hyderabadupdates.com Gallery YS Jagan: అక్రమాస్తుల కేసులో మెమో దాఖలు చేసిన మాజీ సీఎం జగన్

YS Jagan: అక్రమాస్తుల కేసులో మెమో దాఖలు చేసిన మాజీ సీఎం జగన్

YS Jagan: అక్రమాస్తుల కేసులో మెమో దాఖలు చేసిన మాజీ సీఎం జగన్ post thumbnail image

 
 
ఆంధ్ర‌ప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన అక్రమాస్తుల కేసుకు సంబంధించి మాజీ సీఎం జగన్ మరో నిర్ణయం తీసుకున్నారు. అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. యూరప్ పర్యటన తర్వాత ఈనెల 14 లోపు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని గతంలో జగన్ ను సీబీఐ కోర్టు ఆదేశించింది. న్యాయస్థానం ఇచ్చిన గడువు సమీపిస్తుండడంతో సీబీఐ కోర్టులో ఆయన మెమో దాఖలు చేశారు. వ్యక్తిగత హాజరు మినహయించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. సీబీఐ కోర్టు ముందు తాను హాజరు సమయంలో రాష్ట్ర యంత్రాంగం ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని… ఇది యంత్రాంగానికి భారమని ప్రస్తావించారు. తప్పనిసరిగా వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని కోర్టు భావిస్తే హాజరయ్యేందుకు తాను సిద్ధమేనని స్పష్టం చేశారు. కోర్టు అనుమతిస్తే తాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
 
ఉల్లి రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం
 
ఉల్లి రైతుల్ని ఆదుకోవాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. ఇందుకోసం హెక్టారుకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం ఇవ్వబోతోంది. ఫలితంగా కర్నూలు, కడప జిల్లాల్లోని 20,913 మంది రైతులకు రూ. 104.57 కోట్ల మేర లబ్ధి చేకూరుతుంది. ఈ-పంట ఆధారంగా ఈ సహాయం అందుతుంది. దీనివల్ల 45 వేల ఎకరాల్లో ఉల్లి పండించిన రైతులకు మేలు జరుగుతుంది. ఇప్పటికే ఉల్లి కొనుగోలులో మార్కెటింగ్ శాఖ, మార్క్‌ఫెడ్‌ కీలక పాత్ర పోషించాయి. క్వింటాల్ ఉల్లి రూ.1,200 చొప్పున, మొత్తం రూ.18 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశాయి. దీనికి సంబంధించి రూ.10 కోట్లు ఇప్పటికే రైతులకు చెల్లించారు. మిగిలిన రూ.8 కోట్లను కూడా త్వరలోనే అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు నిన్న వెల్లడించారు.
వివిధ పరిస్థితుల కారణంగా ఈసారి క్వింటా ఉల్లి రూ.600 కంటే ఎక్కువ ధర పలకలేదు. దీంతో ప్రభుత్వం క్వింటా రూ.1,200 చొప్పున సుమారు లక్షా 39 వేల క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేసింది. కర్నూలు మార్కెట్ యార్డుకు వచ్చిన ఉల్లిని దాదాపుగా సేకరించింది. కొంత ఉల్లిని రైతుబజార్లకు, మరికొంత ఉల్లిని వ్యాపారులకు తరలించి విక్రయించింది. అయినప్పటికీ కొంతమంది రైతుల వద్ద ఇంకా ఉల్లి మిగిలి ఉంది. గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నారని గుర్తించిన ప్రభుత్వం.. ఉల్లి సాగు చేసిన రైతులకు హెక్టారుకు రూ.50వేల చొప్పున అందించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. దీనికి సంబంధించిన నియమనిబంధనల మేరకు లబ్దిదారులకు అందించబోతున్నారు.
 
శబరిమలకు 60 కి పైగా స్పెషల్ ట్రైన్స్
 
కేరళలోని శబరిమలకు వెళ్లి అయ్యప్పస్వామిని దర్శించే భక్తులకు ఇండియన్ రైల్వే గుడ్‌న్యూస్. ఇందుకోసం దక్షిణ మధ్య రైల్వే 60 పైగా ప్రత్యేక రైళ్లు నడుపబోతోంది. డిసెంబర్ నుంచి జనవరి వరకు ఈ ప్రత్యేక రైళ్లు నడపనుంది. ఇందులో చర్లపల్లి, కాచిగూడ, మచిలీపట్నం, నర్సాపూర్, కాకినాడ, విశాఖపట్నం నుంచి కొల్లం, కొట్టాయం వరకు సర్వీసులు ఉంటాయి. ఈ ట్రైన్స్ లో ప్రయాణించాలను కునే వాళ్లు.. నేటి నుంచి ముందస్తు టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకోవచ్చు.
The post YS Jagan: అక్రమాస్తుల కేసులో మెమో దాఖలు చేసిన మాజీ సీఎం జగన్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Dr Shaheen: పుల్వామా మాస్టర్‌మైండ్‌ తో డాక్టర్ షహీన్‌ కు లింకులు ?Dr Shaheen: పుల్వామా మాస్టర్‌మైండ్‌ తో డాక్టర్ షహీన్‌ కు లింకులు ?

      ఫరీదాబాద్ పేలుడు పదార్థాల కేసులో అరెస్టయిన డాక్టర్ షహీన్ సయీద్‌పై ఎన్‌ఐఏ జరుపుతున్న దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పుల్వామా దాడుల మాస్టర్ మైండ్ ఉమర్ ఫారుక్‌ భార్య అపీరా బీబీతో సంబంధాలున్నట్లు దర్యాప్తు సంస్థలు

Sabarimala: శబరిమల బంగారం కేసు వెనుక భారీ కుట్ర – కేరళ హైకోర్టుSabarimala: శబరిమల బంగారం కేసు వెనుక భారీ కుట్ర – కేరళ హైకోర్టు

    శబరిమల అయ్యప్ప దేవాలయంలోని విగ్రహాల బంగారం తాపడం బరువు వ్యత్యాసం కేసులో ఏదైనా కుట్ర జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)కు కేరళ హైకోర్టు సూచించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉన్ని కృష్ణన్‌

Nayanar Nagendran: మా కూటమిలోకి విజయ్‌ వస్తే స్వాగతిస్తాం – బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్‌Nayanar Nagendran: మా కూటమిలోకి విజయ్‌ వస్తే స్వాగతిస్తాం – బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్‌

    తమ కూటమిలోకి ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత విజయ్‌ వస్తే ఘనంగా స్వాగతిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే నయినార్‌ నాగేంద్రన్‌ పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీపీ రాధాకృష్ణన్‌ ఈ నెల 28న కోవైలో