hyderabadupdates.com Gallery Minister Kiran Rijiju: రాహుల్ గాంధీకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్ట్రాంగ్ కౌంటర్

Minister Kiran Rijiju: రాహుల్ గాంధీకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్ట్రాంగ్ కౌంటర్

Minister Kiran Rijiju: రాహుల్ గాంధీకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్ట్రాంగ్ కౌంటర్ post thumbnail image

 
 
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్‌తో కుమ్మక్కయినందు వల్లే బీజేపీ గెలిచిందంటూ కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తిప్పికొట్టారు. రాహుల్ ఆరోపణల్లో ఎంతమాత్రం నిజం లేదన్నారు. బిహార్ ఎన్నికలకు ముందు ‘దృష్టి మళ్లించే వ్యూహాలకు’ రాహుల్ పాల్పడుతున్నారని బుధవారంనాడిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అన్నారు.
 
‘రాహుల్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే మీడియా ముందుకు వచ్చారు. బిహార్‌లో పోలింగ్ (గురువారం) జరుగనుండగా హర్యానా గురించి ఆయన కథలు అల్లుతున్నారు. బిహార్‌లో కాంగ్రెస్‌కు ఒరిగేదేమీ లేదనే విషయం గ్రహించే హర్యానా అశంతో జనం దృష్టి మరలించే చర్యలకు దిగారు’ అని రిజిజు చెప్పారు. విపక్ష నేత సీరియస్ అంశాలు ప్రస్తావించాలే కానీ అనవసర విషయాలు ప్రస్తావించి సమయం వృథా చేయరాదని సలహా ఇచ్చారు.
బ్రెజిలియన్ మోడల్ ఫోటో
హర్యానా ఎన్నికల్లో బ్రెజిలియన్ మోడల్‌ ఫోటోగ్రాఫ్‌ను వివిధ పేర్లతో వాడుకున్నారని రాహుల్ చేసిన ఆరోపణలను కూడా రిజిజు తోసిపుచ్చారు. 25 లక్షల నకిలీ ఓట్లున్నాయని రాహుల్ చెప్పడాన్ని రాజకీయ ఉద్దేశాలతో అల్లిన డ్రామాగా ఆయన అభివర్ణించారు. రాహుల్ గాంధీ విదేశీ పర్యటనల్లో సమాచారం సేకరించి దాన్ని ఇండియాలో వర్తింపజేయాలని చూస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో ఓటమిని కప్పిపుచ్చుకునేందుకే రాహుల్ అబద్ధాలను వ్యాప్తి చేస్తున్నారని, ప్రతిపక్ష నాయకునిగా బాధ్యతతో వ్యవహరించాలే కానీ అనవసర అంశాలతో సమయం వృథా చేయడం తగదని అన్నారు.
The post Minister Kiran Rijiju: రాహుల్ గాంధీకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్ట్రాంగ్ కౌంటర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Road Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం ! తొమ్మిది మంది మృతి !Road Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం ! తొమ్మిది మంది మృతి !

      మహారాష్ట్రలో పుణే – బెంగళూరు జాతీయ రహదారిలోని నవలే వంతెనపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కంటైనర్ ట్రక్.. ఎదురుగా వస్తున్న వాహనాలను వేగంగా ఢీ కొట్టంది. ఆ వెంటనే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Ravi Teja’s Mass Jathara ‘Super Duper’ Track Takes the Buzz to New HeightsRavi Teja’s Mass Jathara ‘Super Duper’ Track Takes the Buzz to New Heights

Mass Jathara, a much awaited movie featuring Ravi Teja and Sreeleela, is preparing for a massive cutout with its release on the horizon, and the producers are intensifying their promotions