hyderabadupdates.com movies ‘కుబేర’ అక్కడ ఫెయిల్ అయ్యింది ఇందుకే

‘కుబేర’ అక్కడ ఫెయిల్ అయ్యింది ఇందుకే

కొన్ని బాక్సాఫీస్ ఫలితాలు అంతుచిక్కవు. అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి తరహాలో ఎంత విశ్లేషించుకున్నా వాటి వెనుక నిజాలు అర్థం కావు. కుబేరది అలాంటి పరిస్థితే. నెలల క్రితం వచ్చిన సినిమా ప్రస్తావన ఇప్పుడు తేవడానికి కారణం ఉంది. కుబేర నిర్మాణ సంస్థ అధినేత సునీల్ నారంగ్ కూతురు జాన్వీ నారంగ్ తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కుబేర ప్రస్తావన వచ్చింది. తెలుగు రాష్ట్రాలు, యుఎస్, యుకెలో యునానిమస్ గా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న మూవీ, ధనుష్ స్వంత రాష్ట్రమైన తమిళనాడులో ఫ్లాప్ కావడం అంతు చిక్కలేదని, ప్రమోషన్ల పరంగా తాము చేయాల్సిందంతా చేశామని చెప్పుకొచ్చారు.

ఇక్కడ అనాలిసిస్ చేసుకోవాల్సిన విషయాలు కొన్నున్నాయి. మొదటిది దర్శకుడు శేఖర్ కమ్ముల స్టైల్ తమిళ ప్రేక్షకులకు పరిచయం లేకపోవడం. హ్యాపీ డేస్, గోదావరి, లీడర్, ఆనంద్ లాంటివి ఎంత సక్సెస్ అయినా అవి కోలీవుడ్ లో రీమేక్ కాకపోవడానికి కారణమేంటో చెప్పనక్కర్లేదు. అక్కడి ఆడియన్స్ కి నచ్చేలా నేటివిటీని చూపించడంలో శేఖర్ కమ్ముల పడే తడబాటు ఆయన రీచ్ ని పరిమితం చేస్తుంది. రెండోది ధనుష్ పాత్రకు కమర్షియల్ టచ్ ఎక్కువగా లేకపోవడంతో తమిళ ఫ్యాన్స్ కు రుచించలేదు. దీంతో సహజంగానే కుబేరకు వాళ్ళు అంతగా కనెక్ట్ కాలేకపోయారు. వసూళ్ల మీద ఇది ప్రభావం చూపించింది.

ఇటీవలే వచ్చిన ఇడ్లి కొట్టు తమిళంలో చెప్పుకోదగ్గ స్థాయిలో డీసెంట్ గా ఆడితే తెలుగులో డిజాస్టర్ అయ్యింది. దీనికి రీజన్ అర్థమయ్యిందిగా. ఓవర్ సెంటిమెంట్ డోస్, ఎమోషన్స్, లోకల్ ఫ్లేవర్ మన దగ్గర పని చేయలేదు. దీంతో ఫ్లాప్ తప్పలేదు. అంతే కుబేరకు వచ్చిన రిజల్ట్ ఇడ్లి కొట్టుకి పూర్తిగా రివర్స్ అయ్యింది. ఫాంటసీ, మాస్ ఎలివేషన్లున్న సినిమాలే ప్యాన్ ఇండియా పరంగా వర్కౌట్ అవుతాయి కానీ కుబేర లాంటి డిఫరెంట్ కంటెంట్ అన్ని వర్గాలను మెప్పించలేదు. రాజమౌళి, ప్రశాంత్ నీల్, సుకుమార్ లాంటి వాళ్ళు ఇది దృష్టిలో ఉంచుకునే యునానిమస్ గా రీచ్ అయ్యే కథలనే తెరకెక్కిస్తారు. సక్సెసవుతారు.

Related Post

బిజీగా ఉన్నా కేడర్‌ను మర్చిపోని లోకేశ్బిజీగా ఉన్నా కేడర్‌ను మర్చిపోని లోకేశ్

ఈ నెల 14, 15వ తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌ను ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ స్థాయి పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు హాజరుకాబోతోన్న ఈ సదస్సు పనులను మంత్రి లోకేశ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ పనుల్లో

జంపింగుల‌కు మ‌రో 4 వారాల గ‌డువు: సుప్రీంజంపింగుల‌కు మ‌రో 4 వారాల గ‌డువు: సుప్రీం

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ పార్టీ నుంచి 2023 ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుని.. త‌ర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేసిన 10 మంది ఎమ్మెల్యేల వ్య‌వ‌హారం మ‌రోసారి సుప్రీంకోర్టులో విచారణ‌కు వ‌చ్చింది. ఈ విష‌యంలో త‌న‌కు స‌మ‌యం కావాలంటూ.. స్పీక‌ర్

తాండవానికి వేళయ్యింది అఖండాతాండవానికి వేళయ్యింది అఖండా

ఇంకో రెండు రోజుల్లో అఖండ 2 తాండవం నుంచి మొదటి ఆడియో సింగల్ రానుంది. తమన్ దీని గురించి తెగ ఊరిస్తున్నాడు. శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్ కలిసి పాడిన ఈ పాట వింటే నిద్ర పట్టలేదని, వెంటాడుతూనే ఉందని, ఇదంతా