాను తీసి పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్‌బస్టర్ అందుకోవడం వెనుక జక్కన్న స్ఫూర్తి ఉందని ఇంతకుముందే చెప్పాడు ప్రశాంత్. ‘బాహుబలి: ది ఎపిక్’ రీ రిలీజ్ నేపథ్యంలో మరోసారి జక్కన్న మీద ప్రశాంత్ ప్రశంసలు కురిపించాడు. జక్కన్న ఇచ్చిన స్ఫూర్తిని అతను ఒక కథ రూపంలో చెప్పడం విశేషం. 

‘‘ఒక రోడ్డుకు మరమ్మతులు అవసరం అయ్యాయి. దీంతో అందరూ కలిసి ఒక కాంట్రాక్టర్‌ను పిలిచారు. ఆ కాంట్రాక్టర్ రోడ్డుకు మరమ్మతులు చేయడమే కాదు.. ఏకంగా దాన్ని 16 వరసల హైవేగా మార్చేశాడు. ఆ రోడ్డు ఏదో కాదు.. పాన్ ఇండియా, ఆ కాంట్రాక్టర్ ఎవరో కాదు రాజమౌళి’’ అంటూ జక్కన్నకు ఎలివేషన్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. రీ రిలీజ్ నేపథ్యంలో బాహుబలి టీంకు శుభాకాంక్షలు చెబుతూ ఈ మెసేజ్ పోస్ట్ చేశాడు ప్రశాంత్.

Related Post

జనసేన నుంచి తప్పుకొన్న బొలిశెట్టి… రాజీనామా కాదుజనసేన నుంచి తప్పుకొన్న బొలిశెట్టి… రాజీనామా కాదు

జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ, జల బిరాదరి సంఘం జాతీయ కన్వీనర్ బొలిశెట్టి సత్యనారాయణ పార్టీ బాధ్యతల నుంచి తాత్కాలికంగా తప్పుకుంటున్నట్లు మంగళవారం ప్రకటించారు. ఈ మేరకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు లేఖ రాసి తన నిర్ణయాన్ని తెలియజేశారు.

Nagabandham’s Om Veera Naga is a tribute to Lord Shiva, crafted brilliantlyNagabandham’s Om Veera Naga is a tribute to Lord Shiva, crafted brilliantly

Young actor Virat Karrna is all set to leave a solid impact with this highly anticipated PAN-India film, Nagabandham. The film is directed by the visionary Abhishek Nama and produced

‘నువ్వు బ‌జారోడివి కాదు’… అనిల్ మీమ్ పంచ్‘నువ్వు బ‌జారోడివి కాదు’… అనిల్ మీమ్ పంచ్

సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయ‌డంలో తెలుగు వాళ్ల‌ను మించిన వాళ్లు ఇంకెవ్వ‌రూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. కొన్ని మీమ్స్ హ‌ద్దులు దాటిపోతుంటాయి కానీ.. చాలా వ‌ర‌కు తెలుగు కుర్రాళ్ల మీమ్స్‌ సినీ జ‌నాలు సైతం ఎంజాయ్ చేసేలా స‌ర‌దాగా ఉంటాయి.