hyderabadupdates.com movies దృశ్యం 3 – సినిమాని మించిన ట్విస్టులు

దృశ్యం 3 – సినిమాని మించిన ట్విస్టులు

కొన్ని వారాల క్రితమే మోహన్ లాల్ హీరోగా మలయాళం దృశ్యం 3 షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. దర్శకుడు జీతూ జోసెఫ్ వేగంగా పూర్తి చేసేలా పక్కా ప్రణాళికతో ఉన్నారు. నిజానికి అన్ని భాషల్లో సమాంతరంగా షూట్ చేసి ఒకేసారి రిలీజ్ చేయాలనే మూవీ లవర్స్ డిమాండ్ తీరేలా లేదు. ఎందుకంటే వెంకటేష్ ఇక్కడ చాలా బిజీగా ఉన్నారు. మన శంకరవరప్రసాద్ గారు తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా మొదలుపెట్టాల్సి ఉంది. ఇదంతా అయ్యేలోపు 2026 వేసవి గడిచిపోతుంది. ఆలోగా ఒరిజినల్ దృశ్యం 3 ఏకంగా రిలీజ్ కు రెడీ అయిపోతుంది. అదే సమస్య.

బాలీవుడ్ సైడ్ చూసుకుంటే అజయ్ దేవగన్ డేట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా నిర్మాతల మధ్య రీమేక్ హక్కులకు సంబంధించి ఇంకా చర్చలు ఒక కొలిక్కి రాలేదట. నిజానికి జీతూ జోసెఫ్ స్క్రిప్ట్ సిద్ధం చేయడానికి ముందే హిందీ దృశ్యం 3 కోసం వేరే కథ రాసుకున్నారు అక్కడి టీమ్ సభ్యులు. ఒకవేళ అలా చేస్తే కనక లీగల్ గా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని జీతూ జోసెఫ్ చెప్పడంతో ఆ ఆలోచన వాయిదా వేసుకుని ఎదురు చూస్తున్నారు. ఈలోగా అజయ్ దేవగన్ వేరే కమిట్ మెంట్లతో బిజీ అయిపోయాడు. వెంకటేష్ తరహాలోనే ఇప్పుడప్పుడే తను కూడా ఫ్రీ అయ్యేలా లేడు.

ఈ ప్రాబ్లమ్ తమిళం కన్నడలో లేదు. ఎందుకంటే కమల్ హాసన్, రవిచంద్రన్ లు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. తెలుగు హిందీలోనే మేకర్స్ నుంచి చేయాలనే డిమాండ్ ఉంది. జీతూ జోసెఫ్ చెబుతున్న ప్రకారం ఒకవేళ రీమేక్ వెర్షన్లకు ఎక్కువ సమయం పట్టేలా ఉంటే మలయాళం వెర్షన్ రిలీజ్ చేస్తామని, దాని వల్ల స్పాయిలర్స్, స్టోరీ లీక్స్ జరిగినా ఎవరేం చేయలేమనే రీతిలో సంకేతాలు ఇస్తున్నారు. అదే జరిగితే కనక దృశ్యం 3లో రాంబాబు ఏం చేస్తాడో అనే సస్పెన్స్ ని మన ప్రేక్షకులు ఎంజాయ్ చేయలేకపోవచ్చు. సినిమా కన్నా బయటే ఎక్కువ ట్విస్టులు జరుగుతున్న దృశ్యం 3 ఫైనల్ గా ఏ మజిలీ చేరుకుంటుందో.

Related Post

పండగ పోటీలో ‘డెకాయిట్’ ధీమాపండగ పోటీలో ‘డెకాయిట్’ ధీమా

ఈ ఏడాది చివర్లో క్రిస్మస్ కు విడుదల కావాల్సిన అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఫ్యాన్స్ కొత్త డేట్ కోసం ఎదురు చూస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఆ లాంఛనం అయిపోయింది. 2026 మార్చ్ 19