hyderabadupdates.com movies ‘బాహుబలి: ది ఎపిక్’ను వాళ్లు ఓన్ చేసుకోలేదా?

‘బాహుబలి: ది ఎపిక్’ను వాళ్లు ఓన్ చేసుకోలేదా?

‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కంక్లూజన్’ చిత్రాలను థియేటర్లలో, టీవీల్లో ఓటీటీల్లో ఎన్నోసార్లు చూసినా సరే.. ఈ రెండు చిత్రాలనూ కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో రిలీజ్ చేస్తే మళ్లీ ఎగబడి చూస్తున్నారు మన ప్రేక్షకులు. అమెరికా నుంచి అనకాపల్లి వరకు తెలుగు ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు అద్భుత స్పందన వస్తోంది.

కొత్త సినిమా రిలీజైనంత సంబరం కనిపిస్తోంది థియేటర్లలో. చూసిన వాళ్లంతా ఈ అనుభూతి గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. మంచి థియేటర్‌కు వెళ్లి తప్పకుండా ఈ సినిమా చూడాలని అభిప్రాయపడుతున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ నుంచే ‘బాహుబలి’ మరోసారి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపబోతోందనే సంకేతాలు కనిపించాయి. శుక్రవారం ఫస్ట్ షో నుంచి ప్రేక్షకులను పలకరించిన రవితేజ కొత్త చిత్రం ‘మాస్ జాతర’ను మించి దీనికి స్పందన కనిపించింది.

ఐతే ‘బాహుబలి: ది ఎపిక్’ను తెలుగు వాళ్లు ఆదరిస్తున్నట్లు మిగతా భాషల ప్రేక్షకులు ఆదరిస్తారా అనే సందేహాలు కలుగుతున్నాయి. ‘ది ఎపిక్’ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే భారీగా రిలీజైంది. ఇతర భాషల్లో రిలీజ్, రెస్పాన్స్ ఓ మోస్తరుగా అనిపిస్తున్నాయంతే. హిందీలో శుక్రవారం సినిమాకు ఆక్యుపెన్సీలు ఆశించిన స్థాయిలో లేవు. ఇండియాలో ఈ చిత్రం తొలి రోజు రూ.10 కోట్ల దాకా నెట్ కలెక్ట్ చేస్తే.. అందులో రూ.8 కోట్ల మేర తెలుగు రాష్ట్రాల నుంచే వచ్చింది. హిందీ వసూళ్లు కోటిన్నర లోపే ఉన్నాయి. యుఎస్‌లో సైతం తెలుగు వెర్షన్‌కు అద్భుత స్పందన రాగా.. హిందీ వెర్షన్‌కు రెస్పాన్స్ తక్కువగానే ఉంది. తమిళంలో అయితే ఈ సినిమా నామమాత్రంగా రిలీజైంది.

‘బాహుబలి’ని అప్పట్లో తమిళులు బాగా ఆదరించారు కానీ.. ఇప్పుడు రీ రిలీజ్ విషయంలో వాళ్లు పెద్దగా ఆసక్తి లేనట్లే కనిపిస్తోంది. తమిళం మీద మేకర్స్‌కు కూడా పెద్దగా ఆశలు లేనట్లే కనిపిస్తోంది. కానీ హిందీలో బాగా ఆడుతుందని భావిస్తున్నారు. ఐతే హిందీ ఆడియన్స్ సౌత్ సినిమాల విషయంలో ఆరంభంలో నెమ్మదిగానే స్పందిస్తారు. కనెక్ట్ అయితే లాంగ్ రన్ ఉంటుంది. ‘బాహుబలి: ది బిగినింగ్’ రిలీజైనపుడు కూడా అలాగే జరిగింది. ‘ది ఎపిక్’ విషయంలోనూ వాళ్లు నెమ్మదిగా థియేటర్లకు కదులుతారని.. వాళ్లు కనెక్ట్ అయితే సినిమాకు లాంగ్ రన్ ఉంటుందని ట్రేడ్ పండిట్లు అంచనా వస్తున్నారు.

Related Post

హమ్మయ్య… కోనసీమ మంటలు చల్లారాయిహమ్మయ్య… కోనసీమ మంటలు చల్లారాయి

కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామ పరిధిలోని ఓఎన్జీసీ మోరి-5 డ్రిల్లింగ్ సైట్‌లో గత కొన్ని రోజులుగా ప్రజలను భయాందోళనకు గురిచేసిన బ్లోఅవుట్ ఘటన ఎట్టకేలకు అదుపులోకి వచ్చింది. బావి నుంచి గ్యాస్ లీక్ కావడంతో చెలరేగిన మంటలను ఓఎన్జీసీ విపత్తు నిర్వహణ

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ అతని చివరి మ్యాచ్ అయ్యేలా ఉంది. అద్భుతమైన ఫామ్ లో ఉన్నా టీమ్ మేనేజ్‌మెంట్

ఉత్తరాంధ్రకు న్యూ ఇయర్ గిఫ్ట్ఉత్తరాంధ్రకు న్యూ ఇయర్ గిఫ్ట్

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఉత్తరాంధ్రకు నూతన గేమ్‌చేంజర్ కానుంది. విజయనగరం భోగాపురంలో నిర్మాణమైన అంతర్జాతీయ విమానాశ్రయం చారిత్రక ఘట్టానికి సిద్ధమవుతోంది. 2026 జనవరి 4న ఢిల్లీ నుంచి వచ్చే ఎయిర్ ఇండియా విమానం తొలి ల్యాండింగ్ కోసం వస్తోంది. కేంద్ర పౌర విమానయానశాఖ