కార్తీక పౌర్ణమి వేళ… ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. సూపర్ మూన్ ఏర్పడింది. నవంబర్ 5వ తేదీ ఆకాశంలో చంద్రుడు సాధారణంగా కంటే పెద్దగా.. మరింత ప్రకాశవంతంగా కనిపించాడు. బుధవారం సాయంత్రం సరిగ్గా 6.49 గంటలకు చందమామ ఈ కనువిందు చేశాడు. అయితే మాములుగా కంటే.. చంద్రుడు 13 శాతం అధికంగా.. 30 శాతం ప్రకాశవంతంగా కనిపిస్తోంది. దీనినే బీవర్ సూపర్ మూన్ అని పిలుస్తారు. ఈ సూపర్ మూన్ ఈ ఏడాదిలో ఏర్పడిన రెండోది.
చంద్రుడు… భూమి చుట్టూ తిరిగే కక్ష్య పూర్తిగా వృత్తాకారంలో ఉండదు. కానీ కక్ష్యలో తిరిగే సమయంలో భూమికి చంద్రుడు దగ్గరగా.. దూరంగా వెళ్తుంటాడు. ఈ పౌర్ణమి వేళ.. చంద్రుడు తన కక్ష్యలో భూమికి సమీపానికి వచ్చినప్పుడు సూపర్ మూన్ అని పిలుస్తారు. ఈ సమయంలో భూమికి చంద్రుడు దాదాపు 3,57,000 కిలోమీటర్ల దూరంలో ఉంటారు. ఈ నేపథ్యంలో సాధారణ పౌర్ణమి కంటే చంద్రుడు పెద్దగా కనిపించాడు. చంద్రుడు చేరుకునే సమయంలో భూమి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యకు సమీపంలో ఉన్న పెరజీ వద్ద సూపర్ మూన్ సంభవిస్తోంది.
దేవ్ దీపావళి వేళ దేదీప్యమానంగా కాశీ
కార్తిక పౌర్ణమి సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని పవిత్ర కాశీ నగరంలో దేవ్ దీపావళి వేడుకలు అంబరాన్నంటాయి. ప్రధాని మోదీ సొంత నియోజకవర్గమైన కాశీ దీపాల వెలుగులతో దేదీప్యమానమైంది. గంగానదీ ఘాట్‌లలో భక్తులు లక్షలాది దీపాలను వెలిగించారు. వేడుకకు సంబంధించిన ఫొటోలను ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పంచుకున్నారు. ‘కాశీలో అద్భుతమైన దేవ్ దీపావళి’ అని పేర్కొన్నారు. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఈ వేడుకలకు హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా లేజర్, ఫైర్‌వర్క్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. గంగా ఘాట్‌ల వద్ద నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలతో ఆధ్మాత్మికత వెల్లివిరిసింది.
The post Super Moon: కార్తీక పౌర్ణమి వేళ సూపర్ మూన్ కనువిందు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Super Moon: కార్తీక పౌర్ణమి వేళ సూపర్ మూన్ కనువిందు
Categories: