hyderabadupdates.com Gallery Inter Colleges: ఈ నెల 15 వరకు ఇంటర్ కాలేజీల్లో తనిఖీలు

Inter Colleges: ఈ నెల 15 వరకు ఇంటర్ కాలేజీల్లో తనిఖీలు

Inter Colleges: ఈ నెల 15 వరకు ఇంటర్ కాలేజీల్లో తనిఖీలు post thumbnail image

Inter Colleges : తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల పనితీరు మెరుగుపరచడంలో భాగంగా కాలేజీల్లో బోర్డు తనిఖీలు చేపట్టింది. ఈ నెల 15 వరకు తనిఖీలు నిర్వహిస్తామని వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,752 ప్రైవేట్, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో (Inter Colleges) విద్యా ప్రమాణాలు, పరిపాలనా పరమైన నిబంధనలు అమలుపరిచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ తనిఖీల్లో స్పెషల్ ఆఫీసర్లు, డిప్యూటీ సెక్రటరీలు, జిల్లా ఇంటర్మీడియట్ అధికారులు (డీఐఈఓ) తమ పరిధిలోని కాలేజీలను తనిఖీ చేయనున్నారు. తనిఖీలు పూర్తయిను వెంటనే సమగ్ర తనిఖీ నివేదికను ఇంటర్ బోర్డు కార్యాలయానికి సమర్పించాల్సి ఉంటుంది.
ప్రధానంగా పలు కీలక అంశాలను తనిఖీ చేయనున్నారు. ప్రైవేటు కాలేజీల్లో అఫ్లియేషన్ ఉన్నదా? లేదా?, విద్యార్థుల డేటా ఎంట్రీ సరిగ్గా రికార్డ్ చేస్తున్నారా? లేదా? అనే దానిని చెక్ చేయనున్నారు. ప్రభుత్వ కాలేజీలు కోచింగ్ క్లాసులు నడపడం, కాలేజీలు యూనిఫాం టైం టేబుల్ ఫాలో అవుతున్నాయా లేదా, సిలబస్ పూర్తయిందా, విద్యార్థుల హాజరు ఎంత శాతం ఉందనేది చెక్ చేస్తారు. ఇంటర్ ఎగ్జామ్స్ కు రెండు నెలలకుపై సమయం ఉన్నందున దీని ప్రకారం యాక్షన్ ప్లాన్ రూపొందించి సిలబస్ పూర్తి చేస్తున్నారా? లేదా? అనే అంశాలను పరిశీలించనున్నారు.
Inter Colleges – నేటి నుంచి విద్యాసంస్థలు బంద్‌
తెలంగాణలో (Telangana) నేటి నుంచి ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థలు నిరవధిక బంద్‌ను పాటించనున్నాయి. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్, బీఈడీ తదితర వృత్తి విద్యా కళాశాలలు, డిగ్రీ కళాశాలలు బంద్‌కు ప్రైవేట్‌ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య పిలుపునిచ్చింది. దీంతో, కాలేజీలు మూతపడనున్నాయి.
రాష్ట్రంలో పదివేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలు బంద్‌కు పిలుపునిచ్చాయి. అయితే, దీపావళి నాటికి ప్రభుత్వం 600 కోట్లు ఇస్తామని భరోసా ఇచ్చినప్పటికీ ప్రభుత్వ హామీ నిలబెట్టుకోలేకపోవడంతో ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలు ఆందోళన బాట పట్టాయి. కాలేజీలు నడపలేకపోతున్నామని ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, ప్రభుత్వం చర్చలకు పిలిస్తే వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించింది. ఇదే సమయంలో తక్షణమే బకాయిల్లో 50 శాతం చెల్లించాలని డిమాండ్‌ చేసింది. అయితే, బంద్‌ ప్రకటన నేపథ్యంలో ప్రభుత్వం 1200 కోట్లకు టోకెన్లు ఇచ్చి కేవలం 300 కోట్లు అందించినట్టు సమాచారం.
Also Read : KTR: పేదల ఇళ్లపైకే హైడ్రా బుల్డోజర్లు – కేటీఆర్‌
The post Inter Colleges: ఈ నెల 15 వరకు ఇంటర్ కాలేజీల్లో తనిఖీలు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

CM Revanth Reddy: అంతర్జాతీయ ఎడ్యుకేషన్‌ హబ్‌గా కొడంగల్‌ – సీఎం రేవంత్‌రెడ్డిCM Revanth Reddy: అంతర్జాతీయ ఎడ్యుకేషన్‌ హబ్‌గా కొడంగల్‌ – సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy : కొడంగల్‌లో ఏ విద్యార్థీ ఆకలితో ఉండకూడదన్న లక్ష్యంతో ఏర్పాట్లు చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో 28 వేల మందికి ఉదయం అల్పాహారం అందిస్తున్నామన్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో 5 వేల మంది విద్యార్థులు

J.P Nadda: వికాసానికి, వినాశనానికి మధ్య పోరు బిహార్ ఎన్నికలు – నడ్డాJ.P Nadda: వికాసానికి, వినాశనానికి మధ్య పోరు బిహార్ ఎన్నికలు – నడ్డా

J.P Nadda : బిహార్‌ ఎన్నికలు ఎన్డీయే వికాసానికి, ఇండియా కూటమి వినాశనానికి మధ్య జరుగుతున్న పోరని బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా (J.P Nadda) అన్నారు. భాగస్వామ్య పక్షాలను అంతం చేసే పరాన్నజీవి పార్టీ అంటూ కాంగ్రెస్‌

Rivaba Jadeja: గుజరాత్‌ మంత్రిగా టీమిండియా క్రికెటర్ జడేజా సతీమణిRivaba Jadeja: గుజరాత్‌ మంత్రిగా టీమిండియా క్రికెటర్ జడేజా సతీమణి

Rivaba Jadeja : గుజరాత్‌ లో ముఖ్యమంత్రి మినహా మిగతా మంత్రులంతా రాజీనామా చేయడంతో శుక్రవారం నూతన క్యాబినెట్‌ ఏర్పాటు అయింది. గుజరాత్‌లోని గాంధీ నగర్‌ లో నేడు 26 మంది సభ్యుల కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసింది. వారిలో