hyderabadupdates.com movies బ్రో 2……అవసరమా అధ్యక్ష్యా !

బ్రో 2……అవసరమా అధ్యక్ష్యా !

సీక్వెల్స్ కి క్రేజ్ ఉంటుంది. మొదటి భాగాలు బ్లాక్ బస్టర్ అయినప్పుడే వీటిని తీస్తే అందం చందం. అంతే తప్ప ప్రతిదానికి పార్ట్ 2 తీయాలని పరుగులు పెట్టకూడదు. ఈ మధ్య అభిమానులు ఎవరైనా దర్శక నిర్మాతలను కలిసినప్పుడు ఫలానా సినిమాకు కొనసాగింపు ఎప్పుడు ఉంటుందని అడిగేస్తున్నారు. నిజాంగా వాటికి క్రేజ్ ఉందా లేదాని ఆలోచించడం లేదు. మిరాయ్ ప్రమోషన్లలో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనిని ఈగల్ 2 గురించి ప్రశ్న ఎదురయ్యింది. ఫస్ట్ పార్ట్ ఫ్లాప్ అయిన సంగతి మర్చిపోయి ఇప్పుడు ఇంకోటి తీయమనడం భావ్యం కాదు. ఇదే సిచువేషన్ సముతిరఖనికి తాజాగా జరిగిన కాంత ఈవెంట్ లో ఎదురయ్యింది.

పవన్ కళ్యాణ్ బ్రోకి కంటిన్యుయేషన్ ఎప్పుడు ఉంటుందని అడిగిన క్వశ్చన్ కు సమాధానంగా సముతిరఖని మాట్లాడుతూ స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని, పవర్ స్టార్ అంగీకారం వస్తే మొదలుపెట్టడమేనని సెలవిచ్చారు. వినడానికి బాగానే ఉంది కానీ బ్రో కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాలేదన్నది ఓపెన్ సీక్రెట్. నిర్మాత విశ్వప్రసాదే ఒప్పుకున్న దాఖలాలు ఉన్నాయి. ఏదో పవన్ ఇమేజ్ పుణ్యమాని థియేటర్ రెవిన్యూ, నాన్ థియేట్రికల్ హక్కులతో ఓ మోస్తరుగా గట్టెక్కింది కానీ కంటెంట్ పరంగా ఆడియన్స్, ఫ్యాన్స్ ని అంతగా మెప్పించలేకపోయింది. అందుకే బ్రోని స్పెషల్ గా ఫీలయ్యే అభిమానులు తక్కువే.

అసలు బ్రో 2 బదులు సముతిరఖని ఏదైనా కొత్త కథతో పవన్ కళ్యాణ్ సినిమా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే బ్రోలో ఆల్రెడీ సాయి దుర్గ తేజ్ క్యారెక్టర్ చనిపోయింది. ఇప్పుడు కొత్తగా వేరొకరిని తీసుకురావాలి. ఇలాంటి పాత్రలు పవన్ గతంలో గోపాల గోపాలలోనూ చేశాడు. పదే పదే దేవుడిగా చూపించడం సబబు కాదు. అయినా ఇంకా సురేందర్ రెడ్డితో చేయాల్సిన సినిమా పెండింగ్ లో ఉంది. ఓజికి సీక్వెల్, ప్రీక్వెల్ చేయాలని పవన్ కి చాలా ఉత్సాహంగా ఉంది. ఈ లెక్కన బ్రో 2 అనేది జరగని పని. అయితే ఒరిజినల్ వెర్షన్ వినోదయ సితం 2ని తెరకెక్కించే ఆలోచనైతే సముతిరఖనికి ఉంది. తమిళంలో ఇది సూపర్ హిట్ మూవీ మరి.

Related Post

బీజేపీ టాక్‌: బండి సంజ‌య్ ఎక్క‌డ‌?బీజేపీ టాక్‌: బండి సంజ‌య్ ఎక్క‌డ‌?

కీలకమైన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల సమయంలో బిజెపి ఫైర్ బ్రాండ్ నాయకుడు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఎక్కడా కనిపించకపోవడం గ‌మ‌నార్హం. అంతేకాదు.. ఆయన మాట వినిపించకపోవడం బిజెపి వర్గాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా ఆసక్తిగా మారుతోంది. తెలంగాణ