hyderabadupdates.com movies జగన్ నీకు సిగ్గుందా ? మహిళా మంత్రుల ఫైర్

జగన్ నీకు సిగ్గుందా ? మహిళా మంత్రుల ఫైర్

‘జగన్ నీకు అసలు సిగ్గుందా..? యువతను డ్రగ్స్ కు బానిసలుగా మారుస్తున్న వారితో సమావేశం ఏర్పాటు చేస్తావా అంటూ హోమంత్రి అనిత హాట్ కామెంట్స్ చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2019‌‌ 24 మధ్య దేశంలో గంజాయి ఎక్కడ దొరికినా దాని మూలాలు ఏపీలోనే ఉన్నాయని చెప్పకొనే పరిస్థితి ఉందన్నారు. అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ గా ఉన్న రాష్ట్రానిన గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చిన ఘనత జగన్ ది అని ఆరోపించారు.

స్కూలు పిల్లల బ్యాగుల్లోకి కూడా గంజాయిని చేర్చిన ఘనత ఆయనదే అన్నారు. తాను అధికారంలో ఉన్నపుడు జగన్ఏనాడైనా డ్రగ్స్, గంజాయిపై ఒక్క సమీక్ష అయినా నిర్వహించారా అని ప్రశ్నించారు. యువత భవిష్యత్  పై మాట్లాడే హక్కు జగన్ కు లేదన్నారు. డ్రగ్స్ దందా చేసిన వాళ్లకు జగన్ వత్తాసు పలుకుతారా అని అనిత ప్రశ్నించారు. తాము అధికారలోకి వచ్చిన తర్వాత ఈగల్ స్థాపించి ఏడాదిన్నరలో జీరో గంజాయి గా మర్చామన్నారు. డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదాన్ని స్కూలు స్థాయిలోకి తీసుకు వెళుతున్నామన్నారు.  

అదే విధంగా మరో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి విశాఖలో విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 14, 16 తేదీల్లో విశాఖలో జరిగే సదస్సు వల్ల ఉత్తరాంధ్రకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రాష్ట్రానికి దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా విశాఖలో భాగస్వామ్య సదస్సు జరుగుతుందన్నారు. రాష్ట్రానికి మేలు జరుగుతుంటే కుట్రలతో అడ్డుకోవాలని చూస్తారా అంటూ ధ్వజం ఎత్తారు. రైతు పరామర్శల పేరుతో జగన్ విన్యాసాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. జగన్ మాట్లాడే ముందు వాస్తవ పరిస్థితులపై అవగహన పెంచుకుంటే మంచిదని హితవు పలికారు.

Related Post

రష్మిక మందన్న మీదే భారమంతారష్మిక మందన్న మీదే భారమంతా

వచ్చే వారం అక్టోబర్ 21 బాలీవుడ్ మూవీ ధామా విడుదల కానుంది. హిందీతో పాటు తెలుగు డబ్బింగ్ వెర్షన్ ని సమాంతరంగా రిలీజ్ చేస్తున్నారు. కారణం రష్మిక మందన్న. గతంలో ఇదే నిర్మాణ సంస్థ మాడాక్ ఫిలిమ్స్ తీసిన స్త్రీ 2ని