hyderabadupdates.com movies కలవడానికి ముందు సై అంటే సై

కలవడానికి ముందు సై అంటే సై

ఈ శుక్రవారం తెలుగులో మూడు సినిమాలు బాక్సాఫీస్ పోరుకు రెడీ అయ్యాయి. అందులో ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం.. రష్మిక మందన్నా లీడ్ రోల్ చేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’. ఈ సినిమా గురించి విడుదలకు ముందే ఇండస్ట్రీలో గొప్పగా మాట్లాడుకుంటున్నారు. మరోవైపు మంచి సినిమాలే చేస్తున్నా కోరుకున్న విజయం దక్కని సుధీర్ బాబు.. ఈసారి ట్రెండుకు తగ్గట్లుగా డివైన్ టచ్ ఉన్న హార్రర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆ చిత్రమే.. జటాధర. తిరువీర్ హీరోగా నటించిన ‘ది గ్రేట్ ప్రి వెడ్డింగ్ షో’ కూడా పెయిడ్ ప్రివ్యూలతో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. 

ఐతే ప్రస్తుతానికి ప్రధాన పోటీ రష్మిక, సుధీర్ చిత్రాల మధ్య ఉంది. వీటికి తోడుగా తమిళ అనువాదం ‘ఆర్యన్’ కూడా రిలీజవుతోంది. విశేషం ఏంటంటే.. రేపు బాక్సాఫీస్ దగ్గర ఢీకొట్టబోతున్న హీరో సుధీర్ బాబు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్.. ఆ తర్వాత కలిసి పని చేయబోతున్నారు. సుధీర్ బాబు తన కొత్త చిత్రాన్ని రాహుల్ దర్శకత్వంలోనే చేయబోతున్నట్లు వెల్లడించాడు. ‘చి ల సౌ’తో అందరినీ ఆశ్చర్యపరిచి.. ‘మన్మథుడు-2’తో షాక్ తిన్న రాహుల్.. ‘ది గర్ల్ ఫ్రెండ్’తో బౌన్స్ బ్యాక్ అయ్యేలానే కనిపిస్తున్నాడు. 

దీని తర్వాత అతను సుధీర్ బాబుతో ఒక సెన్సేషనల్ మూవీ చేయనున్నాడట. అలాంటి కథ ఇప్పటిదాకా ప్రపంచంలో ఎక్కడా రాలేదని ఎలివేషన్ ఇస్తున్నాడు సుధీర్ బాబు. అదొక బాహుబలి తరహా సినిమా అని కూడా అతను చెప్పడం విశేషం. సుధీర్ అంతగా చెబుతుండడంతో ఏంటా కాన్సెప్ట్ అనే ఆసక్తి కలుగుతోంది. దీంతో పాటు ఎప్పట్నుంచో వాయిదా పడుతూ వస్తున్న పుల్లెల గోపీచంద్ బయోపిక్‌లోనూ తాను నటించాల్సి ఉందని సుధీర్ తెలిపాడు. ‘భాగి’లో విలన్ రోల్ చేశాక హిందీ నుంచి చాలా ఛాన్సులు వచ్చినా తాను నటించలేదని.. ‘జటాధర’తో హిందీ ప్రేక్షకులను కూడా ఆకట్టకుంటాననే నమ్మకం ఉందని సుధీర్ బాబు తెలిపాడు.

Related Post

మాస్ జాత‌ర వాయిదా.. నిజం ఒప్పుకున్న నిర్మాత‌మాస్ జాత‌ర వాయిదా.. నిజం ఒప్పుకున్న నిర్మాత‌

మాస్ రాజా ర‌వితేజ కొత్త సినిమా మాస్ జాత‌ర వేస‌విలోనే విడుద‌ల కావాల్సింది. కానీ ఆ స‌మ‌యానికి సినిమాను రెడీ చేయ‌లేక వాయిదా వేశారు. జులైలో ఒక డేట్ అనుకుని, అప్పుడు కూడా కుద‌ర‌క వెనుకంజ వేశారు. చివ‌రికి ఆగ‌స్టు 27న