hyderabadupdates.com Gallery Minister Jupally Krishna Rao: బీఆర్‌ఎస్‌ పాలనపై మంత్రి జూపల్లి సంచలన కామెంట్స్

Minister Jupally Krishna Rao: బీఆర్‌ఎస్‌ పాలనపై మంత్రి జూపల్లి సంచలన కామెంట్స్

Minister Jupally Krishna Rao: బీఆర్‌ఎస్‌ పాలనపై మంత్రి జూపల్లి సంచలన కామెంట్స్ post thumbnail image

 
 
బీఆర్‌ఎస్‌ పాలనలో చేసిన అరాచకాలన్నీ ప్రజలకు తెలుసని, ఆ పార్టీకి మరోసారి ఓటుతో బుద్ధి చెప్పాలని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం ఎర్రగడ్డ డివిజన్‌లోని గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లు, కళ్యాణ్‌ నగర్‌ వెంచర్‌ త్రీ, రాజీవ్‌నగర్‌ కాలనీ, జయంతి నగర్‌ తదితర ప్రాంతాల్లో ఆయన ప్రచారం చేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ గెలిస్తే నియోజకవర్గంలో చేపట్టనున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
మార్నింగ్‌ వాక్‌లో భాగంగా కల్పతరు అపార్ట్‌మెంట్‌ వాసులను కలిసి నవీన్‌ యాదవ్‌(Naveen Yadav)ను గెలిపించాలని ఆయన కోరారు. అనంతరం స్పోర్ట్స్‌ లాంచ్‌కు వెళ్లి జిమ్‌లో వ్యా యామం చేశారు. అక్కడున్న వారితో షెటిల్‌ ఆడారు. కార్యక్రమంలో డైరీ కార్పొరేషన్‌ చైర్మన్‌ గుత్తా అమిత్‌రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్‌ సత్యం శ్రీరంగం, హైదర్‌నగర్‌ కార్పొరేటర్‌ నార్నె శ్రీనివాస్‌, కళ్యాణ్‌ నగర్‌ వెంచర్‌ త్రీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాగళ్ల నరసింహారావు పాల్గొన్నారు.
 
హైదరాబాద్‌లో వైద్యుడి ఇంట్లో రూ.3 లక్షల విలువైన డ్రగ్స్‌ సీజ్
 
హైదరాబాద్‌ నగరంలోని ఓ వైద్యుడి ఇంట్లో పోలీసులు డ్రగ్స్‌ పట్టుకున్నారు. ముషీరాబాద్‌లో అద్దెకు ఉంటున్న జాన్‌పాల్‌ అనే వైద్యుడి ఇంట్లో డ్రగ్స్‌ విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అతడి నివాసంలో తనిఖీలు చేపట్టి.. రూ.3 లక్షల విలువ చేసే డ్రగ్స్‌ను ఎక్సైజ్‌ ఎస్‌టీఎఫ్‌ పోలీసులు పట్టుకున్నారు. జాన్‌పాల్‌ను అరెస్టు చేసి ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌కు చెందిన ప్రమోద్‌, సందీప్‌, శరత్‌.. దిల్లీ, బెంగళూరు నుంచి డ్రగ్స్‌ తెప్పించి వైద్యుడు జాన్‌పాల్‌ ఇంట్లో ఉంచి విక్రయిస్తున్నారు. డ్రగ్స్‌ విక్రయించినందుకు గాను వైద్యుడికి వీటిని ఉచితంగా ఇస్తున్నారు. అతడి ఇంట్లో ఓజీకుష్‌, ఎండీఎంఏ, కొకైన్‌, హాష్‌ఆయిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
The post Minister Jupally Krishna Rao: బీఆర్‌ఎస్‌ పాలనపై మంత్రి జూపల్లి సంచలన కామెంట్స్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Nainar Nagendran: తొక్కిసలాట ఘటనకు డీఎంకే నేత కారణం – నైనార్ నాగేంద్రన్Nainar Nagendran: తొక్కిసలాట ఘటనకు డీఎంకే నేత కారణం – నైనార్ నాగేంద్రన్

    టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌ (Vijay) ర్యాలీలో తొక్కిసలాట ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రమాదానికి డీఎంకే పార్టీ మాజీ నేత సెంథిల్‌ బాలాజీనే కారణమని ఆరోపించారు. పథకం ప్రకారం