CM Chandrababu : రాజధాని నిర్మాణ పనులు జాప్యం లేకుండా జరగాలని, నిర్దేశించుకున్న లక్ష్యానికి నిర్మాణాలు పూర్తి కావాలని సీఎం చంద్రబాబు(CM Chandrababu) అన్నారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఆర్డీఏపై సీఎం సమీక్ష నిర్వహించారు. నిర్దిష్ట సమయంలోగా భవనాల పనులు పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. నిర్మాణ పనుల్లో వేగంతోపాటు నాణ్యతా ప్రమాణాలు పక్కాగా పాటించాలన్నారు. పనుల పురోగతిపై 15 రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తానన్నారు. రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై రైతులకు ఇబ్బందులు రాకూడదని తెలిపారు.
ఇంకా 2,471 మంది రైతులకు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. సాంకేతిక, రైతుల వ్యక్తిగత అంశాల వల్ల రిజిస్ట్రేషన్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. త్వరలోనే రాజధాని రైతులతో సమావేశమవుతానని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు (CM Chandrababu) తెలిపారు. రాజధానిలో పచ్చదనం, సుందరీకరణ, పరిశుభ్రతకూ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. రాజధానిలో గార్డెనింగ్, బ్యూటిఫికేషన్‌లో రాజీ పడొద్దన్నారు. ప్రైవేట్ సంస్థల నిర్మాణాలు కూడా ఐకానిక్ మోడల్‌లో ఉండేలా చూడాలని సూచించారు. అమరావతికి వరల్డ్‌క్లాస్ సిటీ లుక్ రావాలంటే హైరైజ్ బిల్డింగులు ఉండాలని, ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
CM Chandrababu – మొంథా తుఫానుతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలి – పవన్ కల్యాణ్
మొంథా తుఫాను (Cyclone Montha)తో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలని అధికారులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. కాకినాడ జిల్లా కలెక్టర్, వివిధ శాఖల అధికారులతో ఏపీ సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పవన్ కల్యాణ్ శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తుఫాను అనంతర ఉపశమన చర్యలపై అధికారులకి కీలక ఆదేశాలు జారీ చేశారు డిప్యూటీ సీఎం. కాకినాడ జిల్లా పరిధిలో పంట నష్టం, ఆస్తి నష్టం అంచనాలని పకడ్బందీగా రూపొందించాలని మార్గనిర్దేశం చేశారు. అలాగే, పిఠాపురం నియోజకవర్గంలో వరద ప్రభావిత పరిస్థితిపై ఆరా తీశారు పవన్ కల్యాణ్. కాకినాడ జిల్లా తీర ప్రాంత గ్రామాల రక్షణపై బృహత్ ప్రణాళిక రచించాలని సూచించారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకీ న్యాయం జరగాలని ఆదేశించారు. ఏలేరు కాలువ గట్టు పటిష్టతకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆజ్ఞాపించారు. మల్లవరం పత్తి రైతులకు న్యాయం చేయాలని పవన్ కల్యాణ్ సూచించారు.
CM Chandrababu – ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవల పునరుద్ధరణ
ప్రైవేటు ఆస్పత్రుల అసోసియేషన్‌తో ఏపీ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఆందోళన విరమించిన యాజమాన్యాలు.. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్యసేవల పునరుద్ధరణకు అంగీకారం తెలిపాయి. వెంటనే మరో రూ.250 కోట్ల బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం అంగీకరించింది. ప్రైవేటు ఆస్పత్రుల అసోసియేషన్ ప్రతినిధులతో ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శుక్రవారం సమావేశమయ్యారు. నవంబర్ చివరికల్లా పెండింగ్ బకాయిలు మొత్తం ఒకే విడతలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. బకాయిల చెల్లింపుపై మంత్రి స్పష్టమైన హామీ ఇవ్వడంతో వైద్యసేవల పునరుద్ధరణకు యాజమాన్యాలు అంగీకరించాయి. బకాయిలు చెల్లించాలన్న డిమాండ్‌తో గత 20 రోజులుగా ప్రైవేట్ నెట్‌వర్క్ ఆసుపత్రులు సమ్మె చేస్తున్నాయి. ప్రభుత్వం ప్రాథమికంగా రూ.250 కోట్ల బకాయిలు విడుదల చేసింది. దశల వారీగా మిగిలిన బకాయిలూ చెల్లిస్తామని ప్రకటించింది. అయినా సమ్మె కొనసాగించడంతో మొత్తం బకాయిలు వన్ టైం సెటిల్‌మెంట్ కింద నవంబర్ చివరికల్లా చెల్లించాలని నిర్ణయించింది.
Also Read : TTD: టీటీడీ పరకామణి చోరీ కేసులో మరో కీలక పరిణామం
The post CM Chandrababu: నిర్దిష్ట సమయంలో రాజధాని నిర్మాణాలు పూర్తి చేయాల్సిందే – సీఎం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
CM Chandrababu: నిర్దిష్ట సమయంలో రాజధాని నిర్మాణాలు పూర్తి చేయాల్సిందే – సీఎం
Categories: