hyderabadupdates.com movies బండ్ల గణేష్ కామెంట్… అరవింద్ స్ట్రాంగ్ కౌంటర్

బండ్ల గణేష్ కామెంట్… అరవింద్ స్ట్రాంగ్ కౌంటర్

ఈ మధ్య కాలంలో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ స్పీచులు చాలా దూరం వెళ్తున్నాయి. ఆయన ఉద్దేశం ఏదైనా ఎవరినో టార్గెట్ చేస్తున్నట్టు అంటున్న మాటలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. లిటిల్ హార్ట్స్ ఫంక్షన్ లో మౌళిని ఉద్దేశించి ఒకలా, కె ర్యాంప్ సక్సెస్ మీట్ లో కిరణ్ అబ్బవరంని పొగుడుతూ మరోలా రకరకాలుగా చర్చల్లో ఉంటూ వస్తున్నారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ని మోయడంలో బండ్ల గణేష్ తర్వాతే ఎవరైనా అనే స్థాయి నుంచి కాంట్రావర్సిలకు కేంద్రంగా మారిపోయిన బండ్ల గణేష్ ను వేడుకలకు పిలవడం మాత్రం నిర్మాతలు ఆపడం లేదు. వేరే సందర్భాల్లో ఆయన ప్రస్తావన రావడం చాలా అరుదు.

తాజాగా జరిగిన ది గర్ల్ ఫ్రెండ్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ కు ఒక ప్రశ్న ఎదురయ్యింది. ఆ మధ్య బండ్ల గణేష్ ఒక ఈవెంట్ లో ఈయన గురించి మాట్లాడుతూ చివరి నిమిషంలో వచ్చి క్రెడిట్ పట్టుకుపోతారని నేరుగా స్టేజి మీదే అనేశారు. దీంతో అక్కడికి వచ్చిన వాళ్ళు షాకయ్యారు. దానికి అప్పుడు అరవింద్ నవ్వుతూ స్పందించినా లోపల హర్ట్ అయ్యారని అందరూ అనుకున్నారు. ఇవాళ దాని గురించి అడిగిన క్వశ్చన్ కు అల్లు అరవింద్ బదులు చెబుతూ ఈ అంశం గురించి స్పందించడం తన స్థాయి కాదని ఒక్క మాటలో తేల్చేశారు. నో కామెంట్స్ అనకుండా ఓపెన్ గా రేంజ్ గురించి కుండబద్దలు కొట్టేశారు.

నిజమే మరి వందల కోట్ల పెట్టుబడులతో చిరంజీవితో మొదలుపెట్టి చరణ్ దాకా ఎన్నో భారీ సినిమాలు తీసిన అల్లు అరవింద్ ప్రత్యేకంగా ఎవరో క్రెడిట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ మాటకొస్తే బన్నీ వాస్, ఎస్కేఎన్ లాంటి హ్యాపెనింగ్ ప్రొడ్యూసర్లు బహిరంగంగానే అల్లు అరవింద్ ని తమ గురువుగా గైడ్ గా చెప్పుకుంటారు. అంత పెద్ద మనిషిని పట్టుకుని లాస్ట్ మినిట్ క్రెడిట్ తీసుకుంటారని చెప్పడం ముమ్మాటికి తప్పే. ఇప్పుడు అల్లు అరవింద్ రియాక్షన్ ముమ్మాటికీ రైటే. దీనికి బండ్ల గణేష్ మళ్ళీ వేరే చోట ఏదో ఒక రోజు స్పందించకపోరు. సోషల్ మీడియా జనాలు దాని కోసమే వెయిటింగ్.

Related Post

ప్రభావం చూపించిన బుధవారం ప్రీమియర్లుప్రభావం చూపించిన బుధవారం ప్రీమియర్లు

మిత్ర మండలి మీద అపారమైన నమ్మకం చూపించిన నిర్మాత బన్నీ వాస్, రిలీజ్ కు ముందు రోజు అది కూడా బుధవారం రాత్రి ప్రీమియర్లు వద్దని చాలా మంది వారించారని ప్రెస్ మీట్ లో చెప్పిన సంగతి తెలిసిందే. రెండు మూడు