hyderabadupdates.com Gallery Sudan Rebels: సూడాన్‌ లో బందీలైన భారతీయుల కోసం ముమ్మర యత్నాలు

Sudan Rebels: సూడాన్‌ లో బందీలైన భారతీయుల కోసం ముమ్మర యత్నాలు

Sudan Rebels: సూడాన్‌ లో బందీలైన భారతీయుల కోసం ముమ్మర యత్నాలు post thumbnail image

 
సూడాన్‌ సైన్యం, సూడాన్‌ పారామిలటరీ విభాగాల మధ్య నెలల తరబడి జరుగుతున్న అంతర్యుద్దంతో రావణకాష్టంగా కాలిపోతున్న సూడాన్‌లో చిక్కుకుపోయిన, బందీలుగా మారిన భారతీయులను విడిపించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆ దేశ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు భారత్‌ లో సూడాన్‌ రాయబారి మొహమ్మెద్‌ అబ్దల్లా అలీ ఎల్తోమ్‌ సోమవారం ఢిల్లీలో మాట్లాడారు.
‘‘పారామిలటరీ అయినా ర్యాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌(ఆర్‌ఎస్‌ఎఫ్‌) వద్ద బందీగా ఉన్న భారతీయుడిని విడిపించి సురక్షితంగా తీసుకొచ్చేందుకు భారత విదేశాంగశాఖతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. గతంలోనూ మా దేశంలోని ఇతర నగరాల్లో భారతీయులు చిక్కుకుపోతే వారిని కాపాడేందుకు భారత విదేశాంగశాఖతో కలిసి పనిచేశాం’’అని ఆయన చెప్పారు. అల్‌ ఫషీర్‌ పట్టణంలో ఉంటున్న 36 ఏళ్ల భారతీయుడు ఆదర్శ్‌ బెహెరాను ఆర్‌ఎస్‌ఎఫ్‌ బలగాలు కిడ్నాప్‌ చేసి తమకు పట్టున్న న్యాలా నగరానికి తరలించాయి.
ఆదర్శ్‌ స్వస్థలం ఒడిశాలోని జగత్‌సింగ్పూర్‌ జిల్లా. ‘‘ప్రస్తుతం సూడాన్‌లో ఏం జరుగుతుందో ఊహించం అసాధ్యం. అతడిని బలగాలు బాగానే చూసుకుంటాయని ఆశిస్తున్నాం. త్వరలోనే ఆయనను విడుదలచేయగలమని భావిస్తున్నా. సంక్షోభకాలంలోనూ భారత్‌ మాకు మానవతాసాయం అందించింది. గతంలో వైద్య, ఆహార సామగ్రి అందించి మమ్మల్ని ఆదుకుంది. ఇరుదేశాల మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. సూడాన్‌ త్వరలో పునరుద్దరణ దశకు చేరుకుంటుంది. అప్పుడు పునరుజ్జీవన క్రతువులో భారత్‌ కీలకపాత్ర పోషిస్తుంది’’అని ఆయన అన్నారు.
అంతర్యుద్ధానికి గల కారణమేమిటంటే ?
 
2021 అక్టోబర్‌లో సైనిక తిరుగుబాటుతో ప్రజాస్వామ్యం కుప్పకూలింది. ఆ తర్వాత పారామిలిటరీ గ్రూపు ఆర్‌ర్‌ఎస్‌ఎఫ్‌తో సైన్యానికి విభేదాలు పెరిగాయి. రాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌ దళాన్ని సైన్యంలో విలీనం చేసేందుకు ప్రతిపాదన రూపొందించారు. ఇందుకు ఆర్‌ఎస్‌ఎఫ్‌ ససేమిరా అంది. దీనితో ఆర్మీ, పారామిలిటరీ బలగాల మధ్య ఘర్షణ పెరిగింది. దీనితో ఇరు వర్గాలు మెషీన్‌ గన్‌లు అమర్చిన ట్రక్కులు, సైనికులతో పరస్పర కాల్పులు, దాడులకు తెగబడ్డాయి. దంతో ఆనాటి నుంచి ఇప్పటిదాకా వేలాది మంది చనిపోయారు. కోటి మంది సూడాన్‌ను వెళ్లిపోయినట్లు ఓ అంచనా.
The post Sudan Rebels: సూడాన్‌ లో బందీలైన భారతీయుల కోసం ముమ్మర యత్నాలు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Mid Day Meal: న్యూస్‌ పేపర్‌లో పిల్లలకు మధ్యాహ్న భోజనం !Mid Day Meal: న్యూస్‌ పేపర్‌లో పిల్లలకు మధ్యాహ్న భోజనం !

  మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు న్యూస్‌ పేపర్‌ ముక్కల్లో మధ్యాహ్న భోజనం తింటున్న ఓ వీడియోను కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఎక్స్‌లో షేర్‌ చేశారు. షియోపూర్‌ జిల్లా హల్పూర్‌ గ్రామంలోని ఓ మాధ్యమిక పాఠశాలలో ఈ ఘటన

TTD: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక మలుపుTTD: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక మలుపు

  తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కేసు కీలక మలుపు తిరిగింది. కల్తీ నెయ్యి సరఫరా వెనుక భారీ కుట్ర ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. వైవీ సుబ్బారెడ్డి సన్నిహితుడు చిన్నఅప్పన్న అరెస్టుతో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు

CM Siddaramaiah: ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి దంపతులపై సీఎం ఆగ్రహంCM Siddaramaiah: ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి దంపతులపై సీఎం ఆగ్రహం

CM Siddaramaiah : కర్ణాటకలో జరుగుతున్న సోషల్ అండ్ ఎడ్యుకేషన్ సర్వే కు దూరంగా ఉండాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి, రచయిత్రి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధామూర్తి నిర్ణయం తీసుకోవడంపై ముఖ్యమంత్రి సిద్ధారామయ్య (CM Siddaramaiah) ఘాటుగా స్పందించారు.