hyderabadupdates.com Gallery MK Stalin: ఎస్‌ఐఆర్‌పై సుప్రీంకోర్టుకు స్టాలిన్ పార్టీ

MK Stalin: ఎస్‌ఐఆర్‌పై సుప్రీంకోర్టుకు స్టాలిన్ పార్టీ

MK Stalin: ఎస్‌ఐఆర్‌పై సుప్రీంకోర్టుకు స్టాలిన్ పార్టీ post thumbnail image

 
 
తమిళనాడులో ఓటరు జాబితా స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) చేపట్టాలంటూ ఎన్నికల కమిషన్‌(ఈసీ) తీసుకు న్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ అధికార డీఎంకే సోమవారం సుప్రీంకోర్టును ఆశ్ర యించింది. ఈసీ నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకం, ఏకపక్షం, ప్రజాస్వామ్య హక్కు లకు భంగకరమని పేర్కొంది. డీఎంకే నేత ఆర్‌ఎస్‌ భారతి ఈ పిటిషన్‌ వేశారు. తమిళ నాడులో ఎస్‌ఐఆర్‌ చేపట్టేందుకు అక్టోబర్‌ 27న ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్‌ను రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, 19, 21లను ఉల్లంఘించడమేనన్నారు. ఎస్‌ఐఆర్‌తో అసలైన ఓటర్ల పేర్లను సైతం సరైన పత్రాలు లేవనే సాకుతో తొలగించే ప్రమాదముందన్నారు. పిటిషన్‌పై ఈ వారంలోనే అత్యు న్నత న్యాయస్థానం విచారణ చేపట్టే అవకా శముంది.
 
స్టాలిన్‌ పాలనలో మహిళలకు భద్రత కరవు
కోయంబత్తూరులో కళాశాల విద్యార్థినిని కిడ్నాప్‌ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనను పలువురు ఖండించారు. కోవై పీళమేడు బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్‌ మాట్లాడుతూ మహిళలకు సురక్షితమైన నగరంగా పరిగణించే కోయంబత్తూరులో ఇలాంటి ఘటన జరగడం దారుణమన్నారు. మహిళలకు భద్రతలో ద్రావిడ మోడల్‌ ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై హింస పెరుగుతోందని ఆరోపించారు. ఈ ఘటనకు గంజాయి ప్రధాన కారణమని, కోవైలో మత్తుపదార్థాల విక్రయాలను పోలీసులు నియంత్రించలేక పోతున్నారని ఆరోపించారు. నిందితులకు కఠినశిక్ష విధించాలని డిమాండ్‌ చేశారు. బాధిత విద్యార్థిని త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నానన్నారు.
 
ప్రభుత్వం భద్రత కల్పించకపోతే, మహిళలు స్వయంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ తరఫున నిరసన చేపట్టనున్నామని కోవై ఎమ్మెల్యే వానతి శీనివాసన్ తెలిపారు. స్టాలిన్‌ ప్రభుత్వం మహిళల భద్రతను గాలికొదిలేసింది. అన్నాడీఎంకే ప్రభుత్వంలో మహిళలకు వంద శాతం భద్రత నిర్ధారించాం. అత్యాచారానికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని డిమాండ్‌ చేస్తున్నామని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి అన్నారు. డీఎంకే పాలనలో మహిళలు, పిల్లలపై లైంగిక వేధింపులు అధికమవుతున్నాయి. గంజాయి తదితర మాదక ద్రవ్యాల చలామణి పెరగడమే ఇలాంటి ఘటనలకు కారణం. విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన మానవ మృగాలను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పీఎంకే నేత అన్బుమణి డిమాండ్ చేసారు. డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత నేరగాళ్లకు చట్టం, పోలీసులు అంటేనో భయం లేకుండా పోయింది. డీఎంకే మంత్రుల నుంచి పోలీసుల వరకు లైంగిక నేరగాళ్లను కాపాడేందుకే యత్నిస్తున్నారని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై ఆరోపించారు.
కుటుంబ వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పు – కాంగ్రెస్‌ నేత శశి థరూర్‌ వ్యాఖ్య
భారత ప్రజాస్వామ్యానికి కుటుంబ వారసత్వ రాజకీయాలు తీవ్ర ముప్పుగా మారాయని కాంగ్రెస్‌ నేత శశి థరూర్‌ వ్యాఖ్యానించారు. రాజకీయ అధికారాన్ని సామర్థ్యం, నిబద్ధత, క్షేత్రస్థాయి బలం కన్నా.. కుటుంబ వారసత్వాలు నిర్ణయిస్తే పరిపాలన దెబ్బతింటుందని పేర్కొన్నారు. దేశంలో ఇలాంటి విధానాలకు స్వస్తి పలకాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. ‘భారత రాజకీయాలు – కుటుంబ వ్యవహారాలు’ అనే శీర్షికతో ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు గత నెల 31న రాసిన వ్యాసంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత రాజకీయాల్లో ఒక కుటుంబం దశాబ్దాలుగా పాతుకుపోయింది. కాంగ్రెస్‌కు చెందిన మాజీ ప్రధానులు నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ వరకు.. ఆ తర్వాత ప్రస్తుత కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ వరకు నెహ్రూ-గాంధీల కుటుంబం వారసత్వాలతోనే ముడిపడి ఉన్నారు. ఇది ఏ ఒక్క ప్రాంతానికో, పార్టీకో పరిమితం కాలేదు. ఒడిశాలో పట్నాయక్‌లు, మహారాష్ట్రలో ఠాక్రేలు, ఉత్తర్‌ప్రదేశ్‌లో ములాయం కుటుంబం ఇలా ప్రతిచోటా రాజకీయ నాయకత్వం జన్మహక్కు అన్నట్లు కుటుంబ వారసత్వాలు పాతుకుపోయాయి’’ అని థరూర్‌ అందులో పేర్కొన్నారు.
The post MK Stalin: ఎస్‌ఐఆర్‌పై సుప్రీంకోర్టుకు స్టాలిన్ పార్టీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

KTR: 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ – కేటీఆర్‌KTR: 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ – కేటీఆర్‌

KTR : గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏటా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ… ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలిచ్చిందో చెప్పాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు డిమాండ్‌ చేశారు. మరో ఎన్నికల హామీ అయిన