Murder : ఈ మధ్య కాలంలో క్షణికావేశంలో చోటుచేసుకుంటున్న దారుణాలకు లెక్క లేకుండా పోయింది. చిన్న చిన్న విషయాలే ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఓ మనిషి మరో మనిషిని చంపేస్తున్నాడు (Murder). తాజాగా, ఓ యువకుడు తన సహోద్యోగిని డంబెల్‌తో ఆఫీస్‌లోనే కొట్టి చంపాడు (Murder). లైట్లు ఆఫ్ చేసే విషయంలో గొడవ కారణంగా ఇంత దారుణానికి తెగబడ్డాడు. ఈ సంఘటన కర్ణాటకలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
Murder for Night Shift Duty
ఆంధ్రప్రదేశ్ (AP) లోని విజయవాడకు చెందిన 24 ఏళ్ల సోమల వంశీ.. కర్ణాటకలోని చిత్ర దుర్గకు చెందిన 41 ఏళ్ల భీమేష్ బాబు బెంగళూరులోని దాత డిజిటల్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారు. సినిమా షూటింగ్‌లకు సంబంధించిన వీడియోలను ఈ దాత డిజిటల్ బ్యాంకులో ప్రతీ రోజూ స్టోర్ చేస్తూ ఉంటారు. వంశీ, భీమేష్ శుక్రవారం నైట్ షిఫ్ట్‌కు వచ్చారు. శనివారం తెల్లవారుజామున ఆఫీస్‌లోని లైట్లు ఆఫ్ చేసే విషయంలో ఇద్దరికీ గొడవ అయింది.
ఆ గొడవ చినికి చినికి గాలి వానలా మారింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవటం మొదలెట్టారు. ఈ నేపథ్యంలోనే వంశీ డంబెల్‌తో భీమేష్‌పై దాడి చేశాడు. తలపై విచక్షణా రహితంగా కొట్టి చంపేశాడు. హత్య చేసిన తర్వాత అతడు నేరుగా గోవిందరాజ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు వంశీని అరెస్ట్ చేశారు. అతడిపై మర్డర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మరింత లోతుగా విచారణ చేస్తున్నారు.
తమిళనాడులో గ్రాడ్యుయేట్ యువతి సజీవదహనం ?
పెరంబలూర్ జిల్లాలోని కున్నం ప్రాంతానికి చెందిన ఆంథోనీ సామి. ఇతని భార్య కళావతి. ఈ దంపతులకు మీరా జాస్మిన్ (22) అనే కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. పిల్లల చదువు కోసం తిరుచ్చిలోని శ్రీనివాస నగర్ లోని వాయలూర్ రోడ్‌లోని ఓ అద్దె ఇంట్లో ఆంథోనీ సామి నివసించారు. ప్రస్తుతం, ఆంథోనిసామి విదేశాల్లో పనిచేస్తున్నారు. మీరా జాస్మిన్ తిరుచ్చిలోని ఓ ప్రసిద్ధ కళాశాల నుంచి ఎంఎస్సీ పూర్తి చేశారు. ఆమె విశ్వవిద్యాలయ పోటీల్లో బంగారు పతకాన్ని కూడా గెలుచుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో శుక్రవారం ఉద్యోగం కోసం మీరా జాస్మిన్ ఇంటి నుంచి బయటకు వెళ్లి తర్వాత తిరిగిరాలేదు.
దీంతో తల్లి కళావతి ఆమెను సెల్ ఫోన్‌లో సంప్రదించింది. ఫోన్ పూర్తిగా మోగింది, తర్వాత కట్ అయింది. తర్వాత ఎవరూ ఫోన్ ఎత్తలేదు. దీంతో కళావతి తిరుచ్చి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా తిరుచ్చి మనచనల్లూరు సమీపంలోని సిరుకనూరు సానమంగళం రక్షిత అటవీ ప్రాంతంలో ఓ యువతి మృతదేహం పాక్షికంగా కాలిపోయి కనిపించింది. తరువాత, ఆ మృతదేహం మీరా జాస్మిన్‌ది అని దర్యాప్తులో తేలింది. మృతదేహం దగ్గర ఆమె హ్యాండ్‌బ్యాగ్, సెల్ ఫోన్, బూట్లు, బీరు బాటిళ్లు కనిపించాయి. మృతదేహం అర్ధనగ్నంగా కనిపించింది.
ఆమెపై సామూహిక అత్యాచారం చేసిన తర్వాత, గొంతు నులిమి చంపి, ఆపై కిరోసిన్ పోసి నిప్పంటించారని తెలుస్తోంది. గతంలో తనలో కలిసి చదివిన స్నేహితుడితో మీరా జాస్మిన్‌కు ప్రేమ సంబంధం ఉందని, వారిమధ్య మనస్పర్థల కారణంగా విడిపోయినట్లు తెలిసింది. దీంతో తీవ్ర నిరాశ చెందిన స్నేహితుడి సోదరుడు 6 నెలల క్రితం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి ప్రతీకారంగా ప్రియుడి బంధువులు ఆమెని కిడ్నాప్ చేసి హత్య చేశారా.? అనే దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : ISRO: సీఎమ్‌ఎస్-3 ప్రయోగానికి ఇస్రో సిద్ధం
The post Murder: హత్యకు దారి తీసిని నైట్ షిఫ్ట్ ఉద్యోగుల గొడవ. appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Murder: హత్యకు దారి తీసిని నైట్ షిఫ్ట్ ఉద్యోగుల గొడవ.
Categories: