hyderabadupdates.com movies దుమారం రేపిన కామెంట్లపై బండ్ల వివరణ

దుమారం రేపిన కామెంట్లపై బండ్ల వివరణ

బండ్ల గణేష్.. గత కొన్ని వారాల్లో టాలీవుడ్లో అత్యంత చర్చనీయాంశం అయిన పేరు ఇదే. ముందుగా లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ మీట్లో హీరో మౌళిని కొనియాడుతూ ఇండస్ట్రీలో మాఫియా ఉందంటూ కామెంట్ చేశాడు. అంతే కాక అల్లు అరవింద్ మీద పంచ్‌లు వేయడమే కాక.. మహేష్ బాబు, విజయ్ దేవరకొండల గురించి కూడా చిన్న నెగెటివ్ కామెంట్ చేశాడు బండ్ల. దీని మీద పెద్ద దుమారమే రేగింది.

ఇది కాస్త సద్దుమణిగే లోపే తాజాగా విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తూ ‘కే ర్యాంప్’ సక్సెస్ మీట్లో తీవ్ర వ్యాఖ్యలే చేసి మరోసారి వార్తల్లో నిలిచాడు. కొందరు ఒక హిట్టు పడగానే లూజు లూజు ప్యాంట్లేసుకుని.. కళ్ళజోడు, టోపీ పెట్టుకుని..‘వాట్సాప్ వాట్సాప్’ అంటూ స్టేజిమీద రెచ్చిపోయి తిరుగుతుంటారు.. అంటూ బండ్ల చేసిన కామెంట్ దుమారం రేపింది. పేరు పెట్టకపోయినా ఈ కామెంట్ విజయ్ దేవరకొండను ఉద్దేశించే అని అందరికీ అర్థం అయిపోయింది. విజయ్ ఫ్యాన్స్ బండ్లను టార్గెట్ చేశారు.

కష్టపడి సొంతంగా హీరోగా ఎదిగిన విజయ్ మీద ఈ కామెంట్స్ ఏంటని.. ఒక పెద్ద ఫ్యామిలీ హీరో మీద ఇలా మాట్లాడగలరా అని బండ్ల తీరును దుయ్యబట్టారు. తన కామెంట్స్ బాగా నెగెటివిటీ తెచ్చి పెట్టడంతో బండ్ల రెండు రోజుల గ్యాప్ తర్వాత రెస్పాండ్ అయ్యాడు. “ఇటీవల కె రాంప్ సినిమా సక్సెస్ మీట్‌లో నేను మాట్లాడిన మాటలు కొందరిని బాధపెట్టాయని తెలిసింది. నేను ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదు. నా ఉద్దేశం అందరూ బాగుండాలి, కళామాత ఆశీస్సులతో అందరం పైకి రావాలని మాత్రమే” అని తన ఎక్స్ హ్యాండిల్లో పెట్టిన పోస్టులో బండ్ల గణేష్ పేర్కొన్నాడు.

ఈ పోస్ట్ చూశాక అడుసు తొక్కనేల, కాలు కడగనేల అనే సామెత గుర్తుకు వస్తోంది. బండ్ల ఇలా వరుసగా వివాదాస్పద కామెంట్స్ చేస్తుండడంతో ఇకపై ఇండస్ట్రీలో ఎవరైనా ఏదైనా ఈవెంట్ కి ఆయన్ని పిలవాలంటే సంకోచించే పరిస్థితి కనిపిస్తోంది. ఇదిలా ఉంటే బండ్ల నిన్ననే ఇలాంటి క్లారిఫికేషన్ పోస్టు ఇంకోటి పెట్టాడు. తాను చిరంజీవితో సినిమా తీయబోతున్నట్లు వచ్చిన వార్తలను ఖండించాడు.

ఇటీవల కె రాంప్ సినిమా సక్సెస్ మీట్‌లో నేను మాట్లాడిన మాటలు కొందరిని బాధపెట్టాయని తెలిసింది. నేను ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదు.నా ఉద్దేశం అందరూ బాగుండాలి, కళామాత ఆశీస్సులతో అందరం పైకి రావాలని మాత్రమే.మీ బండ్ల గణేష్— BANDLA GANESH. (@ganeshbandla) November 5, 2025

Related Post

4 Tamil and Telugu Films to Watch on OTT This Week: Arun Vijay starrer Retta Thala to Aadi Saikumar’s Shambhala4 Tamil and Telugu Films to Watch on OTT This Week: Arun Vijay starrer Retta Thala to Aadi Saikumar’s Shambhala

Cast: Vikram Prabhu, LK Akshay Kumar, Anishma Anilkumar, Ananda Thambirajah, Harishankar Narayanan, Remya Suresh, Munnar Ramesh Director: Suresh Rajakumari Genre: Courtroom Crime Drama Runtime: 2 hours and 4 minutes Language:

‘రెడ్ బుక్ కు నా కుక్క కూడా భయపడదు’‘రెడ్ బుక్ కు నా కుక్క కూడా భయపడదు’

రెడ్ బుక్ ను చూస్తే వైసీపీ నేతలు వణికిపోతున్నారని, రకరకాల సాకులు చెప్పి అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారని మంత్రి లోకేశ్ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం మాత్రమే శిక్షిస్తామని, అటువంటి వారి పేర్లే రెడ్