hyderabadupdates.com movies అరవింద్ ఛాలెంజ్.. రేటింగ్ తక్కువ ఇవ్వలేరు

అరవింద్ ఛాలెంజ్.. రేటింగ్ తక్కువ ఇవ్వలేరు

ఈ శుక్రవారం రిలీజవుతున్న కొత్త చిత్రాల్లో బాగా ఆసక్తి రేకెత్తిస్తున్న మూవీ.. ది గర్ల్ ఫ్రెండ్. యానిమల్, పుష్ప-2 లాంటి భారీ చిత్రాల్లో నటిస్తున్న సమయంలోనే ఇలాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీని ఒప్పుకుని అందరికీ షాకిచ్చింది రష్మిక. ఈ మూవీ టీజర్, ట్రైలర్ ట్రెండీగా, బోల్డ్‌గా అనిపించాయి. మోడర్న్ రిలేషన్‌షిప్స్ మీద కాంప్లెక్స్ సబ్జెక్ట్ తీసుకుని ఇంట్రెస్టింగ్ మూవీ తీసినట్లే ఉన్నాడు యాక్టర్ టర్న్డ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్.

ఈ చిత్రాన్ని సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ సమర్పించగా.. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు. ‘ది గర్ల్ ఫ్రెండ్’ గురించి ప్రి రిలీజ్ ప్రెస్ మీట్ ఈవెంట్లో అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాకు తక్కువ రేటింగ్స్ ఇవ్వడానికి సమీక్షకులు ఇబ్బంది పడతారని ఆయనన్నారు. తాము ప్రొడ్యూస్ చేసే సినిమాలకు 1.5 నుంచి 3.5 వరకు రేటింగ్స్ వస్తుంటాయని.. కానీ ఈ సినిమాకు మాత్రం తక్కువ రేటింగ్ ఇవ్వడం కష్టమని.. ఇది అలాంటి కంటెంట్ ఉన్న సినిమా అని ఆయనన్నారు.

సినిమా ఆడనీ, ఆడనివ్వకపోనీ.. రేటింగ్ మాత్రం తక్కువ పడదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ప్రి రిలీజ్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ అతిథిగా వస్తారనే ప్రచారం నిజం కాకపోవడంపై అడిగిన ప్రశ్నకు అరవింద్ సమాధానం ఇచ్చారు. ఈ కార్యక్రమానికి రష్మికనే రాలేదని.. అలాంటపుడు విజయ్ ఎలా వస్తాడని ఆయనన్నారు. రిలీజ్ తర్వాత సక్సెస్ మీట్‌కు విజయ్‌ని తీసుకొస్తామని ఆయనన్నారు.

తన ప్రొడక్షన్లో భారీ చిత్రాలు రాకపోవడం గురించి ఆయన భలే చమత్కారంగా సమాధానం ఇచ్చారు. అలాంటి పెద్ద సినిమాలు తీయాలంటే బన్నీతో, చరణ్‌తోనే చేయాలని.. వాళ్లతో చేస్తే పెద్ద పారితోషకాలు ఇవ్వాలని.. తిరిగి అవి తమ ఇంటికే వస్తాయని.. అలా కాకుండా వాళ్లు వేరే వాళ్లతో సినిమాలు చేస్తే బయటి డబ్బులు ఇంటికి వస్తాయని.. అదే బెటర్ కదా అని ఆయన చమత్కరించారు.

Related Post

హిట్టు ‘భాగ్యం’ ఇవ్వాల్సింది ఆంధ్రకింగేహిట్టు ‘భాగ్యం’ ఇవ్వాల్సింది ఆంధ్రకింగే

హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకు అవకాశాలకు లోటు లేదు. ఆఫర్లు వస్తున్నాయి. ఏ ముహూర్తంలో దర్శకుడు హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ ఛాన్స్ ఇచ్చాడో కానీ అది డిజాస్టర్ అయినా సరే అమ్మడికి మాత్రం దశ తిరిగింది. పెద్ద బ్యానర్లు, స్టార్ హీరోలు